.
Subramanyam Dogiparthi…. సరిపోయారు ఇద్దరికిద్దరూ . చదువుని రోడ్ల మీదకు ఈడ్చి ఖచడా ఖచడా చేస్తున్నారు . తమ చెత్త రాజకీయాలకు చదువుని బకరా చేస్తున్నారు . భాషా ప్రావీణ్యత వేరు , మాధ్యమం వేరు . ఇంత చిన్న విషయం అమిత్ షాకు , స్టాలినుకు , ఇతర నాయకులకు తెలియదు అని నేను అనుకోవటం లేదు .
ప్రజలు కూడా ఓ క్లారిటీకి రావాలి .విద్యను రోడ్ల మీదకు ఈడ్చవద్దని మన నాయకులకు క్లాస్ పీకాలి .
దేశమంతా త్రిభాషా సూత్రాన్ని అమలుపరచాలి . ఫస్ట్ లాంగ్వేజ్ మాతృభాష . సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ . థర్డ్ లాంగ్వేజ్ హిందీ/ఏదయినా మరో ప్రాంతీయ భాష/సంస్కృతం . మూడు భాషల్ని క్షుణ్ణంగా నేర్పటం .
Ads
ఇంక ఇతర సబ్జెక్టులు . లెక్కలు , సోషల్ స్టడీస్ , హిస్టరీ , వగైరా . మాతృభాషలో చదువుకుంటారా లేక ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారా అనే ఛాయిస్ విద్యార్ధికి లేదా తల్లిదండ్రులకు వదిలేయాలి . గత పదేళ్ళుగా చాలా రాష్ట్రాలు తిరిగాను . ఒకప్పుడు చాలామంది ఇంగ్లీష్ చక్కగా మాట్లాడకలిగే వారు . ఈమధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఇంగ్లీష్ పరిస్థితి ఘోరంగా తయారయింది . కమ్యూనికేషన్ చాలా కష్టం అయిపోయింది .
హైస్కూల్ విద్య వరకు ఈ విధానాన్ని పాటిస్తే విద్యార్థులు ప్రపంచాన్ని ఏలేయగలరు . లేనట్లయితే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే డబ్బున్న వారే రాణించగలరు . పేద విద్యార్థులకు అన్యాయం చేసిన వారవుతారు .
ఆ తర్వాత కాలేజి , మెడిసిన్ , ఇంజనీరింగ్ , ఫార్మసీ వంటి చదువులు మీడియం ఏది అనేది విద్యార్ధులకు వదిలేయాలి .
ప్రాంతీయ భాషల్లో , హిందీలో ఉన్నత విద్య , సాంకేతిక విద్య వలన విశ్వ వ్యాప్తంగా విద్యార్థులు రాణించలేరు . ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకుండా ప్రపంచమంతా రాణిస్తున్న వారి సంఖ్యను పరిశీలించండి . మీకే అర్థం అవుతుంది .
భాష వేరు , మీడియం వేరు . మీడియం ఏదయినా ప్రతీ విద్యార్ధి మూడు భాషల్లో నిష్ణాతుడు కావాలి . ప్రజలు , ముఖ్యంగా చదువుకున్న ఆలోతనాపరులు , రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి . తమ పిల్లల భవిష్యత్తులో ఆటలు ఆడవద్దని నాయకులకు క్లాస్ తీయాలి . లేకపోతే మన తర్వాత తరం నస్టపోతుంది .
హిందీ రుద్దకండి మహానుభావా అని దక్షిణాది రాష్ట్రాలు మొత్తుకుంటుంటే… నువ్వు ముందుగా తమిళంలో ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులు ప్రవేశపెట్టు అంటాడు అమిత్ షా… లోకసభ సీట్ల డీలిమిటేషన్‌తో మాకు అన్యాయం జరుగుతుంది బాబోయ్ అంటే ప్రొరేటా పెంచుతాములే అంటాడు… అమిత్ షాకు ఏమైంది..?
ఇంజినీరింగ్, మెడికల్, ఇతర ఏ కోర్సయినా సరే… రెఫరెన్స్ మెటీరియల్, రీసెర్చ్, స్టడీ, సబ్జెక్టు పుస్తకాలు గట్రా ఇంగ్లిషులో అపారం… ప్రాంతీయ భాషల్లో చదివితే చదువయ్యాక ఏం చేయాలి మిస్టర్ అమిత్ షా..? ఎవరైనా ఈ సారుకు తెలుగు అకాడమీ పుస్తకాలు, వాటిల్లోని తెలుగు భాష గురించి చెప్పాలి, ఇక మళ్లీ మాట్లాడదు…
ప్రపంచంలో ఎక్కడైనా కొలువు సంపాదించి బతకగలిగే జ్ఞానాన్ని నేర్పించాలి గానీ ఇవెక్కడి వింత డిమాండ్లు మహాశయా..? భవిష్యత్తు తరాలకు జ్ఞానం విషయంలో కూడా రాజకీయాలేనా..? …. – ముచ్చట
Share this Article