Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…

March 26, 2026 by M S R

.

( గోపు విజయకుమార్ రెడ్డి ) …. గత రెండు మూడు రోజుల నుంచి మనం RCB, Rajasthan Royals టీమ్‌ల యాజమాన్య హక్కుల బదలాయింపు గురించి మాట్లాడుకున్నాం కదా, రెండు టీమ్‌లు కలిపి మొత్తం దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు చేతులు మారాయంటే ఎంత ఆశ్చర్యం… అసలు ఒక్కసారి 2008లో జరిగిన వేలం మరియు దాని కమర్షియల్ బిడ్డింగ్స్ ఒక్కసారి పరిశీలిస్తే చాలా ఆసక్తికరమైన కథలు ఉన్నాయి…

ముందుగా 8 టీమ్‌ల కోసం బిడ్‌లో పాల్గొన్న కంపెనీల సంఖ్య 11. ఇండియాలోని అన్ని పెద్ద పెద్ద మీడియా హౌస్‌లు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. Times of India గ్రూప్ పాల్గొనకపోవడం ఒక సర్ప్రైజ్, అలాగే Tata గ్రూప్ కూడా… కొన్ని రోజుల తర్వాత Sun TV Deccan Chargersని కొనడం అందరికీ తెలిసిందే. అలాగే RPG గ్రూప్ Lucknow Super Giantsని కొనుగోలు చేయడం.

Ads

ఎందుకు మీడియా హౌస్‌లు అని చెబుతున్నానంటే, IPL కానీ క్రికెట్ కానీ నడిచేది స్పాన్సర్‌షిప్, TV/సాటిలైట్ రైట్స్ నుంచి వచ్చే రెవెన్యూస్ మీద కాబట్టి, ఎగ్జిస్టింగ్ మీడియా హౌస్‌లకి బిజినెస్ రన్ చేయడం చాలా ఈజీ. ఆఖరికి అప్పటి Star గ్రూప్ మెయిన్ ప్రమోటర్ రూపర్ట్ మర్డాక్ కొడుకు కూడా Rajasthan Royalsలో మొదట్లో ఒక భాగస్వామి. అంటే మీడియా, IPL క్రికెట్‌కు ఎంత విడదీయరాని సంబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.

మొత్తం మొదటి వేలంలో పాల్గొన్న కంపెనీలు 11…. పదకొండు నగరాలకు బిడ్డింగ్ జరిగింది. అందులో అంబానీ Reliance Holdings కంపెనీ అయిన Ratipriya Private Limited 11 జట్లకు గాను 8 జట్ల కోసం బిడ్డింగ్ వేసింది. ఆశ్చర్యంగా బిడ్డింగ్ వేయని నగరాలు హైదరాబాద్, బెంగుళూరు, కటక్…. 8 నగరాల్లో బిడ్డింగ్ వేస్తే 6 నగరాల్లో హైయెస్ట్ బిడ్డర్ అయినా, IPL వేలం నిబంధనల ప్రకారం ఒక యాజమాన్యం లేదా ప్రమోటర్లు ఒక్క జట్టునే కొనుగోలు చేయగలరు అనే నిబంధన వల్ల ముంబైని ఉంచుకుని మిగిలిన 7 నగరాలను వదిలేసింది…

ipl

ముంబై, కోల్కతా, కాన్పూర్, అహ్మదాబాద్, మొహాలి, జైపూర్ నగరాలకు హైయెస్ట్ బిడ్ వేసి గెలిచినా, చివరికి కేవలం ముంబైని మాత్రమే ఉంచుకుని మిగిలిన అన్ని నగరాలను వదిలేసింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియ మీద ముఖ్యంగా అప్పటి చైర్మన్ లలిత్ మోడీ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. (లండన్ ప్రవాసం వెళ్లిపోయి ఈరోజుకూ మళ్లీ ఇండియాకు రాలేదు)…

ఉదాహరణకి అహ్మదాబాద్ నగరాన్ని తీసుకుంటే మొత్తం 2 బిడ్స్ వచ్చాయి— ఒకటి రిలయన్స్ ముఖేష్ అంబానీ గ్రూప్‌ది, అయితే రెండవది తమ్ముడు అనిల్ అంబానీ గ్రూప్ Emerald Telecom. ప్రైస్ పరంగా అహ్మదాబాద్‌లో రిలయన్స్ గెలిచినా, ముంబై జట్టు యాజమాన్య హక్కులు ఉంచుకుని ఉండటం వల్ల అహ్మదాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చింది.

కానీ రెండో హైయెస్ట్ బిడ్డర్ అయిన Emerald Telecom ఎందుకో జట్టును చేజిక్కించుకోలేకపోయింది (ఒక ఆరోపణ ఏంటంటే పెద్దన్న చిన్నన్నను ఎదగనీయకుండా తొక్కేశాడని). ఒక్కో టీమ్‌ది ఒక్కో స్టోరీ. నెక్స్ట్ రైట్‌అప్‌లో Royal Challengers Bangalore గురించి చెప్పుకుందాం…


If Mallya would have bid 0.4m(16cr INR as per that time USD) more for Mumbai –

He would have owned Mumbai

Ambani would have owned Delhi

GMR would have owned Bengaluru

Wow…!.


Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…
  • దురంధర్-3 కాదు…! ఆదిత్య ధర్ దృష్టి మరో పే-ద్ద ప్రాజెక్టు మీద..!!
  • సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
  • ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…
  • క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…
  • … ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…
  • మల్టీ నేషనల్ కంపెనీలకన్నా మనవాళ్లు తక్కువేమీ కాదు… చదవండి…
  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!
  • వావ్, షేన్ వార్న్..! సంపద సృష్టించడం అంటే, ఇదుగో ఇదీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions