Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రజినీకాంత్‌కే చేతులుమూతులు కాలినయ్… ఐనా ఆదిపురుష్‌కు ఏమిటీ ధీమా..?!

October 3, 2022 by M S R

బహుశా ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్‌ను గుడ్డిగా నమ్మి ఉండవచ్చు… లేదా కాల్షీట్లు చాలా తక్కువ ఇచ్చి ఉండవచ్చు… మరేం చేయాలి దర్శకుడు… గ్రాఫిక్స్‌తో కథ నడిపించేయాలి… మైండ్ కూడా డిస్టర్బ్ అయినట్టుంది… ఆ సైఫ్ వేషమే దానికి ఉదాహరణ… ఆ గబ్బిల వాహనం ఏమిటో… మాంచి మోడరన్ హెయిర్ కటింగ్ ఏమిటో… గడ్డం, మీసాలతో కాస్త బిన్ లాడెన్ లుక్ ఏమిటో తనకే తెలియాలి… గ్రాఫిక్స్ కూడా నాసిరకంగా ఉన్నయ్… బోలెడు మంది మీమ్స్‌తోనే కాదు, టీజర్‌లో కనిపించే ప్రతి సీన్‌ గతంలో ఏయే సినిమాల్లో వచ్చిందో వీడియో బిట్లతో సహా పెట్టేసి, కడిగేస్తున్నారు…

ఒక టీజర్ స్థాయిలోనే ఇంత ట్రోలింగ్‌కు గురైన సినిమా ఈమధ్య లేదు… ఈ సినిమాకు ట్రోలింగ్‌కు గురయ్యే అర్హత ఉంది… సరే, చాలామంది చాలా రాసేశారు కాబట్టి వాటి జోలికి పోకుండా… మనం కాస్త టెక్నికల్ అంశం వైపు వెళ్దాం… 500 కోట్ల ఖర్చు అని దర్శకుడు ఎందుకు చెబుతున్నాడో అర్థమే కాదు… గ్రాఫిక్స్‌కు, యానిమేషన్‌కు అంత ఖర్చవుతుందా..?

Ads

చాలామంది ఈ సినిమాను కార్టూన్ యానిమేషన్ సినిమాతో పోలుస్తున్నారు… రజినీకాంత్ బిడ్డ తీసిన కొచ్చాడియాన్ సినిమాతో పోలుస్తున్నారు… రజినీకాంత్‌ను తెర మీద లైవ్‌ యాక్షన్‌తో చూడాలని అనుకుంటారు తప్ప, యానిమేషన్‌లో ఎవడు చూస్తాడు..? అందుకే అట్టర్ ఫ్లాప్ అయ్యింది… 125 కోట్లు ఖర్చు పెడితే 35 కోట్లు కూడా రాలేదు… సౌందర్య చేతులు కాలిపోయాయి… ఈ సినిమా ఎలా ఉంటుందంటే live-action motion-capture CGI 3d animation… అంటే మనం ఎవరినైతే నటులుగా ఎన్నుకుంటామో, వాళ్లే అచ్చుగుద్దినట్టు నటిస్తున్నట్టగా యానిమేట్ చేయిస్తాం… వాయిస్ ఓవర్ ఇప్పిస్తాం…

నిజానికి ఇది మనకు కొత్త… సౌందర్య చేతులు కాలిపోయాక ఇక ఇండియన్ సినిమాలో ఎవరూ మళ్లీ ఆ ప్రయోగం జోలికి పోలేదు… ఖర్చు ఎక్కువ ప్లస్ ప్రేక్షకుడికి థ్రిల్ ఉండదు… ఇప్పుడు ఆదిపురుష్‌లో చాలా సీన్లు ఇలాగే త్రీడీ యానిమేషన్‌లో చుట్టేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి… మీకు గుర్తుందా..? హాలీవుడ్ ప్రఖ్యాత నటి ఆంజిలినా జూలీ దేహస్వరూపంతో ఇలాగే 2007లోనే Beowulf తీశారు… పెట్టిన ఖర్చులు మాత్రం తిరిగి వచ్చాయి… నిజానికి ఈ టెక్నాలజీతో సినిమా తీయడం అనేది (పేరున్న నటుల రూపురేఖల్ని వాడుకుంటూ గ్రాఫిక్స్‌లో సీన్లు క్రియేట్ చేయడం, వాళ్లతో వాయిస్ ఓవర్ ఇప్పించడం) 2004 నుంచీ ఉంది…

Ads

2004లో వచ్చిన The Polar Express  సినిమా ఇలాంటిదే… కానీ ఇది బాక్సాఫీసు దగ్గర విజయం సాధించింది… తరువాత రెండేళ్లకు మళ్లీ హాలీవుడే  Monster House అని ఇంకో సినిమా తీసింది… ఇది కూడా సక్సెసైంది… కానీ ఎప్పుడైతే జూలీ సినిమా ఫెయిలైందో ఇక హాలీవుడ్ కూడా మళ్లీ ఆ ప్రయోగాల జోలికి పోలేదు పెద్దగా… మరి ఏ ధీమాతో ఓం రౌత్ పక్కా యానిమేషన్ యాంగిల్‌ను నమ్ముకున్నాడో అర్థం కాదు… అబ్బే, అదేమీ లేదు అనడానికి కూడా లేదు… బుకాయించే పనీ లేదు… టీజర్ స్పష్టంగా అద్దం పడుతోంది…చాలా సీన్లు యానిమేషనే… ఇదంతా చూస్తుంటే ఫాఫం ప్రభాస్ అనాలనిపిస్తోంది..!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • చలికాలంల సర్వపిండిదే సౌభాగ్యం… ఉల్లి కొత్తిమీర గుమగుమలతో ఊరిస్తది.
  • రేవంత్ టీంలో ఉంటాడో లేదో తెలియదు… కానీ ఐటీ మినిస్ట్రీకి ఆప్ట్ ఎమ్మెల్యే…
  • సాయిపల్లవి… ఆగీ ఆగీ… ఒకేసారి మూడు పాన్ ఇండియా మూవీస్…
  • టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్… నిజానికి రేవంత్‌రెడ్డి ఎవరి మనిషి..?!
  • నిజమే… అతడు ఓడిపోతున్నాడు… ఈ లోకం నుంచే వెళ్లిపోతున్నాడు…
  • హై హై నాయకా… మాయాబజార్ ఘటోత్కచుడిని చేసేశారా..?
  • తీరొక్క తీపి..! స్వీట్ల జాతర..! మధుమేహులు కుళ్లుకునే విందు…!
  • వచ్చిన రెడ్ల రాజ్యంలోనే వెలమ ఎమ్మెల్యేలు ఎక్కువ… 13 మంది…
  • ఇండి కూటమి… ఫెవికాల్ బంధాలేమీ కావు… అప్పుడే ‘ఇచ్చుకపోతోంది’…
  • తెలంగాణ కాబోయే సీఎం ఎవరు..? రేవంత్ మరో అస్సోం సీఎం కాగలడా..?

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions