Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… హైపర్ ఆది పెళ్లాడేది వర్షిణిని కాదా…? మణికంఠ ఖాతాలో పడుతోందా..?!

August 7, 2023 by M S R

ఈమధ్య కొన్నాళ్లుగా హైపర్ ఆది ఓ సీనియర్ యాంకర్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు యూట్యూబర్లు, పలు సైట్లు ఊదరగొట్టాయి… ఔనా, నిజమేనా అని ఆరా తీస్తే… వర్షిణి పెళ్లి చేసుకోబోతున్నదనేది కరెక్టే కానీ హైపర్ ఆదితో మాత్రం కాదని తెలుస్తోంది… హైపర్ ఆది టార్గెట్ వేరు… తను జనసేన టికెట్టు సంపాదించాలి… ఎమ్మెల్యేగా గెలవాలి… పవన్ కల్యాణ్ సీఎం కాగానే తను మంత్రి అయిపోవాలి…

అబ్బో, పెద్ద కలలే అంటారా..? అవును మరి, కలలకు దరిద్రం దేనికి..? సాధారణంగా బండ్ల గణేష్, మల్లారెడ్డిల మాటలు మస్తు నవ్వు పుట్టిస్తాయి కదా… నిన్న భోళాశంకర్ సినిమా ప్రమోషన్ (ప్రిరిలీజ్ ఫంక్షన్) షోలో హైపర్ ఆది చెలరేగిపోయాడు ఆ ఇద్దరినీ మించి… సినిమాలు, రాజకీయాలు, కామెడీ ఎట్సెట్రా కలిపి కొట్టాడు… నా సామిరంగా చిరంజీవి ఉబ్బితబ్బిబ్బయిపోయాడు… తనకూ ఆనందమే కదా…

సరే, అందరూ ఏదో రాస్తుంటారు… సౌమ్యారావుతో, ఇంద్రజతో, విష్ణుప్రియతో… ఎవరితోనైనా సంబంధాలు అంటగట్టేస్తున్నారు… సరే, తన కోణం వదిలేసి, వర్షిణి కోణంలోకి వెళ్దాం… ఆమెకూ మల్లెమాల డైరెక్టర్ మణికంఠకు గాఢమైన అనుబంధం పెరిగిపోయిందని అంటున్నారు… సరే, ఫీల్డులో కామనే కదా అని తేలికగా తీసిపారేయకండి… ఎందుకంటే..?

Ads

ఏ టీవీ చానెలైనా తన రేటింగ్స్ ఘోరంగా పడిపోతే ఏం చేస్తుంది..? ఎక్కడ లోపం ఉందో కనిపెట్టి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది… ఈటీవీ కూడా అదే చేయాలి… కానీ అది డిఫరెంట్ కదా… దాని బలం రియాలిటీ షోలు… వాటిల్లో ఎక్కువగా చేసేది మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ… అదేనండీ శ్యాంప్రసాదరెడ్డి కంపెనీ…

ఢీ, జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ఎట్సెట్రా షోలకు రేటింగ్స్ దారుణంగా పడిపోయి, ఏకంగా ఈటీవీ మూడో ప్లేసులో కొట్టుమిట్టాడుతోంది… అందుకని మల్లెమాల ప్రోగ్రాంలో నాణ్యత పెంచాలని ఈటీవీ ఆదేశించింది… ఇక మల్లెమాల కంపెనీ తమ క్రియేటివ్ డైరెక్టర్ల మీద కోపం పెంచుకుంది… ప్రోగ్రామ్స్‌లో నాణ్యత లోపించడానికి డైరెక్టర్లు శ్రీపాద, మణికంఠలే కారణమని తేల్చేసుకుంది… ముందుగా శ్రీపాద మీద వేటు పడింది…

varshini

తను ఈమధ్య మల్లెమాల నుంచి, తద్వారా ఈటీవీ నుంచి బయటపడి… మాటీవీలో చేరాడట… ఇక మిగిలింది మణికంఠ… వచ్చే నెలలో తను కూడా మల్లెమాల నుంచి ఎగ్జిట్ అట… మరీ ఈమధ్య వర్షిణితో తిరుగుళ్లు ఎక్కువ అయిపోయి ప్రోగ్రామ్స్ మీద కాన్సంట్రేట్ చేయడం లేదని మల్లెమాల తేల్చేసుకుని ‘ఇక నీ సేవలు చాలా బ్రదర్’ అని చెప్పేసిందట… ఆల్‌రెడీ కొత్త డైరెక్టర్ ఒకరు వచ్చేశారట కూడా…

ఎలాగూ బయటపడుతున్నాను కదా అని మణికంఠ ఇక వర్షిణిని పెళ్లి చేసుకోవడానికి ఫిక్సయిపోయాడని టీవీ సర్కిళ్లలో ఓ ప్రచారం సాగుతోంది… కథ ఇలా ఉంటే ఫాఫం, హైపర్ ఆదికీ వర్షిణికీ ముడిపెట్టేశారు… పెట్టేస్తారు… పెట్టకపోతేనే ఆశ్చర్యం… (స్టోరీకి వాడిన ముఖచిత్రం మణికంఠ ప్లస్ చిరంజీవి… ఏదో ఓ ప్రతీకాత్మక చిత్రం… అంతేతప్ప చిరంజీవితో ఈ స్టోరీకి సంబంధం లేదండోయ్…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!
  • “Kavitha walks free..! A massive blow to an already battered BRS..!!”

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions