Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మరో సెలబ్రిటీ జంట కాపురంలో కలతలు… ఈ కథా కంచికేనా..?!

June 22, 2022 by M S R

ఓ సమాచారం కాస్త చివుక్కుమనిపించింది… గాయకులు శ్రావణ భార్గవి, హేమచంద్రల నడుమ పెరిగిన పొరపొచ్చాలు చివరకు వారి సంసారబంధాన్ని విచ్ఛిన్నం చేశాయనేది ఆ సమాచారం… వాళ్లు ప్రస్తుతం విడిగా ఉంటున్నారని తెలుస్తోంది… ప్రధానంగా ఎక్కడ స్పర్థలు వచ్చాయో తెలియదు… సరే, నిజమైన వార్తో, అకారణంగా స్ప్రెడ్ అవుతున్న వార్తో గానీ… సినిమా, టీవీ వంటి రంగాల్లో సెలబ్రిటీల జంటల మనస్పర్థలు పెద్ద విషయమేమీ కాదు ఈరోజుల్లో… అఫ్‌కోర్స్, ఇతర రంగాల్లో కూడా ఈ ధోరణి పెరిగింది…

కొన్ని బయటికి వస్తాయి, కొన్ని లోలోపలే సైలెంటుగా పాతబడిపోతాయి… కాకపోతే ప్రజలకు బాగా పరిచయమున్న సెలబ్రిటీలయితే నాలుగు రోజులు జనం చెప్పుకుంటారు… అంతే… తరువాత వాళ్ల వ్యక్తిగత జీవితాలు వాళ్లిష్టం… కాకపోతే హేమచంద్ర, శ్రావణ భార్గవిలను చూస్తే ముచ్చటేస్తుంది… ఓ పద్దతిగా మెదులుతారు… ఇద్దరికీ తమ కళలో మెరిట్ ఉంది… ఫీల్డులో రాణిస్తున్నారు… తొమ్మిదేళ్ల క్రితం ఒక్కటైన ఈ జంటకు ఓ కూతురు కూడా…

hema sravani

Ads

ఇంజనీరింగ్ చదివి, ఎంబీఏ కూడా చేసిన శ్రావణ భార్గవి సినిమా పాటలే కాదు, డబ్బింగ్ కూడా చెబుతుంది… ఇద్దరూ కలిసి ఒకటీరెండు టీవీ షోలు, రేడియో షో హోస్టింగ్ కూడా చేసినట్టున్నారు… హేమచంద్ర కూడా డబ్బింగ్ ఆర్టిస్టు… నాలుగైదు సినిమాలకు మ్యూజిక్ కంపోజింగ్ కూడా చేశాడు… మొన్నీమధ్య ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ షోకు కూడా కలిసే వచ్చారు… హోస్ట్ శ్రీరామచంద్ర ఒక ఎపిసోడ్‌కు అందుబాటులో లేకపోవడంతో ఆ ఎపిసోడ్‌ను శ్రావణ భార్గవి హోస్ట్ చేసింది… మరింతలో ఏమైందో ఈ కలతల వార్తలు వస్తున్నాయి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions