.
Gurram Seetaramulu ….. ఎర్రగడ్డలో ఉండాల్సిన సన్నాసులు డైరెక్టర్లు అయితే ఇలాంటి మాటలే వస్తాయి.. ఏమనీ..? నా పెళ్లాం శివుడితో నేరుగా మాట్లాడుతుంది వంటి పిచ్చి కూతలు…
(ఇంటర్వ్యూ చేసిన ఆయనెవరో పెద్దమనిషి గతంలో గ్రేటాంధ్ర అనుకుంటా… ఇప్పుడు ఐడ్రీమా…?) తెలుగు సినిమాలు పెద్దగా నచ్చవు నాకు… నిన్న ఈ తోపు దర్శకుడి సినిమా చూద్దామని వెళ్లా…
Ads
ఒక చేపలు పట్టే వాడికి సూటు వేస్తే చూడొచ్చేమో… కానీ ఒక ఆగర్భ శ్రీమంతున్ని ఒక బెస్తవానిగా చూపడం మాత్రం కష్టం…. పైగా ఆ కులపోళ్లు మొత్తం నల్లగా ఉంటారు, మోటు చొక్కాలు వేస్తారు అనే స్టీరియో టైప్ రంగుల అద్దకాలతో పరమ వికారంగా ఉంది…
ఇండియా పాకిస్థాన్ జాతి వైరం, జాతీయోద్యమం జెండా చూపిస్తే నాలుగు పైసలు రాల్చుకోవచ్చు అనే ఖడ్గం తరహా పరమ రోత సినిమా ఈ తండేల్…
వాఘా బోర్డర్‌లో రాజకీయ ఖైదీలను ధర్నా చేయించి పాక్ , ఇండియా , ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు , రక్షణ శాఖ ఎంబసీ అందరినీ అర్ధగంటలో ఆధార్ కార్డు లేని వాడికి కూడా గంటలో పాస్ పోర్ట్ ఇప్పించే తెంపరి తనం…
వాఘా బోర్డర్‌లో ధర్నా చేసి పాక్ జైలులో ఉన్న ఖైదీలను విడుదల చేయించే ఎంబసైల్ దర్శకులు, నిర్మాతలు, దాన్ని చూసి చప్పట్లు కొట్టే ఎంబసైల్ ప్రేక్షకులు, రివ్యూ రాతగాళ్ళు ఉన్న ఈ తెలుగు గడ్డ మీద ఇలా శివుళ్లతో, అఘోరాలతో రొమాన్స్,… ఇంకా మాట్లాడితే శవాలను తింటూ, వాటితో శృంగారం చేసే కథలు ముందు ముందు చూస్తామేమో…
అందాకా శివుడితో నిత్యం టెలి కాన్ఫరెన్స్‌తో మాట్లాడే (యే భాషలో మాట్లాడుకుంటారో మరి) ఆ దేవ దూత ఇంటివాడి సినిమా చూసి తరించండి… నాకైతే పరమ వికారంగా అనిపించింది… వికారానికి డబ్బులు యెక్కువ వస్తాయి, అది వేరే కథ అనుకో…
Share this Article