ఫతేపూర్ జిల్లా, వికాస్ దూబే అనే 24 ఏళ్ల కుర్రాడు ఏం చెప్పాడు..? గుర్తుంది కదా… ‘‘40 రోజుల్లో 7 సార్లు పాము కాటేసింది, ప్రతి శనివారం వస్తోంది… కలలో వచ్చి 9 సార్లు కాటేస్తాను, తొమ్మిదోసారి నువ్వు ఖతం, నిన్ను తీసుకుపోతాను నాతో అని చెప్పింది… వేరే ఊళ్లకు వెళ్లి, వేరే వాళ్ల ఇళ్లల్లోకి వెళ్లి పడుకుంటే అక్కడికీ వచ్చి కాటేసింది, పాము కాటేసే 3, 4 గంటల ముందు సూచన కూడా వస్తోంది, ఇక నన్ను ఆదుకొండి, లేకపోతే హతమైపోతాను’’ అని కదా చెప్పుకుంది…
మనం కూడా ముచ్చటలో పబ్లిష్ చేశాం కదా… తన మాటల్ని బట్టి చూస్తే ఇదంతా నిజం కాదని తెలుస్తోందనీ, అసలు పాము పగ అనేది సినిమాల్లో, టీవీ సీరియళ్లలోనే కనిపిస్తుందనీ చెప్పుకున్నాం కదా… ప్రభుత్వం ముగ్గురు డాక్టర్లతో ఓ కమిటీ వేసి, ఈ వికాస్ సంగతేమిటో తేల్చమని అడిగింది కదా… వాళ్లూ అదే చెప్పారు… Ophidiophobia… ఒఫిడియోఫోబియా… అంటే పాములంటే భయపడే ఏ ఫోబియోతో తను బాధపడుతున్నాడని తేల్చేశారు…
నిన్న తమ నివేదిక ఇచ్చారు కలెక్టర్‌కు… అందులో ఒక కాటు మాత్రమే నిజమని పేర్కొన్నారు డాక్టర్లు… అంటే 40 రోజులు, ఏడుసార్లు పాము కాట్లు అనేది ఉత్త అబద్ధం… సోమవారం చీఫ్ మెడికల్ ఆఫీసర్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, తహసిల్దార్, అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్లు సదరు వికాస్ ట్రీట్మెంట్ తీసుకున్నానని చెబుతున్న రామ్‌సనేహి నర్సింగ్‌హోంకు వెళ్లారు…
Ads
వికాస్ దేహంపైన పాము కాటు గుర్తులను, అదే నర్సింగ్ హోం ఐసీయూలో ఉన్న మరో రోగి దేహంపై పాము కాటు గుర్తులను పోల్చారు… తద్వారా ఒకసారి మాత్రమే ఆ పాము కాటేసినట్టు, మిగతా గుర్తులు పాము కాటేసినవి కావనీ గుర్తించారు… ఈ టీం ట్రీట్‌మెంట్ ఫైళ్లను కూడా పరీక్షించింది… చివరకు ఓ కంక్లూజన్ చెప్పింది టీం… తను పాములంటే ఓ రకమైన ఫోబియాతో బాధపడుతున్నాడు అని..! ఇప్పుడు తనకు చికిత్స చేయగలిగేది కేవలం సైకియాట్రిస్టులు మాత్రమేనని ముక్తాయించారు ఆ నివేదికలో…!
Share this Article