Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మల్లెమాల తప్పే అది… సుమది కాదు… హైపర్ ఆది ఒప్పుకోకుండా ఉండాల్సింది…

January 2, 2024 by M S R

నిజంగానే నచ్చలేదు… హైపర్ ఆది మొహం మీద యాంకర్ సుమ ఉమ్మేయడం ఏమిటి..? అసలు హైపర్ ఆది ఆ సీన్ ప్రసారానికి ఎందుకు ఒప్పుకున్నట్టు..? ఇదీ ప్రశ్న… ఇక్కడ సుమను తప్పుపట్టడం కాదు, ఆది మీద జాలిపడటం కాదు… అసలు మల్లెమాల ప్రొడక్షన్స్ గానీ, ఈటీవీ గానీ దాన్ని అలాగే ఎందుకు ప్రసారం చేసినట్టు..? రేటింగుల కోసమా..? అదే నిజమైతే అంతకన్నా దరిద్రం లేదు…

విషయం ఏమిటంటే..? ఈటీవీలో సర్కస్ ఫీట్ల డాన్స్ షో ఒకటి వస్తుంది కదా… పేరు ఢీ… ఈ సీజన్ సెలబ్రిటీల మధ్య కంపిటీషన్… సరే, ఇదొక వినోదం… డాన్సర్లు ట్రెయినింగ్ ఇస్తారు, సెలబ్రిటీలు ఆడతారు… కన్నడందం ప్రణిత, శేఖర్ మాస్టర్ జడ్జిలు… సరే, తన కొడుకు సినిమా బబుల్‌గమ్ ప్రమోషన్ల కోసం సుమ తెగ తిరుగుతోంది… ప్రతి టీవీ షోలనూ కొడుకును, హీరోయిన్ మానసను తీసుకుని వెళ్తోంది… అందులో భాగంగానే ఈ ఢీ షోకు వెళ్లింది…

సినిమా అట్టర్ ఫ్లాప్… అది సుమ చీప్ టేస్టుకు నిదర్శనంగా ఉందని మనం చెప్పుకున్నాం ఆల్‌రెడీ… సరే, ఆ ఢీ ఎపిసోడ్‌కు ఆమె అతిథి… ఈటీవీకే ఆమె ఆస్థాన కళాకారిణి కదా, తగిన గౌరవం, ప్రాధాన్యం ఉంటాయి… అక్కడ శ్వేతానాయుడు అనబడే కంటెస్టెంట్ మ్యాడ్ సినిమాలోని పడితెనన్నా పడతది, లేకపోతే తిడతది అనే ఓ మసాలా సాంగ్‌కు డాన్స్ చేసింది… అందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకుని బయటికి ఊసేయాలి… చేసింది…

Ads

ఈలోపు సరదాగా సుమ బ్రహ్మానందం స్టయిల్‌లో నేను చెప్పింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి అని కామెంట్ విసురుతుంది… వినోదం కోసమే… హైపర్ ఆది అందుకుని (తను కూడా ఈటీవీ ఆస్థాన కళాకారుడే, ఏ షో చూసినా తనే…) సుమ నేర్పించింది కదా, ఆమె చేసి చూపిస్తుంది అని అంటాడు… ఆ ఎపిసోడ్‌కు కాస్త ఫన్ ఫ్లేవర్ కోసం… తప్పులేదు… సుమ కూడా రెండు స్టెప్పులు వేసి, తనూ నోట్లో నీళ్లు పోసుకుని బయటికి ఊసేస్తుంది… ఆ ఎంగిలి నీటిని పట్టుకోవడానికి ఓ చిన్న బకెట్ పట్టుకుని హైపర్ ఆది ఆమె ముందు వంగుతాడు… పొరపాటున అవి హైపర్ ఆది మొహమ్మీద, బాడీ మీద పడతాయి…

