.
దర్శకుడు అనిల్ రావిపూడి తీసిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన రెండుమూడు అంశాలు నిజమే అయితే ఖచ్చితంగా అభినందించాల్సిందే… నిజానికి ఇండస్ట్రీకి కావల్సింది కూడా ఇదే…
జస్ట్, 72 రోజుల్లో సినిమా పూర్తి… వోకే, ఇది తనే చెప్పాడు కదా… మరో ముఖ్యమైన అంశం 2.27 గంటల ఒరిజినల్ ఫీడ్ కాగా కేవలం 5 నిమిషాలు కట్ చేశారు, మిగతా 2.22 గంటల సినిమా రిలీజ్ చేశారు అని… నిజంగా ఇది విస్మయకరమే…
Ads
గతంలో షూటింగులో సరైన ప్లాన్ లేకపోతే బోలెడు ముడి రీల్ వేస్టయి, నిర్మతకు అదనపు ఖర్చు… కానీ ఇప్పుడు మొత్తం డిజిటల్ కెమెరాలే కదా… ఎంత ఫీడ్ అనేది ముఖ్యం కాకపోవచ్చు… కానీ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే టైమ్, ఖర్చు ఆదా అవుతుందో ఇది తెలియజెబుతోంది…
వెంకటేశ్ ఈరోజుకూ స్టార్ హీరోయే కదా… తను, మీనాక్షి, ఐశ్వర్యాతోపాటు చాలామంది నటులున్నారు… పాటలున్నాయి… అంతమంది ఉన్న సీన్లను ఖచ్చితమైన టైమ్ లెక్కల్లో షూట్ చేయడం నిజమైతే చాలా గ్రేట్… మరో మూడో ముఖ్యాంశం… చౌకగా తీసేయడం…
కంట్రాస్టు చూద్దాం… సుకుమార్ పుష్ప-2 పదే పదే రీషూట్ చేశాడు, మూడేళ్ల సుదీర్ఘ నిర్మాణం, బోలెడు ఖర్చు, జాప్యం… రాజమౌళి గురించి చెప్పనక్కర్లేదు… ఏళ్లకేళ్లు షూటింగు… చివరకు ఈ ఖర్చంతా అధిక నిర్మాణ వ్యయం పేరిట, అధిక టికెట్ రేట్లను పెట్టి ప్రేక్షకులకు జేబుల్ని లూటీ చేస్తారు…
అందుకే అనిల్ రావిపూడిని అభినందించాలి… వోకే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కామెడీ తీరు పట్ల, కథ పట్ల, లాజిక్కుల లేని పోకడల పట్ల, ఓవరాల్‌గా సినిమా పట్ల చాలామంది విభేదించవచ్చుగాక… కానీ పైన పేర్కొన్న అన్ని అంశాల్లోనూ అనిల్ పనితీరును మెచ్చుకోవచ్చు…
మరో నాలుగో ముఖ్యాంశం… పెద్ద పెద్ద రికార్డు స్థాయి కటౌట్లు, భారీ జనంతో పెద్ద పెద్ద ప్రిరిలీజులు గట్రా లేకుండా సోషల్ మీడియాను, టీవీ షోలను చాకచక్యంగా వాడుకుని కొత్త తరహా ప్రమోషన్ వర్క్ చేసి, జనంలోకి తీసుకెళ్లడం…!
Share this Article