Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అబ్బే… ఇది 1 + 2 బాపతు సరస మూవీ కాదు… భిన్నమైన కథ..!

January 20, 2025 by M S R

.

Subramanyam Dogiparthi…. 
·
ముగ్గురు ఉన్నారని 1+2 సినిమా అనుకునేరు ! కాదు . మంచి ఎమోషనల్ , కుటుంబ సినిమా . వంద రోజులు ఆడింది . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వం , సంగీత దర్శకత్వం అన్నీ చాలా బాగుంటాయి .

ప్రధాన పాత్రలను బాగా మోల్డ్ చేసారు రచయిత . ప్రేక్షకులు మరచిపోలేని పాత్ర సత్యనారాయణ నటించిన రాజా వారి పాత్ర . ఆ పాత్ర చేత పలికించే మాటలు , వాటిల్లోని జీవితసారం నాకు బాగా నచ్చాయి .

Ads

ఆ తర్వాత మెచ్చుకోవలసింది శ్రీదేవి , శోభన్ బాబు , జయసుధల పాత్రలు , వారి నటన . సర్దుకుపోయే , బాధ్యతాయుత భార్యగా శ్రీదేవి బాగా నటించింది . ఆమెకు ముందు శోభన్ బాబు భార్యగా నటించిన జయసుధ శృతిమించిన స్వాతంత్య్రం , బాధ్యతారాహిత్యం , చేతులు కాలాక ఆకులు పట్టుకునే స్త్రీగా ఆమె బాగా నటించారు . ఇలాంటి పాత్రలు ఆమెకు కొట్టిన పిండే .

ఇంక శోభన్ బాబు . ఈ సినిమాలో బతికిపోయాడు . ఇద్దరి మధ్య నలిగిపోయే పాత్ర కాదు . ముందు పెళ్ళి చేసుకున్న జయసుధ విడాకులు ఇచ్చాక శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడు . విడాకులు ఇచ్చి విడిపోయిన జయసుధ సంపద కోసం ఓ ధనవంతుడైన వయసుడిగిన వాడిని పెళ్లి చేసుకుంటుంది . కాబట్టి హీరో గారికి ఆ గోల లేదు .

సినిమాలో చాలా భాగాన్ని ఊటీలో షూట్ చేసారు . అందమైన లొకేషన్లలో డ్యూయెట్లు బాగుంటాయి . బాగా హిట్టయిన పాట ఓ బాటసారీ ఇది జీవిత రహదారి . అలాగే హిట్టయిన మరో పాట అయ్యప్పస్వామి మీద భజన పాట . శబరి గిరీశా అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా .

శ్రీదేవి , జయసుధ , మాస్టర్ సుందర్ల నృత్య గీతం చిత్రీకరణ చాలా చక్కగా ఉంటుంది . తప్పక చూడవలసిందే . అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరివాడమ్మా అంటూ దేవకి , యశోద , చిన్ని కృష్ణుడుల మధ్య పాట . వేటూరి వారు బాగా వ్రాయగా సుశీలమ్మ , శైలజలు పాడారు .

మిగిలిన పాటలు కూడా శ్రావ్యంగా , అందంగా చిత్రీకరించబడ్డాయి . గుండెలో సవ్వడి ఏమిటో అలజడి , నీరెండ దీపాలు నీ కళ్ళల్లో ఆ నీడను చూసాను , మురిపాల మా బాబు ముద్దివ్వమన్నాడు పాటలు బాగుంటాయి . చక్రవర్తి సంగీత దర్శకులు . తాతినేని రామారావు సినిమాకు దర్శకులు .

ఇతర ప్రధాన పాత్రల్లో రంగనాధ్ , కాంతారావు , హేమసుందర్ , రమాప్రభ , అల్లు రామలింగయ్య , కృష్ణవేణి , రోహిణి , మిక్కిలినేని ప్రభృతులు నటించారు . రమాప్రభ పాత్ర , ఆమె నటన కూడా బాగుంటాయి .

ఇల్లాలు టైటిల్ అచ్చొచ్చే టైటిలే . ఇల్లాలు అనే టైటిలుతో 1940 , 1965 లలో కూడా సినిమాలు వచ్చాయి . ఇల్లు ఇల్లాలు , ఇంటికి దీపం ఇల్లాలే వంటి సినిమాలూ చాలా ఉన్నాయి . ఈ 1981 సినిమా యూట్యూబులో ఉంది . Feel good , beautiful and neat movie . ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడతగ్గ మంచి సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాత ఆర్మీ బాస్ నరవాణే పుస్తకం- కొన్ని కటువైన నిష్ఠుర నిజాలు…
  • గుంజి గుంజి… వాడు కాదు, వాడి నిర్మాత- దర్శకులే అసలు వైరసులు..!!
  • చైనాలో కొందరు కీలక సైన్యాధికారులు మాయం… ఏం జరుగుతోంది…
  • ఏ గాయిగత్తరకు చాన్సివ్వకుండా… మేడారం తిరుగువారంతో పరిపూర్ణం…
  • అందరూ ఈ అందమైన ఆడదెయ్యం ప్రేమలో పడిపోతున్నారు… ఎవరామె..?
  • 45 … ఇది హీరో– విలన్ కథ కాదు… కర్మతో మనిషి చేసే యుద్ధం…
  • అమెరికాతో ట్రేడ్ డీల్… అప్పుడే అంత సంబరం అక్కర్లేదు… ఎందుకంటే..?
  • లక్ష సమస్యలు ఉండొచ్చు… కానీ ఈ దేశం నాటి నుంచీ గొప్పదే…
  • ఆ సాంగ్‌ను ఇంకా గుంజుతున్నారు… సారీ చెప్పడట, పైగా మీడియాకు బెదిరింపులు…
  • లాయర్ మమతా బెనర్జీ… వాదనలు ఏమిటి- నిజాలు ఏమిటి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions