.
ఇండియాకు అనేక స్మరణీయ విజయాలు అందించిన ఆ ధోనీయేనా..? ఇలాగే అనిపించింది నిన్న చెపాక్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూస్తుంటే… చెన్నై టీమ్‌కు కోల్‌కత్తా టీమ్‌కు నడుమ… అత్యంత అవమానకరమైన ఓటమిని రుచిచూసింది ధోనీ టీమ్…
ఆట జరుగుతున్నంతసేపూ స్టేడియంలో అనూహ్యమైన నిశ్శబ్దం… కోల్‌కత్తా బౌలర్లు చెన్నై బ్యాటర్లను ఊచకోత కోశారు… కోల్‌కత్తా బ్యాటర్లు చెన్నై బౌలర్లను ఊచకోత కోశారు… చెన్నై బ్యాటర్లు ఆపసోపాలు పడుతూ 103 పరుగులు చేశారు… అదీ 9 వికెట్లు కోల్పోయి…
Ads
ఒకవైపు ఐపీఎల్ మ్యాచుల్లో 200- 250 పరుగుల్ని కూడా దంచి పారేస్తున్నారు… పిచ్చులన్నీ బ్యాటింగుకు అనుకూలంగా మార్చేశారని ఆమధ్య రబడా (?) కామెంట్ చేస్తే, బీసీసీఐ ఇక చాలుపో, నీ విమర్శలు చాలు అన్నట్టు పంపించేసింది…
అలాంటిది ఈ పిచ్చు మీద 100 పరుగులు మాత్రమే చేయడం అక్కడి ప్రేక్షకులనే కాదు, చెన్నై టీమ్ ఫ్యాన్స్, ప్రత్యేకించి ధోనీ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది… మళ్లీ ధోనీని కెప్టెన్ చేశారు కదా, వెంటనే ఈ మ్యాచ్… దారుణమైన ఓటమి… ఆట ఒక్క దశలోనూ కోల్‌కత్తా టీమ్ మీద స్వల్ప ఆధిక్యాన్ని కూడా కనబరచలేక పోయింది…
వరుసగా బ్యాటర్లు ఔటవుతూ ఉంటే, సెవన్త్ డౌన్‌లో వచ్చాడు ధోనీ… అసలు తను ధోనీయేనా అన్నట్టుగా రెండో మూడో బాల్స్ ఆడి, కేవలం ఒక్క పరుగు చేసి, ఎల్బీ డబ్ల్యూగా వెనుతిరిగాడు… సరే, ఆటగాడి కెరీర్‌లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి… కానీ మరీ ఈసారి ఐపీఎల్‌లో తనది పేలవమైన ప్రదర్శన… ఈ మ్యాచ్ విషయానికొస్తే 103 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కత్తా టీమ్ జస్ట్ 10 ఓవర్లలో అలవోకగా 8 వికెట్ల తేడాతో దంచి పారేసింది…
పేరుకు ఎవరు కెప్టెన్లుగా ఉన్నా సరే, ముంబై అనగానే రోహిత్, బెంగుళూరు అనగానే విరాట్ కోహ్లీ, చెన్నై అనగానే ధోనీ ఆటతీరు పరిగణనలోకి వస్తుంది… ప్రేక్షకులు ఆసక్తిగా గమనిస్తారు… కోహ్లీ కొంత నయం, కానీ రోహిత్, ధోనీ ఫ్లాప్ ఈ సీజన్‌లో ఇప్పటివరకైతే…
(43 సంవత్సరాల 278 రోజుల వయసున్న ఎంఎస్ ధోని అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత పెద్ద వయసు కెప్టెన్‌గా నిలిచాడు…. ఇప్పుడే చదివాను ఎక్కడో…)
టాప్ జట్లుగా చెప్పుకునే చెన్నై, ముంబై టీమ్స్ ఈసారి పాయింట్ల టేబుల్‌లో దిగువన కొట్టుకుంటున్నాయి… అఫ్‌కోర్స్, వీళ్లకు పోటీ హైదరాబాద్ జట్టు… నిజంగా ఢిల్లీ, గుజరాత్ టీమ్స్ సూపర్ పర్‌ఫామెన్స్ చూపిస్తున్నాయి… అందులోనూ ఢిల్లీ టాప్… ఒక్క ఓటమీ లేదు ఇప్పటికైతే… ఒక్కసారి ఈ టేబుల్ చూడండి…
ధోనీ తీరుపై బాగా విమర్శలు వస్తున్నాయి… తమిళ్ హీరో విష్ణు విశాల్ “లోయర్ ఆర్డర్ లో తను బ్యాటింగ్ కు రావడం ఏమిటి? ఏమిటి ఈ సర్కస్?” అని ట్వీటాడు… చాలామంది తనకు మద్దతు పలుకుతున్నారు… పిటీ CSK…!!
Share this Article