తను నవ్వుతూ లేచి నిల్చున్నాడు… ఇదీ ఎపిసోడ్… తను అర్థం చేసుకున్నాడు, నెగెటివ్‌గా ఏమీ తీసుకోలేదు… కానీ చూసేవాళ్లకే ఇబ్బందికరంగా ఉంది… ప్రోమోలో స్పష్టంగా కట్ చేశారు… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఈ సీన్ ప్రసారానికి హైపర్ ఆది ఎందుకు ఒప్పుకున్నట్టు..? అదేమీ లైవ్ కాదు, మన ఇష్టం… ఫలానాచోట కట్ చేయమని అడిగితే కట్ చేస్తారు… చేయాలి… పైగా హైపర్ ఆది లేక ఈటీవీలో ఫన్ షోలు లేవు… పైగా ఫిమేల్ యాంకర్లలో సుమ ఎంత పాపులరో, దాదాపుగా మేల్ యాంకర్లలో హైపర్ ఆది కూడా అంతే స్టార్‌డం ఎంజాయ్ చేస్తున్నాడు…

సరే, సుమ కావాలని చేసింది కాదు, ఏదో పొరపాటు… సినిమా ప్రమోషన్ కోసం అంత ఘోరంగా బిహేవ్ చేస్తావా అంటూ సుమ మీద భారీ ట్రోలింగ్ కూడా జరుగుతోంది… కానీ ఇక్కడ తప్పు ఆమెది కాదు, హైపర్ ఆదిది కాదు… అప్పుడలా జరిగిపోయింది, కొన్నలా జరిగిపోతాయి… కాకపోతే దాన్ని యథాతథంగా జనంలోకి మల్లెమాల వాళ్లు ఎందుకు తీసుకొచ్చినట్టు… చీప్‌గా ఉంది… జబర్దస్త్ స్కిట్లలాగే…! ఢీ షోలో డాన్సుల్లాగే…!!

నిజానికి సుమ గ్రహచారం ఉల్టా తన్నుతున్నట్టుంది… వేణుస్వామి టైమ్ తీసుకుని ఏదో ఉపశాంతి పూజ చేయించుకోవల్సిందేనేమో… మొన్నామధ్య స్నాక్స్- భోజనం అనే సరదా వ్యాఖ్యల్ని ఎవడో కలంవీరుడు రచ్చరచ్చ చేస్తే ఆమె క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది… కొడుకు లాంచింగ్ డిజాస్టర్… ఇప్పుడేమో ఈ రచ్చ, భారీ ట్రోలింగ్… సుమ అనుభవించిన మహర్దశ ఏదో వెనుతిరిగినట్టుంది…!!

ఇప్పటికీ హైపర్ ఆదికి ఓ చాన్సుంది, తను కోరుకుంటేనే సుమా… ఆ ప్రోమో బదులు వేరే ప్రోమో కట్ చేయించవచ్చు… ప్రసార సమయంలో ఈ సీన్ కట్ చేయవచ్చు… సైట్లలో, ట్యూబ్ చానెళ్లలో ఈ వీడియో బిట్‌ను తీసేయించవచ్చు… ఫోటోలతో సహా… ఎటొచ్చీ, హైపర్ ఆది అభిమానంతో ఫీలైతేనే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సారీ రాజేష్… మన దిక్కుమాలిన న్యాయవ్యవస్థలో ఇక ఇంతే…
  • హీరోయిన్‌ను మారుద్దామని పంచాయితీ పెడితే… హీరోనే పీకిపారేశాడు…
  • మ్… తెలుగు పాటల్లో పూర్ణ అనుస్వరంపై చంద్రబోస్ సరైన వ్యాఖ్యానం…
  • టమాట రైతుకు గట్టి భరోసా… టమాటర్ పాలసీతో చైనాను దాటేయొచ్చు..!!
  • BRS లో చేరగానే… ఈ కొత్త బాస్‌పై ఆ పాత ఆరోపణలన్నీ డిలిటేనా..?
  • 70 ఏళ్ల క్రితమే ఓ సూపర్ పాన్ ఇండియా మూవీ… ఆ స్టార్ ఎవరో తెలుసా..?
  • బూతుకూ హాస్యానికీ నడుమ ఓ గీత… దానికి జంధ్యాల గౌరవం…
  • కార్పొరేట్ విద్య అంటేనే ఓ నయా మాఫియా… పిల్లలు బలి..!!
  • ఇతడు..! ఓ లేజర్ తాత గారు… ఓ హిమేశ్ బాబు… ఓ పాత స్పూఫ్…
  • సంతానసాఫల్యం… ఈ వ్యాపారం అనేక మార్గాలు… ఎన్నెన్నో మోసాలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions