గుర్తుంది కదా… అప్పట్లో రాంచరణ్ మొహకవళికల్ని మార్పించడానికి సర్జరీలు చేయించినట్టుగా ప్రముఖ రచయిత యండమూరి ఏదో వేదికపై చెప్పాడు… ఇక చూసుకో రచ్చ… మామూలుగా చిరంజీవి ఇలాంటి సందర్భాల్లో నాగబాబును తెరపైకి తెస్తాడు కదా… ఇంకేముంది..? నాగబాబు యండమూరిపై ఫైరయ్యాడు… (సేమ్, రాంగోపాలవర్మ, గరికపాటిలపై కూడా…)
తరువాత ఫ్యాన్స్ యండమూరి మీద విపరీతంగా ట్రోలింగ్ నడిపారు… అఫ్‌కోర్స్, ఇప్పుడు అదే రచయిత చిరంజీవి బయోగ్రఫీ రాయబోతున్నాడు.,. చిరంజీవే రాయించుకుంటున్నాడు… ప్లాస్టిక్ సర్జరీలు ఇప్పుడేమీ కొత్త కాదు, అప్పటి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి చిన్నాచితకా నటీనటుల కాస్మొటిక్ సర్జరీల దాకా చాలా కామన్ అయిపోయాయి…
ఇప్పుడు తాజాగా ఎవరో ప్లాస్టిక్ సర్జన్ ఎవరికో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ మళ్లీ ఆ పాత యండమూరి వ్యాఖ్యల్ని గుర్తుచేసింది… ఈ వీడియో బిట్‌లో ఇంటర్వ్యూయర్ పలువురు సినిమా సెలబ్రిటీల పాత మొహాలను కొత్త మొహాలను పక్కపక్కన పెట్టి ప్రశ్నలు అడిగాడు… సదరు సర్జనుడు అలా చూసి, మొహంలో ఏయే పార్ట్‌కు సర్జరీ చేశారో అంచనా వేసి చెబుతున్నారు… తను స్వతహాగా సర్జన్ కాబట్టి జనం నమ్మేస్తారు… సోషల్ మీడియా జర్నలిస్టులు భలే తంపులు పెడతారబ్బా..!
Ads
ఈ లింక్ చూడండి, అర్థమవుతుంది…
దుల్కర్ సల్మాన్ ముక్కుకు, దీపిక పడుకోన్ ముక్కుకు సర్జరీలు జరిగినట్టు తేల్చేశాడు ఆయన… అమీ జాక్సన్, శోభిత ధూళిపాళలకూ సర్జరీలు జరిగాయన్నాడు… అల్లు అర్జున్ అలియాస్ బన్నీకి నోరు, ముక్కు సర్జరీలు జరిగాయన్నాడు… ఇందులో బన్నీ బాపతు వివరణ మేరకు కట్ చేసి సోషల్ మీడియాలో ఎవరో వైరల్ చేస్తున్నారు…
అసలే ఈమధ్య మెగా ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ ఫ్యాన్స్ వార్ నడుస్తోంది కదా… నిజానికి నెపో కిడ్స్‌ను ఇండస్ట్రీలోకి దింపేముందు మొహంలో ఏమైనా మార్పులు అవసరముంటే చిన్నచిన్న కాస్మొటిక్ సర్జరీలు చేయడం అత్యంత సాధారణం… కాకపోతే బయటికి చెప్పరు… అవును, తెరకు అనుగుణంగా మొహాలు మారాలి కదా… పైగా కొందరికి చిన్నతనంలో ఉండే మొహాలకు కొంత వయస్సొచ్చాక కనిపించే మొహాలకు తేడా ఉంటుంది… సహజంగా మారుతుంటారు…
సో, బన్నీకి జరిగిన ప్లాస్టిక్ సర్జరీలు పెద్ద విశేషమేమీ కాదు… ఏమో, సహజంగానే చిన్నప్పటికీ ఇప్పటికీ మారి ఉండవచ్చు కూడా… శ్రీదేవి తన మొహానికి ఎన్ని సర్జరీలు చేయించుకుందో,.. ముగ్ధగా, ముద్దుగా ఉండే మొహం చివరకు మైఖేల్ జాక్సన్ మొహంలా మారిపోయింది చివరకు… మొన్నీమధ్య ఓ టీవీ నటి తన పెదాలు కాస్త లావుగా కనిపించేందుకు ఫిల్లర్స్ వేయించుకున్నట్టు చెప్పింది…
ఇవేకాదు, బ్రెస్ట్ సరిచేయించుకునేవాళ్లు, పిరుదుల మీద అధిక కొవ్వును సర్జరీ ద్వారా తీయించుకునేవాళ్లు కూడా బోలెడుమంది… అందంగా కనిపించడం సినిమా ఫీల్డులో అవసరం కాబట్టి చేయించుకుంటారు… ఒబేసిటీని తగ్గించుకోవడానికి పేరుకు పవర్ జిమ్, డైట్ చేంజ్ అని బయటికి చెబుతారు కానీ జరిగేవి బేరియాట్రిక్ సర్జరీలే… ఈ నేపథ్యంలో బన్నీ కాస్మొటిక్ సర్జరీలు అసాధారణమైతే కాదు… కానీ ఇండస్ట్రీలో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతిదీ గోకే వార్తే కదా…!!
Share this Article