.
Pardha Saradhi Potluri ….. ఫిబ్రవరి 9, 2027 వరకూ భారతదేశానికి మంచిరోజులు!
సుప్రీంకోర్టు లో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మధ్య అత్యంత ఆవశ్యకమైన వాదోపవాదనలు జరిగాయి.
Ads
కపిల్ సిబల్ : ఆధార్ కార్డు ఉన్నా ఓటర్స్ లిస్ట్ నుండి పేర్లు తొలగిస్తున్నారు అధికారులు.
జస్టిస్ సూర్యకాంత్ : ఆధార్ కార్డ్ ఉంటే ఓటుహక్కు ఎలా వస్తుంది?
కపిల్ సిబల్ : ఆధార్ ఒక గుర్తింపు కార్డు కాబట్టి. ఆధార్ ఉన్న ప్రతీ వ్యక్తి ఓటు హక్కు కలిగి ఉంటాడు.
జస్టిస్ సూర్యకాంత్ : ఆధార్ కార్డ్ అనేది ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని నిర్ధారించే హక్కు పత్రం కాదు.
మీ ఉద్దేశ్యంలో పరాయి దేశం నుండి వచ్చి ఆధార్ కార్డ్ తీసుకుంటే ఓటు హక్కు ఇవ్వాలా?
కపిల్ సిబల్ : మౌనమే సమాధానం.
కోర్టులో నిశ్శబ్దం!
జస్టిస్ సూర్యకాంత్ : ఈ దేశంలో విదేశీయులకి ఓటు హక్కు లేదు. S I R ( Special Intensive Revision ) అన్ని రాష్ట్రాలలో జరగాల్సిందే!
కపిల్ సిబల్ కి ఫీజు ఆల్రెడీ ముట్టి ఉంటుంది! వెనక ఉండి కపిల్ సిబల్ కి గంటకి లక్షల్లో ఫీజు రూపంలో ఇచ్చిన వాళ్లకి ఆయాసం తప్పితే ఇంకేమి దొరకదు!
వెస్ట్ బెంగాల్ లో మమతకి సీన్ అర్ధమయ్యింది కాబట్టి చాలా తెలివిగా S I R ని జరగనిస్తూనే మరో పక్క తన MLA ని బహిష్కరించి బంగ్లాదేశ్ సరిహద్దులలో ఉండే ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీదు కట్టమని ప్రోత్సహస్తున్నది!
ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లని ఏరివేస్తూ పోతూ ఉండే కొద్దీ మత ఘర్షణలని రెచ్చగొట్టడానికి పధకం సిద్ధం చేసింది.
అఫ్కోర్స్! కాంగ్రేస్ తో సహా మిగిలిన ప్రతిపక్షాలు మమతతో చేతులు కలుపుతాయి!
ద్రావిడ పార్టీలు ఉన్నంత కాలం తమిళనాడులో మత ఘర్షణలు జరగవు అనే రికార్డ్ ని స్టాలిన్ చేతనే బద్దలు కొట్టిస్తుంది ఎలక్షన్ కమిషన్!
తిరుప్పురకుండ్రమ్ సుబ్రహ్మణ్యస్వామి దీపోత్సవం ఆపడానికి స్టాలిన్ చేసిన ప్రయత్నం రాబోయే రోజుల్లో మత ఘర్షణలని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఒక ట్రయల్ వేశారు.
అక్కడ అలా జరుగుతున్నది కాబట్టి దానిని ఆపండి అంటూ అర్ధరాత్రి సుప్రీం కోర్టు తలుపు తట్టే అవకాశాలు ఇకముందు ఉండబోవు!
జస్టిస్ సూర్యకాంత్ ఏదన్నా ఒక కేసు విషయంలో పిటిషన్ వేయడానికి సీనియర్ లాయర్, అతనితో పాటు ముందే అనుమతి తీసుకున్న అతని జూనియర్లని నలుగురు కంటే ఎక్కువమందిని కోర్టులోకి అనుమతించవద్దు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు!
ఇంతకుముందు ఒక పిటిషన్ వేయడానికి పదుల సంఖ్యలో అడ్వకెట్లు హాజరయ్యేవారు. అంటే తమ సంఖ్యని చూపించి అర్జెంట్ గా కేసు విచారణ చేయమని సదరు న్యాయమూర్తి మీద ఒత్తిడి తేవడానికి సైకలాజికల్ గా భయపెట్టడానికి అన్నమాట!
ఇక ముందు కపిల్ సిబల్ లాంటి హైలీ పెయిడ్ అడ్వకేట్లకి కూడా వరుస సంఖ్యతో పిటిషన్ వేయడానికి మాత్రమే అనుమతి ఇస్తారు.
S I R ని వ్యతిరేకిస్తూ ఎవరన్నా మాటిమాటికీ పిటిషన్లు వేసే అవకాశం లేకుండా చేశారు జస్టిస్ సూర్యకాంత్ !
అందుకే ఫిబ్రవరి 9, 2027 న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ రిటైర్ అయ్యేవరకూ మన దేశానికి మంచిరోజులు అని అన్నది!
ఓట్ చోరీ విషయంలో అమిత్ షా సమాధానం ఇస్తుంటే రాహుల్ లోక్ సభ నుండి వాక్ అవుట్ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం తమకి లోక్ సభలో, సుప్రీం కోర్టులో మాయ చేసే అవకాశం ఉండదని తెలిసిపోయింది! భారత దేశాన్ని ఎలా నాశనం చెయ్యాలి అనే సలహా కోసం జెర్మనీ వెళ్ళాడా రాహుల్!
ఫిబ్రవరి 9, 2027 వరకూ కపిల్ సిబల్, అభిషేక్ మను సింగ్వి, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్లకి ఆదాయం ఉండదు!
ఇక ఇండిగో సంక్షోభం మీద అత్యవసర విచారణ కోసం వేసిన పిటిషన్లని విచారణకు తీసుకోలేదు జస్టిస్ సూర్యకాంత్ !
పైలట్స్ అసోసియేషన్లు వేసిన కోర్టు ధిక్కరణ కేసుని ఢిల్లీ హై కోర్టు విచారణకి స్వీకరించి కేంద్ర పౌర విమానయాన శాఖకి, DGCA కి, ఇండిగోలకి నోటీసులు ఇచ్చింది వివరణ ఇవ్వమని!
కాంటెంప్ట్ అఫ్ కోర్టు అనే దానిమీద పైలట్స్ అసోసియేషన్ కేసు ఎందుకు వేసాయి అంటే డిసెంబర్ ఒకటి నుండి అమలు చేస్తామని చెప్పిన CAR 24 నిబంధలని ఉల్లంఘిస్తూ ఇండిగోకి ఫిబ్రవరి 10 వరకూ గడువు పెంచినందుకు!
జాతీయ ఛానెల్స్ ఎందుకు రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించాయి అంటే పౌర విమానయాన శాఖ మంత్రి అఫిడవిట్ ఇచ్చాడు డిసెంబర్ 1 కల్లా CAR 24 నిబంధలని అమలు చేస్తామని… మరి కోర్టు ధిక్కరణ అవదా?
Share this Article