Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈడీ కోరలకు మరింత పదును… సుప్రీం తీర్పు ఎలా అర్థం చేసుకోవాలంటే..?

July 27, 2022 by M S R

పార్ధసారధి పోట్లూరి …….. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ [Enforcement Directorate]కి ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 [Prevention of Money Laundering Act, 2002] ఇస్తున్న అపరిమిత అధికారాలని సవాలు చేస్తూ దాదాపుగా 250 మంది పిటీషన్లు వేశారు సుప్రీం కోర్ట్ లో. పిటీషన్లు అన్నిటినీ కలిపి విచారణ చేసిన సుప్రీం కోర్ట్ ఈ రోజు తన తీర్పుని వెల్లడించింది. ప్రధానంగా పిటీషనర్లు సవాలు చేసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్లు 5, 8[4], 15, 17, మరియు 19 PMLA …. ఈ సెక్షన్లు ED అధికారులకి అరెస్ట్, అటాచ్ మెంట్, సోదాలు, నిర్బంధించడం [Siezure], అధికారాలని ఇస్తున్నాయి, కానీ పిటీషనర్లు ఈ సెక్షన్లు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులకి భంగం కలిగిస్తున్నాయి అని వాదించారు. సుప్రీం కోర్ట్ బెంచ్ మాత్రం పిటీషనర్ల వాదనని తోసిపుచ్చుతూ పైన చెప్పిన PMLA చట్టంలోని ఆయా సెక్షన్లు అవి కల్పిస్తున్న అధికారాలు చట్టబద్ధమే అని తీర్పు ఇచ్చింది…

PMLA చట్టంలోని సెక్షన్ 24 [Burden of proof ] ని కూడా సుప్రీం కోర్ట్ సమర్ధించింది. సెక్షన్ 24 ప్రకారం అధికారులు కనుగొన్న లేదా జప్తు చేసిన ఆస్తులు లేదా డబ్బుని అవి సక్రమంగా సంపాదించినవే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడి మీదనే ఉంటుంది. కానీ ఈ సెక్షన్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది వివిధ హై కోర్టులలో పిటీషన్లు వేశారు గతంలో… తాజా సుప్రీం కోర్ట్ తీర్పు సదరు సెక్షన్ 24 సక్రమమే అని తీర్పు ఇచ్చింది. CRPC సెక్షన్ల ప్రకారం ప్రాసిక్యూషన్ సదరు నిందితుడి ఆస్తులు అక్రమం అని నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు చేసే అధికారి మీదనే ఉంటుంది కానీ PMLA సెక్షన్ 24 దానికి విరుద్ధంగా ఉన్నది…

Ads

ఇక ED కేసులలో అరెస్ట్ అయిన వారికి ఇచ్చే బెయిల్ దాని నియమ నిబంధనలకి ఆస్కారమిచ్చే సెక్షన్ 45 [PMLA] మీద కూడా వివిధ హై కోర్టులు భిన్నంగా స్పందించాయి. CRPC సెక్షన్ల కింద ఇచ్చే బెయిల్ నిబంధనలని పేర్కొంటూ సెక్షన్ 45 [PMLA] విషయంలో ట్విన్ కండిషన్స్ బెయిల్ మీద కూడా సుప్రీం తన తీర్పుని వెల్లడిస్తూ, సదరు సెక్షన్ లో పేర్కొన్న అంశాలు రాజ్యాంగ బద్ధమయినవే అని పేర్కొంది. 2018 లో మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయినవారికి ఇచ్చే బెయిల్ నియమ నిబంధనల్ని సవరిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లుని ఆమోదించాయి. అయితే సుప్రీం కోర్ట్ ఈ సవరణ చేసే అధికారం పార్లమెంట్ ఉభయ సభలకి ఉంది కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్తూ సదరు సెక్షన్ 45 [PMLA] చెల్లుబాటుని ఆమోదించింది.

ED అధికారులు పోలీసులు కాదు !

