సరైన నిర్ణయం తీసుకున్న అలీ … అలీ రాజీనామాతో ysr కాంగ్రెస్ కు ఒక ఓటు పెరిగేది లేదు … తగ్గేది లేదు … పార్టీపై ప్రభావం ఉండదు . కానీ అలీ జీవితంపై చాలా ప్రభావం ఉంటుంది … రాజీనామా చేయకపోతే తన సినిమా జీవితానికి వీలునామా రాసుకోవలసి వచ్చేది …
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నటులు, సినిమా వాళ్ళు తమకు ఇష్టం ఉన్న పార్టీలో ఉండేవారు . అంటే దాదాపు మొత్తం టీడీపీలోనే … ధర్మవరపు సుబ్రహ్మణ్యం , వాణిశ్రీ , జమున వంటి కొద్ది మందిని మినహాయిస్తే అంతా టీడీపీలోనే … ( రోజా టీడీపీ నుంచి ysr కాంగ్రెస్ కు ) ఐనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని టీడీపీకి ఎవరూ రాజీనామా చేయలేదు …
శ్యామల అనే చోటా నటి నుంచి అలీ వరకు ఎవరినీ వదలరు … నరసింహారాజు అనే ఓ నటుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు విమర్శించి నా దేశం పేరుతో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు . నరసింహా రాజు అంటే ఆయనెవరు అనే సందేహం సహజమే … నరసింహారాజు హీరోగా వెలిగిపోతున్నప్పుడు అతని సినిమాలో చిరంజీవి విలన్ పాత్రలో నటించారు … కొత్త పార్టీ అనే ఆ ఒక్క మాటతో నరసింహరాజు హీరో నుంచి దిగిపోయి చివరకు బతుకు తెరువు కోసం దూరదర్శన్ సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించి బతికారు … సినిమాల్లో, ప్రైవేట్ ఛానల్స్ లో కూడా అతనికి అవకాశాలు లేవు ..
Ads
చివరకు ప్రచారానికి రాలేదు అని జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల కాగానే ఫ్లాప్ అని విస్తృతంగా ప్రచారం చేస్తారు / చేశారు … రాష్ట్రంలో / రాష్ట్రాల్లో. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సినిమా పరిశ్రమ మాత్రం వారి గుప్పిటలోనే ..
ఎన్టీఆర్ ను దించినప్పుడు కూడా సినిమా వాళ్ళు అందరూ బాబు నాయకత్వంలోని టీడీపీకే మద్దతు ఇచ్చారు . 2004 ఎన్నికల్లో మా అధ్యక్షుడు మురళీ మోహన్ మొదలుకొని కొన్ని డజన్ల మంది నటీనటులు ఎన్టీఆర్ భవన్ లో కనిపించేవారు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా వారిలో ఒక్కరు కూడా టీడీపీకి రాజీనామా చేయలేదు .
అందాల రాముడులోని లత, బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి సీత గీతాంజలి మొదలుకొని జయసుధ, జయప్రద, లయలను సైతం ఎన్టీఆర్ భవన్ లోనే చూశాను .. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా వీళ్ళు టీడీపీని వీడలేదు … సినిమా రంగంలో ఉండాలి అంటే ఏ పార్టీలో ఉండాలో వారికి బాగా తెలుసు . ఏ పార్టీలో ఉండకూడదో అలీకి తెలుసు .
87 ఏళ్ల వయసులో ms రెడ్డి నేను ఇంకా ఎవరికి భయపడాలి అని ధైర్యంగా ఆత్మకథలో అందరి గురించి రాశారు … ఇంకా సినిమా టివి, భవిష్యత్తు ఉన్న వాళ్ళ కుమారుడు మాత్రం తండ్రి ఆత్మకథను మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు … తండ్రి నిర్ణయం సరైనదే, కొడుకు నిర్ణయం కూడా సరైనదే …! By బుద్ధా మురళి
Share this Article