….. సుప్రీంకోర్టు ఎదుటకు ఓ ఇంట్రస్టింగ్ కేసు వచ్చింది… 94 సంవత్సరాల ఓ వితంతువు సుప్రీంకోర్టులో కేసు వేసింది… అదేమిటంటే..? నాటి ఇందిరాగాంధీ మార్క్ ఎమర్జెన్సీ విధింపు రాజ్యాంగవిరుద్ధం అని ప్రకటించి, తనకు 25 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని..! అప్పుడెప్పుడో 1975లో ఇందిర విధించిన ఎమర్జెన్సీపై ఇప్పుడు ఎందుకు విచారణ అంటారా..? అదే కేసులోని ఆసక్తికరమైన అంశం…
పిటిషనర్ పేరు వీరా సరీన్… మొరాదాబాద్‌లో పుట్టింది… తొమ్మిది మంతి సంతానంలో ఒకరు… తండ్రి ఓ మెషినరీ స్కూల్‌లో టీచర్… ఈమె కూడా అప్పట్లోనే బీఈడీ చేసి, తనూ టీచర్ అయ్యింది… అమెరికాలో మాస్టర్స్ చేసి వచ్చింది… 1957లో ఢిల్లీలో నగల వ్యాపారం చేసే హెచ్.కె.సరీన్‌తో పెళ్లయ్యింది… పెద్ద పెద్ద ఢిల్లీ తలకాయలు వాళ్ల కస్టమర్లు… ఢిల్లీలో పేరున్న ఫ్యామిలీ… నగల విలువ మదింపునకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి సలహాదారు…. కానీ ఏం జరిగింది..?
ఎమర్జెన్సీ విధించగానే కొందరు అధికారులు టార్గెట్ చేశారు… ఫారిన్ మనీ రెగ్యులేషన్స్ కింద నోటీసులు ఇచ్చారు… కారణాలు ఊహించుకొండి… నాయకులకన్నా మాదచ్చోద్ కేరక్టర్లు అధికారులే… ఈ కుటుంబంపై నిఘా… ఎవరూ మాట్లాడటానికి లేదు, అందరూ భయంలో బతకాల్సిందే… ఫలితంగా ఆయన దేశం విడిచివెళ్లిపోయాడు… ఈ ఒత్తిళ్లు, నిఘా, వేధింపులు భరించలేక అనారోగ్యానికి గురై మరణించాడు… ఆస్తులు సీజ్, చివరకు ఆ నగలు ఎటుపోయాయో ఎవరికీ తెలియదు… ఎవడి పాలయ్యాయో ఎవడికీ తెలియదు… అంతా అరాచకం…
ఒక దశలో ఈ కుటుంబం ఈ వేధింపులు భరించలేక దేశం విడిచి పారిపోయింది… తరువాత మళ్లీ దేశానికి వచ్చింది… ఆస్తులేమీ లేవు… చివరకు తన తల్లి నగలు కూడా అమ్మకానికి వస్తున్న తీరు చూసి ఆమె కొడుకు బోరుమన్నాడు… అప్పటి నుంచీ ఆమె ఆ అధికారుల వేధింపుల మీద పోరాడుతూనే ఉంది… కుటుంబం ఛిన్నాభిన్నమైంది…
కానీ ఎమర్జెన్సీ కదా, వేధింపులు భరించలేక ఒక దశలో ఈమె కూడా దేశం విడిచివెళ్లిపోయింది… తరువాత వచ్చింది… Conservation of Foreign
Exchange and Prevention of Smuggling Activities Act కింద వేధింపులు తప్పలేదు… అప్పటి నుంచీ పోరాడుతూనే ఉంది ఒంటి చేత్తో…
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆస్తుల రిలీజ్ కోసం న్యాయపోరాటం… ఎంతకూ కదలవు, ఎవరికీ పట్టదు… కేసులు, వాయిదాలు, విచారణలు… ఆమధ్య హైకోర్టు ఒక ఆస్తి లీజు మీద తీర్పు చెబుతూ ఆమెకు ఆ బకాయీలన్నీ చెల్లించాలని చెప్పింది… అది కాస్తా సుప్రీం దాకా వచ్చింది… ఆమె ఈ వయస్సులో కూడా కోర్టుల్లో పోరాడుతూనే ఉంది…
గ్రేట్ ఫైట్… ఆమె సుప్రీంకు వెళ్లింది… అసలు ఆ ఎమర్జెన్సీ వల్ల కదా తనకు ఈ సమస్యలు… భారత రాజ్యాంగం మేరకు తనుకున్న ఆస్తి హక్కు కోల్పోవడం మాత్రమే కాదు… చివరకు బతికే హక్కుకూ భంగం వాటిల్లిందనేది ఆమె వాదన… ప్రస్తుతం సుప్రీంలో ఈ కేసు విచారణకు రానుంది… ఇవి కదా అసలు వార్తలు… రాజ్యాంగం చెప్పిన ప్రతి హక్కూ ఎమర్జెన్సీ కాలంలో కోల్పోవాల్సిందేనా..? తను కోల్పోయిన తన భర్త, తన ఆస్తులకు ఇక విలువ ఏమున్నట్టు…? ఆమె లేవనెత్తిన విలువైన ప్రశ్నకు సుప్రీం ఏం చెబుతుందో చూడాలి…!!
ఇక్కడ చెప్పుకోవాల్సింది అత్యయిక స్థితి అంటే… నాయకులు, పార్టీలు జాన్తా నై… అధికారులదే రాజ్యం… అరాచకం… అసలు నాయకులన్నా ప్రమాదకారులు అధికారులే అని…!!