Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ను చదివింది…

November 6, 2022 by M S R

బెంగుళూరులో పుట్టింది… గుజరాతీ తల్లిదండ్రులు… మధ్యతరగతి కుటుంబం… ఆమెకు డాక్టర్ కావాలని కోరిక… 1970… ఇరవయ్యేళ్ల వయస్సు… మెరిట్ ఉంది… డైనమిజం ఉంది… కానీ ఎందుకోగానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కాలేకపోయింది… విధి లేక డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు తీసుకుని చదవసాగింది… విదేశాల్లో స్కాలర్‌షిప్స్ ఇచ్చి వైద్యం బోధించే యూనివర్శిటీలకు అప్లయ్ చేసేది… ఉపయోగం లేదు… ఆమె పేరు కిరణ్ మజుందార్…

తండ్రి రసేంద్ర మజుందార్ ప్రముఖ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్‌లో హెడ్ బ్రూ మాస్టర్… అంటే బీర్ల తయారీ సమయంలో ఎంతమేరకు సరుకు పులిసింది, ఫైనల్ ఔట్‌పుట్ క్వాలిటీ ఎలా ఉంది వంటివి చూసుకునే కీలకమైన విభాగం… తను ఓ సలహా ఇచ్చాడు బిడ్డకు… ఆస్ట్రేలియా వెళ్లి ఫర్మంటేషన్ కోర్సు చేయాలని..! అంటే సరుకులు పులియడం మీద డిగ్రీ… అప్పటికి అలాంటి కోర్సులు ఉంటాయనే ఎవరికీ తెలియదు ఇండియాలో… పైగా బీర్ల కంపెనీలో బ్రూ మాస్టర్‌గా పనిచేయడం అంటే ఆడవాళ్లకు నప్పదు… కానీ కిరణ్ రెడీ అయిపోయింది…

Ads

ఆస్ట్రేలియా వెళ్లింది… వాళ్ల క్లాసులో తనొక్కతే లేడీ స్టూడెంట్… అక్కడే ఫర్మంటేషన్‌లో మాస్టర్స్ కూడా చేసింది… అక్కడే ఒకటీరెండు ప్రముఖ బ్రూవరీస్‌లో పనిచేసింది… తరువాత ఇండియాకు వచ్చింది… పలు బ్రూవరీస్‌లో మాస్టర్ బ్రూవర్ పోస్టుకు అప్లయ్ చేసేది… అందరూ రిజెక్ట్ చేసేవాళ్లు… నవ్వేవాళ్లు… అది మగాళ్ల కొలువు అని మొహం మీదే చెప్పేవాళ్లు… ఫర్మంటేషన్ జాబ్స్ వేరే ఉండేవి కావు… మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లడానికి రెడీ అయ్యింది…

ఆమె తరచూ నవ్వుతూ చెబుతుంది ఓ మాట… తన ఎదుగుదలకు కారణం తన ఫూలిష్ కరేజ్… మొండి ధైర్యం… అలాగే ఆలోచించింది… ఎక్కడికో వెళ్లి, ఎవడి దగ్గరో బీర్ల రుచి చూసే కొలువు దేనికి..? తన చదువును చౌక ఔషధాలకు పనికొచ్చే బయోఫార్మా వైపు, ఇతర సరుకుల వైపు ఎందుకు మళ్లించకూడదు అనుకుంది… ఆస్ట్రేలియా వెళ్లి ఫర్మంటేషన్ డిగ్రీ చేయడం ఎలాంటి నిర్ణయమో ఇదీ అంతే… కానీ ఆమె నిర్ణయం తీసేసుకుంది…

బొప్పాయి నుంచి పపైన్ అనే ఓ ఎంజైమ్ తీస్తారు… దీన్ని మాంసం మృదువుగా ఉంచడానికి వాడతారు… ఇలాంటివే రెండుమూడు ఎంజైమ్స్ తయారు చేయడం అమెరికా, యూరప్‌లకు ఎగుమతి చేయడం…. కానీ ఈ కంపెనీ (బయోకాన్) స్టార్ట్ చేయడానికి కూడా తిప్పలే… ఆమె అద్దెకు ఉండే కారు షెడ్డులో 10 వేల పెట్టుబడితో స్టార్ట్ చేసింది…

