Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

header-new-unit-muchata.com
  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ పుస్తకం నిండా ఓ ‘నిశ్శబ్ద విస్ఫోటనం’ తాలూకు శిథిలాలు..!!

January 17, 2021 by M S R

కాలం మారుతోంది… ఇప్పుడంతా డిజిటల్… పుస్తకం కావచ్చు, థియేటర్ కావచ్చు…. సినిమా అంటే, సీరియల్ అంటే ఓటీటీలో వీక్షణమే… అలాగే పుస్తకమూ ఈ ‘దారి’కొచ్చింది… ఇంగ్లిషులో అయితే డిజిటల్ పుస్తకం ఓపెన్ చేసి, రీడ్ ఇట్ అనే అప్షన్‌లోకి వెళ్లిపోతే… అరమోడ్పుగా కళ్లుమూసుకుని వెనక్కి వాలితే… అది కథ చదివి పెడుతుంది… ఇంకా మన తెలుగులో అది విస్తృతంగా రాలేదు… తెలుగు నవలారచనలో శైలికి, కంటెంటుకు సంబంధించి బోలెడు విజయవంతమైన ప్రయోగాలు చేసిన యండమూరి వీరేంద్రనాథ్ తొలిసారిగా పెయిడ్ డిజిటల్ ఆన్‌లైన్ సీరియల్ తీసుకొచ్చాడు… పేరు నిశ్శబ్ద విస్ఫోటనం… (డిజిటల్ బుక్స్ అమ్మకానికి, అద్దెకు చాలా ఏళ్లుగా వున్నవే… ఓ సీరియల్ బహుశా ఫస్ట్ టైం కావచ్చు…)

nissabda visphotanam

ఇంగ్లిషులో పాపులర్ పుస్తకాలు, ఇలాంటి సీరియల్స్ మీద రివ్యూలు బాగానే కనిపిస్తయ్… కానీ తెలుగులో చాలా తక్కువ… యండమూరి పెట్టిన ఒక ఫేస్‌బుక్ పోస్టులో ఓ కామెంట్‌లో ఓ చిన్నచర్చ… అందులో మిత్రుడు Neelayapalem Vijay Kumar కామెంట్ దాదాపుగా ఒక రివ్యూ… అది యథాతథంగా…



Sorry…. నిన్న రాత్రి.. (నిన్నంటే నిన్నే)…’నిశ్శబ్ద విస్ఫోటనం’ రాత్రి పన్నెండు దాకా మేలుకొని చదివిన తర్వాత (నా లైఫ్లో మొదటి సారి యండమూరి పుస్తకాన్ని రెండు సార్లు కొన్ని పేజీలు చదివి పక్క పెట్టేసాను…మూడోసారి పూర్తి చేసా…)…… నాకు ఫిక్షన్ మీద ఇంటరెస్ట్ పోయిందో… లేక మీరు ఆ ఇంట్రెస్ట్ ని సస్టయిన్ చెయ్యలేదో…తెలియలేదు గానీ….ఆ ” వావ్” ఫీలింగ్ రాలేదు… భవిష్యత్తు అంటూ మీరు ఆనందో బ్రహ్మ లో ఏమి చెప్పినా ఆ “ఇల్లాజికల్” అనే ఫీలింగ్ రాలేదు… అయిదు కోట్లు సంపాదన అంటూ చెప్పినా లాజిక్ లేదు అనిపించలేదు…. M16 లెవెల్లో ఉన్నట్టు రాసేసిన రుద్రనేత్ర కూడా లాజిక్ లెస్ అనిపించలేదు…ఇంకా అనేక పుస్తకాలు…నిజమే..కదా…ఇలాగే జరగచ్చు అని చదివేశాము….

కానీ… నిన్న అర్ధరాత్రి నిశ్శబ్ద విస్ఫోటనం తర్వాత…. ఒక ఫక్తు లాజిక్ అనేది అర శాతం కూడా వుండని ఈ తరం యంగ్ హీరోల తెలుగు సినిమా గుర్తుకొచ్చింది….దీనిలో హీరోయిన్ అంతే…. అన్నట్టు….ఈ నవలలో, విలన్ ఎవరు సర్? మీసాల రాజు అని చెప్పరు మీరు. తెలుసు. కానీ ఇంకెవరు? చాణుక్య కానే కాదు..! మరి….? యండమూరి మార్క్ లేదా అంటే…. కాలేజీ పిల్లలు నేర్చుకొని విషయాలు చాలా వున్నాయి… కాలేజీ ఏంటి … కార్పోరేట్ లు, రాజకీయవాదులు కూడా తమ మీటింగుల్లో చెప్పుకోదగ్గ ఆణి ముత్యాలు ఉన్నాయి…”లౌక్యం” దగ్గర నుంచి… అడవిలో మృగరాజుని జంతువులు రాజుగా ఎన్నుకోలేదు దాకా… కొద్దిగా మార్చిన బర్బరీకుడు కధ దాకా…. కానీ అవేవీ కధలో ఇంటగ్రేట్ కాలేదు…. విడిగా చాలా బాగున్నాయి… మీరు రాసిన పాత పుస్తకాల్లో ఆణి ముత్యాల లాగా… కానీ ఇక్కడ ఈ నవలలో… ఏదో… నవల నిడివి పెంచడానికి రాసినట్టే ఉంది… అసలే 230 పేజీల నవల… దానిలో కథకు సంబంధం లేని విషయాలే 30 పేజీలు పైగా ఉన్నాయి… ఇక 200 పేజీల్లో ఇంత breadth ఉన్న కధని, “ఇన్సిడెంట్స్” లేకుండా చెప్పుకొంటూ వెళ్లారేమో అనిపించింది….