సుప్రీం కోర్ట్ మరో విషయం మీద స్పష్టత ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పోలీసులు కాదని, కాబట్టి సదరు ED అధికారులు సెక్షన్ 50 [PMLA] ప్రకారం రికార్డ్ చేసే స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది అని, ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికిల్ 20[3] ప్రకారం ఫండమెంటల్ హక్కులకి సంబంధం లేదని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్ట్ మరో విషయం మీద కూడా స్పష్టతని ఇచ్చింది: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితుల దగ్గర రికార్డ్ చేసే స్టేట్మెంట్ ని ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ [Enforcement Case Information Report – ECIR] అనేది దాని అంతర్గత డాక్యుమెంట్ గా పరిగణిస్తూ… ఈ ECIR ని పోలీసులు ఫైల్ చేసే FIR గా పరిగణించలేం కాబట్టి FIR విషయంలో వర్తించే CRPC సెక్షన్లు ECIR కి వర్తించవని స్పష్టం చేసింది… So ! మూడు రోజుల క్రితం ఘనత వహించిన అడ్వొకేట్ చిదంబరం FIR నమోదు చేయకుండా ED అధికారులు సోనియాకి సమన్లు ఎలా జారీ చేస్తారు అంటూ హాస్యాస్పద వ్యాఖ్య చేశాడు కదా, దాని మీద పలువురు అడ్వొకేట్లు చిదంబరంని అదేమన్నా పోలీస్ కేసా fir ఫైల్ చేయడానికి, అది ED కేసు అని, ED అధికారులు పోలీసులు కాదని ఒక అడ్వకేట్ గా మీకు తెలియకపోవడం విడ్డూరం అంటూ ట్రోల్ చేశారు…

ED అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో కానీ, అరెస్ట్ చేసిన తరువాత కానీ ECIR కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేవలం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెపితే సరిపోతుంది అని స్పష్టం చేసింది. అయితే కేసు విచారణ జరిగి కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత నిందితుడు ECIR కాపీని ఆడగవచ్చు అని స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ మరో విషయం మీద కూడా స్పష్టతని ఇచ్చింది. పిటీషనర్లు సుప్రీం ముందు ఉంచిన అంశం : మనీ లాండరింగ్ కేసులో అసలు కేసుతో సంబంధంలేని ఆస్తులని కూడా ED అధికారులు జప్తు చేస్తున్నారు, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరారు.

సెక్షన్ 3 మనీ లాండరింగ్ విషయంలో విస్తృతంగా చర్చించింది. ఒకసారి మనీ లాండరింగ్ కేసు సెక్షన్ 3 కింద నమోదు అయ్యాక ఆస్తులు జప్తు చేయడం అనేది సక్రమమే… అదే సమయంలో అవి సక్రమమయిన ఆస్తులా లేక అక్రమంగా మనీ లాండరింగ్ ద్వారా సంపాదించారా అనేది విచారణ పూర్తయిన తరువాత గానీ తేలదు… ప్రత్యేక కోర్టు విచారణలో వాటికి సంబంధించిన విషయాలు పూర్తిగా బయటపడ్డాక ఏవి అక్రమ ఆస్తులు ఏవి సక్రమ ఆస్తులు అన్నది తేలుతుంది కాబట్టి కోర్టులో విచారణ పూర్తి కాకముందే వాటి మీద నిర్ణయం తీసుకోలేము అని తేల్చి చెప్పింది.

సెక్షన్ 3 మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ప్రతీ చర్యని పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెపుతున్నది… కాబట్టి ED చర్యలని సమర్ధిస్తున్నట్లుగా తేల్చి చెప్పింది సుప్రీం కోర్ట్. జస్టిస్ AM కన్వీల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ CT రవి కుమార్ లతో కూడిన సుప్రీం కోర్ట్ బెంచ్ ఈ కేసులని విచారించి తుది తీర్పుని 15-03-2022 న రిజర్వ్ చేసింది. ఈ రోజున తీర్పుని వెల్లడించింది.

మొత్తానికి ED విచారణ, అరెస్ట్, ఆస్తుల జప్తు లాంటి కీలమయిన వాటి మీద స్పష్టమయిన తీర్పుని ఇచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ED కేసుల విచారణ మరింత వేగం పుంజుకుంటుంది. ఇక ముందు ED అధికారులు ఎవరినైనా అరెస్ట్, లేదా ఆస్తుల స్వాధీనం కానీ చేసుకోవాల్సి వస్తే పూర్తి స్వేచ్ఛగా చేసుకునే వెసులుబాటును ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఇంతకీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఏర్పాటు చేసింది విదేశాల నుండి అక్రమంగా హవాలా ద్వారా డబ్బుని భారత్ లోకి పంపించి మన దేశంలో అస్థిరతని కలిగించే ఉగ్రవాదుల పీచం అణచడానికి ! ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ని ఏర్పాటు చేసింది అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ ద్వారా ఉగ్రవాదం అణిచివేయడానికి కాబట్టి FATF లో మన దేశం కూడా భాగస్వామిగా 1998 చేరింది… ఆ FATF నియమ నిబంధనలని ఆధారం చేసుకొని ఏర్పాటు చేసిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ !

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions