…… By …. Bharadwaja Rangavajhala………….. శ్రీరస్తూ శుభమస్తూ! ఒక ఫేసుబుక్కు మిత్రుడు పెళ్లికి ముందు హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలనే నిబంధన పెడితే బాగుంటుందని ప్రతిపాదించారు ఆ మద్దెల . నేను ఇంకాస్త బిగ్ వే లో చించా. అది మనదేశంలో ఎలా అమలు జరుగుతుందో చెప్దామని నా ప్రయత్నం. ఫిట్ ఫర్ మేరేజ్ అనే సర్టిఫికెట్ ఉన్నవారికే పెళ్లిళ్లు అనే చట్టం తీసుకురావచ్చు. అంటే సంబంధం ఖాయం అనుకున్న తర్వాత అమ్మాయినీ అబ్బాయినీ తీసుకుని ప్రభుత్వం వారి ఫిట్ ఫర్ మేరేజ్ సర్టిఫికెట్లు జారీ చేసే కేంద్రానికి వెళ్లి అప్పాయింట్ మెంటు తీసుకోవాలి. అది త్వరగా ఇవ్వడానికి కొంత మామూలు ఇవ్వాలి.
అక్కడో కమిటీ ఉంటుంది. అందులో సైక్రియాట్రిస్టుతో సహా అందరు వైద్యులూ కాబోయే దంపతులను క్షుణ్ణంగా పరీక్షించి ఈ ఇద్దరూ కాపురం మొదలెడితే… శాంతి భద్రతలకుగానీ నేర విభాగానికిగానీ ఏవన్నా పనిపడుతుందా? అనే కోణంలోనూ… అలాగే ఒకరి వలన ఒకరికి సంక్రమించే వ్యాధులేవైనా ఉన్నవా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తారు. అలాగే వారి ఆరోగ్యాలు పదిలమే అనీ అమ్మాయి పసుపు కుంకాలకు ఢోకా ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఢంకా బజాయించి చెప్తారు. ఈ మేరకు సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఇలా సర్టిఫికెట్ లేకుండా జరిగే పెళ్లిళ్లను చట్టబద్దమైన వివాహాలుగా ప్రభుత్వం గుర్తించదు. ఇందాక మనం చెప్పుకున్నామే … అప్పాయింటుమెంటు కోసం మామూలు ఇచ్చుకోవాల్సి వచ్చే అవకాశం ఉందని… అదే ప్రమాద కరం. డబ్బులు తీసుకుని కాస్త అటూ ఇటూగా చూసి సర్తిఫికెట్లు జారీ చేయరని గ్యారంటీ లేదు. ఈ సర్ఠిఫికెట్లకు అయ్యే ఖర్చులు వధూవరులిద్దరూ చెరిసగం భరించాల్సి ఉంటుంది. మగ పెళ్లి వారి ఖర్చు కట్నంలో మినహాయించుకోవచ్చనుకోండి.
Ads
Share this Article