కోర్టు సీన్లు మరీ చప్పగా ఉన్నాయేమో అనిపించింది… ముఖ్యంగా ప్రత్యర్థి వైపు నుంచి కనీసం ఒక్కటైనా strategic move లేకపోవడం… హీరోయిన్ శ్రమ లేకుండా సునాయాసంగా గెలవడం… అదీ ఎలా గెలిచింది ఇన్సిడెంట్స్ లేకపోవడం…. plot పెద్దగా పండలేదేమో… “ఆర్ట్ ఆప్ వార్” ఇన్స్పిరేషన్ అన్నారు… కానీ అవతలి వైపు.నుంచి ఒక్క రేప్ ఘటన తప్పిస్తే, అదీ అనుకోకుండా జరిగింది….ఇక ఏమీ రెసిస్టన్స్ లేదు… సీఎం ని ఒక జోకర్ చేశారు…హోమ్ మినిష్టర్ ని ఒక సైడ్ యాక్టర్ను చేశారు… వాళ్ళ శక్తి యుక్తులు ప్రదర్శించి, దాన్ని హీరోయిన్ ఎలా ఎదుర్కొంది అని చెప్పేవి మీ ఇంతకు ముందు పుస్తకాలు… అతడే ఆమె సైన్యం లాంటివి… ఇక్కడ ఈ బుక్ లో it was lacking somehow…. హీరోయిన్ ఏమి అనుకొంటే అవి జరిగిపోతే, ఇక యుద్ధం ఎక్కడ ఉంది? ఈరోజు పొద్దున నాదే తప్పు అనుకోని ర్యాక్ లో నల్లంచు తెల్ల చీర మరొకసారి చదివాను… కానీ ఇప్పటికీ అది బ్రహ్మాండముగా ఉంది…. May be, మీ విషయంలో పాఠకులు ఎదగకుండా తొంభైలోనే ఆగిపోయారేమో… మేమింకా అప్పటి తరంలోనే ఉండిపోయామెమో… మాకు ఆ యండమూరి మాత్రమే కావాలి అనిపిస్తుందేమో… లేదా, ఆ రోజు పాఠకులు, ఈ రోజు అప్పటికంటే వయసు మీరే వుంటారు కాబట్టి… ఈ ఫిక్షన్ రుచించలేదేమో… ఏమో తెలియదు… ఇంకా గుర్తొస్తే వ్రాస్తాను…

The disclaimer is that Sir,….In no case this is meant to demean you in any way…We all have grown up reading and enjoying your books, in fact following many of your words… Your art of living motivational books were extremely good though the same are available even in english, the native touch and flavour you give makes it more convincing and appealing… In that background thus particular book as a fiction was not so appealing…. But some of the write ups on ways to deal issue in life, even in this book ate extremely good and worth sharing a thousand times.. Wondered for an hour, after writing, whether to share this or not…. I know I will have lot of bricks upon me… యండమూరికి చెప్పేంత వాడివా నువ్వు అని… In fact me too had that feeling exactly… But as you yourself said many times … You should say what you feel if your intention is right… I am doing that…



Follow Us


Share this Article


Search On Site

Advertisement

Latest Articles

  • టార్గెట్ అంబానీ…! కేవలం మనీ కోసమేనా..? అంతటి మొసాద్‌కూ చిక్కని క్లూ..!!
  • కాక పెరుగుతోంది..! కానీ ఎవరు గెలిస్తే ఎవరికేం ఫాయిదా..?!
  • మట్టి మోసం చేయదు… ఉప్పెనలో తేలిపోయిన ఊక, ఉప్పు… అసలు కథ ఇదీ…
  • పాకిస్థాన్‌కు మోడీ రహస్య సందేశం… ఒకేమాట… అంతే, అభినందన్ వచ్చేశాడు…
  • నో డౌట్… పాట బంపర్ హిట్…! కానీ సుద్దాల ఎక్కడ ఎత్తుకొచ్చాడు దీన్ని..?!
  • కంగనా రనౌత్, ఆలియా భట్, దీపిక పడుకోన్… ఈ పాత్రకెవరు సూటబుల్..?
  • పోనీ… ప్రతి చందాకూ ఐటీ వారి ధ్రువపత్రం జతచేయాలా కామ్రేడ్..?!
  • మరీ ఎక్కువ చదివావోయ్… నువ్వు ఈ కొలువుకు పనికిరావు… గెటౌట్…
  • ప్రేమ ఖతం..! ప్రియుడి హత్యకు ప్రియురాలి సుపారీ… ప్లస్ ఒక పూట..?
  • ఇప్పుడిలా సాగిలబడ్డాయి గానీ… ఒకప్పుడు పొలిటికల్ కార్టూన్ అంటే…?!

Archives

Copyright © 2021 · Muchata.com · Technology Support by Rishi Bharadwaj

Add Muchata to your Homescreen!

Add Now