కామెడీ అంటే ఇదే… చాన్నాళ్ల తరువాత వీసమెత్తు బూతు వాసన లేని ఓ స్కిట్ ఎక్సట్రా జబర్దస్త్‌లో మనసారా నవ్వించింది… అన్నింటికీ మించి ఓ విషయంలో మెచ్చుకోవాలని కూడా అనిపించింది…… ఓడలు బళ్లు, బళ్లు ఓడలు సహజమే కదా… ఒకవేళ ఇప్పుడు సెకండ్ లేయర్ కమెడియన్లుగా ఉన్న వాళ్లు టాప్ రేంజుకు చేరిపోయి, ఇప్పుడు పాపులర్ కమెడియన్లుగా ఉన్న గెటప్ సీను, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ గనుక చితికిపోతే..? పూలమ్మిన చోటే కట్టెలు అమ్మినట్టుగా ఆ స్టూడియోలోనే ఏవో చిన్న పనులు చేస్తూ పొట్టపోసుకుంటూ ఉంటే..? స్టార్లుగా ఎదిగిన ఈ చిన్న కమెడియన్లు వీళ్లతో ఎలా ఆడుకుంటారనేది స్కిట్… కొత్త తరహా…
మామూలుగానే సుధీర్ తనపైన సెటైర్లను, జోక్స్‌ను లైట్ తీసుకుని, తనూ ఇన్వాల్వ్ అవుతుంటాడు కదా స్పోర్టివ్‌గా… ఇక ఈ స్కిట్లో తనపై హిలేరియస్ పంచులు పడ్డయ్… అందులో ప్రధానమైనవి కొన్ని బాగా నవ్వొచ్చినయ్… వీటిల్లో కాస్త సరదా ట్విస్టులు కూడా ఉన్నయ్… సుధీర్‌కు తెలుగు టీవీ ప్రేక్షకుల ఫాలోయింగ్ నిజంగానే ఎక్కువ కదా… ఐతే యూట్యూబ్ వీడియోల లైకుల్ని, వ్యూస్‌ను సుధీర్ కావాలనే మేనేజ్ చేయిస్తాడనీ, కావాలని కామెంట్లు సానుకూలంగా పెట్టించుకుంటాడనీ ఓ విమర్శ అయితే ఉంది కాదా…
ఇక ఇప్పుడు చాన్స్ దొరికింది కదాని పొట్టి నరేష్, మరో కమెడియన్ ఆడుకున్నారు సుధీర్‌తో… ‘‘స్కిట్లలో పెద్దగా పీకేదేమీ లేదు గానీ, ఫుల్ కామెంట్స్ మాత్రం వస్తుంటయ్, సుధీరన్న సూపర్, సుధీరన్న బంపర్ అంటూ… అంటే మిగతావాళ్లేమీ చేయడం లేదా..? అసలు తనే పెట్టించుకుంటాడు ఈ కామెంట్స్… అసలు కన్నడ తెల్వదు కదా, కన్నడానికీ సుధీర్ కూ ఏంటి లింక్..? మరి కన్నడ కామెంట్లు ఎందుకొస్తయ్..?’’ అనే అర్థంతో నేరుగా ఈ అంశం మీద పడ్డారు… ఇక్కడ ఫన్నీ అంశం ఏమిటంటే..? ఈ ఎపిసోడ్ ఉన్న యూట్యూబ్ వీడియో కింద కూడా యథాతథంగా మెజారిటీ కామెంట్స్ మళ్లీ సుధీరన్న సూపర్, సుధీరన్న తోపు తరహాలోనే వచ్చిపడుతున్నయ్…
Ads
‘‘రష్మితో 9 ఏళ్లు లాంగ్ లవ్వట, జనం చూడలేక రాళ్లతో టీవీలు పగులగొడుతున్నారు తెలుసా..? హీరోగా చేస్తే వీడిలాగా అయిపోతవ్… ఆ మాస్క్ పెట్టుకోరా, లేకపోతే చూడటానికి గొరిగిల్లా టైపులో కనిపిస్తున్నవ్… ఎర్రగడ్డలో కొన్ని స్పెక్ట్స్ పదే పదే పెట్టుకుని అవేవో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుడు,.. నైట్ ఎవరింటికో వెళ్లినట్టున్నాడు, కుక్కలు వెంబడి పడ్డయ్, ప్యాంట్ చిరిగింది…’’ ఇలాంటి బోలెడు అదనపు పంచులు సరేసరి… ఆటో రాంప్రసాద్, ఇంజిన్ ఖరాబ్ వంటి పంచులు రాంప్రసాద్, గెటప్ సీనుపైన కూడా బాగా పడ్డయ్… అఫ్కోర్స్, ఈ డైలాగులన్నీ స్క్రిప్టెడే… సరదాగా బాగా నవ్వు పుట్టించినయ్… అన్నింటికీ మించి ఆ ముగ్గురు స్నేహితుల టీమ్ తమపైనే పంచులు వేయించుకుని, నవ్వుతూ, నటిస్తూ, అందరినీ నవ్వించే ప్రయత్నం చేయడం బాగనిపించింది..!!
Share this Article