Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏలియన్స్ ఉన్నారట చంద్రుడిపై… ఎవరినీ అక్కడ దిగనివ్వడం లేదట…

August 20, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి   రష్యా ప్రయోగించిన Luna-25 మూన్ లాండర్ విఫలం అయ్యింది! చంద్రుడి దక్షిణ ధృవం మీద లాండ్ అవాల్సిన Luna-25 శనివారం రోజున చంద్రుడి దక్షిణ ధృవం మీద సురక్షితంగా దిగాల్సి ఉండగా కుప్ప కూలి పోయింది! చాలా మంది అనుకుంటున్నట్లు భారత్ కంటే ముందుగా రష్యా చంద్రుడి మీదకి తన ల్యాండర్ ని పంపి క్రెడిట్ కొట్టేయాలని చూసింది అని అనడం తప్పు!

నిజానికి 2023 ఆగస్టులో చేసిన ప్రయోగం ఏదయితే ఉందో అది గత సంవత్సరం అంటే, 2022 సెప్టెంబర్ నెలలో జరగాల్సి ఉంది షెడ్యూల్ ప్రకారం! కానీ ఉక్రేయిన్ తో యుద్ధం కారణంగా జాప్యం జరుగుతూ వచ్చింది తప్పితే మనకి పోటీగా మాత్రం కాదు!

చంద్రయాన్-2 ఎలా విఫలం అయ్యిందో అదే విధంగా LUNA-25 కూడా విఫలం అయ్యింది!

Ads

1.సరిగ్గా చంద్రుడి దక్షిణ ధృవం మీద లాండింగ్ అవబోయే సమయంలో చంద్రయాన్-2 మరియు LUNA-25 లు మిషన్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయి.

2.సంబంధం పునరుద్దరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి!

3.రెండింటిలోనూ లాండింగ్ కి అవసరం అయిన సెన్సార్స్ ఉన్నాయి కానీ చివరి నిముషంలో అవేవీ ఉపయోగపడలేదు!

4 రెండూ కూడా క్రాష్ లాండ్ అయ్యాయి! కానీ ఇస్రో, రోస్ కాస్మోస్ లు ఈ విషయాన్ని వెంటనే పసిగట్టిన దాఖలాలు లేవు!

5. శాస్త్రజ్ఞులు మాత్రం టెక్నీకల్ గ్లిచ్ వల్లనే విఫలం అయ్యాయి అని చెపుతున్నారు!

6. బ్రేకింగ్ త్రస్టర్స్ (thrusters) లో చిన్నపాటి లోపం వలన క్రాష్ లాండింగ్ అయ్యింది.

7. ఇలాంటి సైంటిఫిక్ అంశాలని విశ్లేషించాలి అంటే ఫిజిక్స్, సాఫ్ట్ వేర్, కంట్రోల్ సిస్టమ్స్ మీద ఆవగాహన ఉండాలి రాసే వాళ్ళకి చదివే వాళ్ళకి!

8.భూమి మీద భూమ్యాకర్షణ శక్తి అన్ని చోట్లా ఒకే విధంగా ఉండదు. కొన్ని చోట్ల బలంగా ఉంటే మరికొన్ని చోట్ల మధ్యస్థంగానూ మరి కొన్నిచోట్ల బలహీనంగానూ ఉంటుంది.

9.అసలు భూమ్యా కర్షణ శక్తి లేని ప్రాంతాలు కూడా ఉన్నాయి భూమి మీద!

10.అలాంటిది చంద్రుడి మీద కూడా ఉండి ఉండవచ్చు! కాబట్టి శాస్త్రజ్ఞుల అంచనాలు తప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమయినా లాండర్ దిగే ప్రదేశంలో ఆకర్షణ శక్తి ని బట్టి సెన్సార్స్ పని చేస్తాయి.

ఇక షరా మామూలుగా వివిధ బ్లాగర్లు చంద్రుడి మీద గ్రహాంతర వాసుల స్థావరాలు ఉన్నాయని మానవులు చేసే ప్రయోగాలని వాళ్ళు అడ్డుకుంటారనీ,ఈ విషయం నాసా కి తెలుసునని రాస్తున్నారు. చంద్రయాన్-2, LUNA – 25 ల ప్రయోగాలు విఫలం అందుకే అయ్యాయని అంటున్నారు. ప్రముఖ దివంగత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.


ఓ నెటిజెన్ వ్యంగ్య వ్యాఖ్య ఇలా ఉంది బ్లాగర్ల రాతలపై…. Madhu Goud…  గ్రహాంతర వాసులు ఉండి ఉండొచ్చు. రోవర్ చంద్రమండలం దగ్గరకు రాగానే వాటిని పేల్చి ఉండవచ్చు, అది కూడా అమెరికాకి, నాసాకి, ఇంకా సిఐఏకి చెప్పి మరీ… ఎందుకంటే వారే కదా ప్రతీ రోజూ గ్రహాంతర వాసులతో మాట్లాడుతూ ఉంటారు… ఇంకా గ్రహాంతరవాసులని ఏరియా-51 లో ఉంచి అతిథి మర్యాదలు కూడా చేస్తున్నారు, ఆ మాత్రం సాయం అమెరికాకి చేయలేరా….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మాస్టర్లందరూ కలిసి వండిన ఓ మాస్టర్ పీస్.. ఇద్దరు..!
  • వ్యక్తిగా తనపై బోలెడు అభ్యంతరాలు… కానీ సంగీతంలో అల్టిమేట్ ఇసై జ్ఞాని…
  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions