నిన్నటి వార్త… ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్‌లో కనిపించింది… శీర్షిక పేరు ‘రోడ్లపై గుంతలు బూడిదతో పూడ్చండి’… సారాంశం ఏమిటంటే…? రాష్ట్రంలో రహదారుల పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఓ సమీక్ష సమావేశం నిర్వహించాడు… వర్షాకాలంలో రోడ్ల రిపేర్లు కష్టం, అందుకని ఇప్పుడే రిపేర్లు చేయాలని, గుంతలు పూడ్చాలని ఆయన ఆదేశించాడు…
గుడ్, ఇక్కడి వరకూ స్పాట్ న్యూస్, బాగానే రాశారు… సమీక్షలో చంద్రబాబు ‘దగ్గరలోని థర్మల్ కేంద్రాలకు వెళ్లి ఫ్లయ్ యాష్ (ఆ కేంద్రాల్లో బొగ్గు కాల్చగా వచ్చే బూడిద) తీసుకొచ్చి, వాటితో గుంతలు పూడ్చాలని ఆదేశించినట్టు ఒకచోట, మొదట తారు బదులు దాన్ని వాడాలని మరోచోట, మిక్స్ చేసి వాడాలని ఇంకోచోట రాసుకొచ్చారు వార్తలో… ఇదీ ఆ వార్త…
Ads
సరే, ఏదో రాశారు… కానీ తరువాత అదే వార్తలో విలేఖరి ఒపీనియన్ కలిపారు… ఇప్పటివరకూ రోడ్లకు ఫ్లయ్ యాష్ ఉపయోగించలేదు, అది ప్రమాదకరం, సీఎం ఆదేశాలు చర్చనీయాంశం, బూడిద మిక్స్ చేస్తే, అది సరిగ్గా కలవకపోతే వర్షానికి నీళ్లలో కలుస్తుంది, వాహనదారులకు ఇబ్బంది, బూడిద గాల్లోకి లేచి కళ్లలో పడితే కంటిచూపు సమస్యలు వస్తాయి, అలాగని ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు… అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటూ ఏదేదో రాస్తూ పోయారు…
ఫస్టాఫ్, ఈ వార్తకు తన ఒపీనియన్, విశ్లేషణ అక్కడ అక్కరలేదు… ఒకవేళ రాయాలనుకుంటే ఎవరైనా ఇంజినీర్ కోట్ తీసుకుంటే వార్తకు కాస్త ప్రామాణికత ఏర్పడేది… పైగా అది ఆంధ్రజ్యోతి… సాధారణంగా చంద్రబాబు మాటలకు, నిర్ణయాలకు ఇతరత్రా బాష్యాలు వెతకదు, రాయదు… వీలయితే ఆహా, లేదా ఓహో… అలాంటిది చంద్రబాబు సూచనలు, ఆదేశాలపై ఈ అభిప్రాయాలు జోడించడం ఆశ్చర్యమే…
సరే, ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే..? చంద్రబాబు సూచననే వార్తలో సరిగ్గా రాయలేకపోయారు… చంద్రబాబు చెప్పింది బాగుంది… అది ఆచరణీయం కూడా… తారులో ఫ్లయ్ యాష్ మిక్స్ చేసి, ప్రయోగాత్మకంగా వాడండి అన్నాడాయన… తారులో ఫ్లయ్ యాష్ సరిగ్గా కలవకపోవడం ఏమీ ఉండదు, అదేమీ అలాగే బూడిదలాగా ఉండి, వర్షపునీళ్లతో కలిసిపోదు… అన్నింటికీ మించి అది ఎగిరి ఎవరి కళ్లల్లోనూ పడదు… మరీ కల్కి మార్క్ కథ ఇక్కడ అక్కరలేదు…
అసలైన ఇంజనీర్ ఎవరూ దీనిపై అనుమానాలు వ్యక్తం చేయడు, మరీ వాహనదారుల కంటిచూపు దాకా వెళ్లడు… ఎందుకంటే..? ఆల్రెడీ ఫ్లయ్ యాష్ ఇటుకలు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి… సిమెంటులో పర్‌ఫెక్ట్‌గా మిక్సవుతుంది… ప్రహారీలకు, గోడలకు చాలా సంఖ్యలో వాడుతున్నారు… ఏటా కోట్ల టన్నుల థర్మల్ బూడిద వస్తోంది… దాన్ని డంప్ చేయడానికి విలువైన వేలాది ఎకరాలు వేస్టవుతున్నాయి… ఫ్లయ్ యాష్ డిస్పోజల్ అనేది పెద్ద సబ్జెక్టు…
పలు దేశాల్లో తారులో ఫ్లయ్ యాష్ కలిపి పేవ్‌మెంట్లు, రోడ్లు, రిపేర్లు చేస్తున్నారు… అధ్యయనాలూ బోలెడు… ఇలా కలిపితే ఆ రోడ్ల డ్యురబులిటీ ఎక్కువ అనే అధ్యయనాల సారాంశం… ప్రత్యేకించి వాటర్ లాగింగ్ ఏరియాల్లో ఇది ఉపయోగకరం… చంద్రబాబు సరిగ్గా అర్థం చేసుకున్నాడు, ఆంధ్రజ్యోతికే అర్థం కాలేదు… చాలా విషయాల్లోలాగే..!! బూడిద మీద వార్త రాసినా అది కాంక్రీట్‌లా గట్టిగా ఉండాలి మాస్టారూ..!!
Share this Article