నిన్న, ఈరోజు తెలంగాణలో ట్రెండింగ్ కొన్ని అంశాలున్నయ్… 1. మహిళల రిజర్వేషన్లకు కేసీయార్ బిడ్డ కవిత అప్పట్లో చేసిన పోరాటం, ఈరోజు ఆరేడుగురు మహిళలకు మాత్రమే కేసీయార్ టికెట్లు ఇచ్చాడు… 2. కేసీయార్ జాబితాలో అత్యధికంగా రెడ్లు, కమ్మలే ఉన్నారు… బీసీలకు పెద్ద మొండిచేయి… 3. కేసీయార్ రెండుచోట్ల పోటీచేయడం… 4. అప్పట్లో ఎమ్మెల్యే రాజయ్య ద్వారా వేధింపులకు గురైన సర్పంచి నవ్య ‘నువ్వు రాజకీయం ఎట్ల చేస్తవో చూస్తా అని చిటికెలు వేస్తూ హెచ్చరించిన వీడియో… 5. హరీష్‌రావుపై మైనంపల్లి హన్మంతరావు ఘాటు వ్యాఖ్యలు… 6. కమ్యూనిస్టులను కేసీయార్ పురుగుల్లాగా తీసిపారేయడం…
ఇవన్నీ తెలంగాణ రాజకీయాలకు సంబంధించి… ఇవి గాకుండా ఇంకాస్త వైరల్ ఏమిటంటే… రజినీకాంత్ యోగి కాళ్లు మొక్కడం, దానిపై కొందరి విమర్శలు, దానికి షారూక్ ఖాన్ మమతా బెనర్జీ కాళ్లు మొక్కుతున్న ఫోటోతో రీకౌంటర్ ఫోటోలు… చంద్రయాన్3 విక్రమ్ ల్యాండర్ ఫస్ట్ ఫోటో పంపించినట్టుగా ప్రకాష్ రాజ్ పెట్టిన ఫోటో… అందులో లుంగీ కట్టుకున్న ఓ వ్యక్తి టీ కాస్తున్నాడు… ఈ ఫోటో మీద జాతీయవాదులు అనగా కాషాయవాదులు సోషల్ దాడి చేస్తున్నారు…
Ads
ఎస్, ప్రకాష్ రాజ్ కాస్త పర్వర్టెడే… అప్పట్లో కేసీయార్ వెంట తెగతిరిగాడు… తరువాత కేసీయార్ వదిలించుకున్నాడు… అదంతా వేరే కథ… అలాంటోళ్లను చాలామందిని చేరదీస్తాడు కేసీయార్, తరువాత ఆ తెప్పలు తగలేస్తాడు… ఐనా ప్రకాష్ రాజ్‌కు కేసీయార్ వెంట తిరిగేటంత స్ట్రేచర్ లేదనేది వేరే సంగతి… ఆ ప్రకాష్ రాజ్ తన ట్వీట్లలో హిందుత్వ మీద అక్షరాలా విషం కక్కుతాడు… మోడీ అన్నా, బీజేపీ అన్నా విపరీతమైన ద్వేషం… తన మాటల్లో, తన ట్వీట్లల్లో కనిపించేది అదే…
కొన్నిసార్లు రాంగోపాలవర్మ, ప్రకాష్ రాజ్‌ల నడుమ తిక్క ట్వీట్ల పోటీ సాగుతుంటుంది… ఇప్పుడు తాజాగా తను చంద్రయాన్ మీద పెట్టిన ఫోటో, వ్యాఖ్య మీద కూడా భారీ ట్రోలింగ్ సాగుతోంది… నిజానికి ఎక్కడైనా నలుగురు గుమిగూడే ఏ సందర్భం వచ్చినా సరే అక్కడ ఎవరో ఓ కేరళైట్ సైలెంటుగా చాయ్ అమ్మకం స్టార్ట్ చేస్తాడనే ఓ వ్యంగ్యప్రచారం ఏనాటి నుంచో ఉన్నదే…
వాళ్లే కాదు, ప్రపంచంలో ఏ మూల వెళ్లినా ఓ పంజాబీ దాబా, ఓ గుజరాతీ మాల్ కూడా కనిపిస్తాయనే ప్రచారం కూడా వినిపిస్తుంటుంది… ఆంధ్రుల కర్రీ పాయింట్స్ మీద కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి… అదుగో ఆ దిశలో వినిపించే జోకే ప్రకాష్ రాజ్ వేసిన ట్వీట్… చివరకు చంద్రుడి మీదకు వెళ్లినా సరే, అక్కడ ఆల్రెడీ టీ కాస్తున్న ఓ మలయాళీ కనిపిస్తాడనేది ఆ జోక్, ఆ ఫోటో సారాంశం… ఇందులో చంద్రయాన్‌ను గానీ, భారత అంతరిక్ష కార్యక్రమాల మీద వేసిన టేస్ట్ లెస్ వ్యాఖ్యలు గానీ ఏమీ లేవు… కానీ ప్రకాష్ రాజ్ ఏ సున్నితమైన అంశంలో ఏం మాట్లాడినా కాషాయ శిబిరం ఖండఖండాలుగా నరుకుతూ ఉంటుంది కదా… ఈ జోక్‌ను చీల్చి చెండాడటం కూడా సేమ్, అదే…!!
Share this Article