ఆమె వయస్సులో చిన్నది కావడం, పైగా మహిళ… అంతకుముందు ఎవరికీ తెలియని వ్యాపారం… దాంతో నిధుల సమీకరణ కష్టమైంది… ఏదో సోషల్ ఈవెంటులో ఓ బ్యాంకు మేనేజర్ కలిసి, ఆమె చెప్పిందంతా విని, రుణం ఇవ్వడానికి అంగీకరించాడు… కానీ నిపుణులు దొరకడం మరో కష్టం… ఓ షెడ్డులో పెట్టిన కంపెనీలో పనిచేయడానికి ఎవరు ముందుకొస్తారు… మరీ మగఉద్యోగులు..? పైగా టెక్నికల్, ల్యాబ్ పరికరాల సమస్య వీటన్నింటికీ అదనం… నిరంతర విద్యుత్తు ఉండదు, నాణ్యమైన నీరు దొరకదు… ఐనాసరే మొండిగా పనిచేసింది… మొదటి సంవత్సరం ఆమె సంపాదన 20 ఎకరాల భూమి… భవిష్యత్తు అవసరాల కోసం…

ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి ఓసారి సలహా ఇచ్చాడు… దాంతో బయోకాన్ పేరిట స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ ఇష్యూకు వెళ్లింది… అప్పట్లో ఐపీఓల బూమ్ ఉండేది… తరువాత తను అనుకున్నట్టు కంపెనీ, అనుబంధ కంపెనీలు, ఇతర ఉత్పత్తులు… బయోఫార్మా రంగంలోకి అడుగు… పనిరాక్షసి… డబ్బు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడింది… ఎక్కడి ఫర్మంటేషన్ డిగ్రీ కోర్స్… ఎక్కడి వేల కోట్ల బయోకాన్… ఆమె నెట్‌వర్త్ 250 కోట్ల డాలర్లని అంచనా… ఇప్పుడామె వయస్సు 69… జాన్ షాను పెళ్లాడింది…. ఆయన మొన్నటి అక్టోబరులోనే మరణించాడు…

Ads

ఆమె గురించి చెప్పుకోవడం ఎందుకంటే…? ఈ సక్సెస్ గురించి కాదు… ఆమె దాతృత్వం గురించి… అసలు ఔదార్యం, దాతృత్వం అనే పదాలే ఆమెకు నచ్చవు… మన వ్యాపారాలే ‘కారుణ్య పెట్టుబడులు’ అంటుంది… కర్నాటకలో వైద్య, విద్య, మౌలిక వసతుల డెవలప్‌మెంట్ కోసం విస్తారంగా డబ్బులు ఖర్చు చేసింది… చేస్తూనే ఉంది… వాటిల్లో చెప్పదగింది 1400 బెడ్స్ కేన్సర్ హాస్పిటల్… సో, పులియడం అనేది నెగెటివ్ టరమ్ కాదు… అది ఆరోగ్యం కోసమే…!!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • లక్ష కోట్ల అవినీతి… ప్రతి రాజకీయ ప్రచారానికీ ఓ లెక్క ఉంటుంది…
  • ఆ ఫ్లాట్లలోనే మగ్గిపోకుండా… స్విగ్గీలు అయిపోకుండా… కాస్త కిందకు దిగండి…
  • పవన్ కల్యాణ్ బెటరా..? జూనియర్ బెటరా… తేల్చుకోవాల్సింది చంద్రబాబే…
  • గ్రూప్ వన్ నియామకాల వైఫల్యం… కేసీయార్ పాలనకు చేదు మరక…
  • పండితపుత్రుడు ట్రూడా… ఇండియాతో గోక్కుని ‘దెబ్బ తినేస్తున్నాడు…’’
  • సినిమాగా ‘పర్వ’… ఆదిపురుష్‌లాగే తీస్తే అడ్డంగా తిరస్కరించడం ఖాయం…
  • Petal Gahlot… పాకిస్థాన్ అధ్యక్షుడిని కబడ్డీ ఆడేసుకుంది… అసలు ఎవరీమె..?!
  • మందు ఎక్కితే… ఆంగ్లం దానంతటదే తన్నుకుని వస్తుంది అదేమిటో గానీ…
  • బాబు గారూ… మీకు చౌతాలా వయస్సు, జైలుశిక్ష గురించి ఏమైనా తెలుసా..?!
  • సొసైటీ మీద పడి కోట్లు దండుకుని బతికే వాళ్లతో… సొసైటీకి జీరో ఫాయిదా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions