Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!

October 10, 2026 by M S R

.

నాణ్యమైన రేషన్ పంపిణీ… ఈ దిశలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం నిజంగానే అభినందనీయమైన పథకం… అది రాష్ట్రవ్యాప్తంగా మహిళల్ని కనెక్టయింది… సన్నబియ్యం పండించే రైతుకు బోనస్ ప్రోత్సాహం, మరోవైపు పేదలకు పంపిణీ… నిజానికి రాష్టవ్యాప్తంగా ఈ పథకంపై ప్రభుత్వం గనుక ఓ శాస్త్రీయ సర్వే జరిపిస్తే… ఓ మంచి సక్సెస్ స్టోరీ బయటపడుతుంది…

సేమ్, అలాంటి నిర్ణయమే… సర్కారీ విద్యా సంస్థల్లో బ్రేక్ ఫాస్ట్ నిర్ణయం… కొందరు విమర్శించేవారు ఎప్పుడూ ఉంటారు కదా, దీన్నీ విమర్శిస్తారు… కానీ సంక్షేమ బాధ్యత కోణంలో రేవంత్ రెడ్డి తీసుకున్న మరో మంచి నిర్ణయం ఇది… దీన్ని కేవలం డ్రాపువట్స్ తగ్గించే చర్య, పిల్లలను సర్కారీ స్కూల్ వైపు ఆకర్షించే పథకం అని తేలికగా తీసిపారేయదగింది కాదు…

Ads

ఇది పేద పిల్లల న్యూట్రిషన్ లెవల్స్ పెంచే చర్య… ఆకలి తీర్చే పథకం… కొందరి కువిమర్శ ఏమిటంటే..? పిల్లలే కాదు, పెద్దలు, చాలామందికి ఇది ‘బ్రేక్ ఫాస్ట్’ అని..! సో వాట్..? ఆకలితో ఉన్నవాడు, కడుపు కాలుతున్నవాడే కదా తినేది… పేదల కడుపులే కదా నిండేది… ఆహారభద్రత పేరిట ప్రభుత్వం లక్షల కోట్లను ఖర్చుచేస్తోంది ఏటా… మరి ఆకలితో ఉన్న నాలుగు కడుపులు ఇలా నిండితే కుళ్లు దేనికి..? అన్నీ బాగున్నోడు ఇంట్లోనే తింటాడు, లేనివాడే కదా ఈ ఉచిత తిండికి ఆశపడేది…!

మొదట కొన్ని బళ్లల్లో స్టార్ట్ చేసిన ఈ స్కీమ్‌ను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు… సెంట్రలైజ్డ్ కిచెన్ సెంటర్లు కూడా నిర్మిస్తోంది… హైజీన్ కోసం… సత్వర పంపిణీ కోసం… మొదట్లో పథకం వివరాలు ఇవి…

  • సోమవారం: దోశ (చట్నీ లేదా సాంబార్)

  • మంగళవారం: మిల్లెట్ ఇడ్లీ (సాంబార్)

  • బుధవారం: పూరి (మిక్స్డ్ వెజిటబుల్ కుర్మా)

  • గురువారం: బోండా (చట్నీ లేదా సాంబార్)

  • శుక్రవారం: ఇడ్లీ (చట్నీ లేదా సాంబార్)

  • శనివారం: ఉప్మా (చట్నీ లేదా సాంబార్)

  • పాలు / రాగి జావ: వారంలో 3 రోజులు పాలు, మిగతా 3 రోజులు రాగి జావ అందిస్తారు. చిన్న పిల్లలకు 75 ml, 6 నుండి 12వ తరగతి విద్యార్థులకు 100 ml పాలు

మధ్యాహ్నభోజనంలోలాగా అన్నం, సాంబార్, ఒక కూరతో సరిపోదు… కిచిడీయో, ఉప్మాయో పెట్టేస్తే సరిపోదని రేవంత్ రెడ్డి రకరకాల అల్పాహారాలను నిర్దేశించాడు… సో, బ్రేక్ ఫాస్ట్ ఆచరణ కొంత సంక్లిష్టమే… మరి ఆల్రెడీ ప్రారంభమైన బళ్లల్లో దీని అమలు ఎలా ఉంది..? పిల్లలు, టీచర్లు, తల్లిదండ్రుల ఫీడ్ బ్యాక్ ఏమిటి..? ఓ సర్వే (థర్డ్‌ విజన్‌ రీసెర్చ్‌ అండ్‌ సర్వీసెస్‌) జరిపించింది ప్రభుత్వం… సీఎం నియోజకవర్గం కొడంగల్‌లో పథకం అమలు తీరు మీద… ఇంట్రస్టింగ్ వివరాలు, పాజిటివ్, ఎంకరేజింగ్ ఫీడ్ బ్యాక్… ‘ది హిందూ’ సవివరంగా ఓ ఆర్టికల్ కూడా రాసింది…

good results with cm break fast scheme



బడి బాట పట్టిస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌.. పేద పిల్లల ఆకలి తీరుస్తున్న సంక్షేమ అడుగు!

పిల్లల్ని సర్కారీ బడులవైపు ఆకర్షించడం ఒక్కటే కాదు… ఉదయం ఖాళీ కడుపుతో తరగతి గదిలో కూర్చునే పేద పిల్లలకు పౌష్టికాహారం అందించడం కూడా! కార్పొరేట్‌, ప్రైవేటు విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా మరో ముందడుగు…

సర్వే ప్రకారం, గత విద్యా సంవత్సరంతో పోలిస్తే విద్యార్థుల చేరిక 13 శాతం పెరిగింది… విద్యార్థుల హాజరు 20 నుంచి 22 శాతం వరకు పెరిగినట్లు నివేదిక పేర్కొంది… (ఈ సర్వేలో60 ప్రభుత్వ పాఠశాలల్లో 575 మంది తల్లిదండ్రులు, 1,153 మంది విద్యార్థులు, 176 మంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించారు…)

అవునూ, పిల్లలు ఏ టిఫిన్ అంటే ఇష్టపడుతున్నారు…? బోండా, చట్నీకి 98.1%, దోశ, చట్నీకి 95.3%, మిల్లెట్‌ ఇడ్లీ, సాంబార్‌కు 93.6% మంది విద్యార్థులు మొగ్గు చూపారు… ఇతర కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం…

– విద్యార్థుల చేరిక పెరుగుదల 13% … కొత్తగా చేరిన విద్యార్థులు 1,525 మంది, బాలురు 882 మంది, బాలికలు 643 మంది…

– విద్యార్థుల హాజరు పెరుగుదల 20- 22 శాతం, ఇప్పుడు రెగ్యులర్‌గా స్కూల్ వెళ్తామని పిల్లలు చెబుతున్నారని చెప్పిన తల్లిదండ్రుల శాతం 92.8…

– 99.9 శాతం మంది పిల్లలు అల్పాహారం స్వీకరిస్తున్నారు… ఇక దీనికితోడు పాత మోడల్ స్కూళ్లను సీబీఎస్ఈ సిలబస్‌కు అప్‌గ్రేడ్ చేసి, రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు (ఆరుట్ల మోడల్) కూడా నిర్మితమైతే… నర్సరీ టు 10+2 వరకు … సర్కారీ విద్య దశ, దిశ మారిపోవడం ఖాయం… ఆహ్వానిద్దాం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!
  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions