.
పుష్ప2 అనగానే ఇప్పుడు బన్నీ బాధ్యతారాహిత్యం, తలపొగరు, అరెస్టు, చివరకు దిల్ రాజు రంగప్రవేశంతో తెర వెనుక ఏదో జరిగి వ్యవహారం సెటిలై, సదరు స్టార్ హీరోను నేల మీదకు దించాయనే బొచ్చెడు వార్తలు కనిపిస్తున్నాయి, కనిపించాయి… ఆల్‌మోస్ట్ ఇష్యూ ఖతం…
ఈ వార్తల్లో పడి నిజంగా ఆ సినిమా హిట్టా, ఈ 1685 కోట్ల అత్యంత భారీ అనూహ్య వసూళ్ల అసలు లాభాలు నష్టాల మాటేమిటనేది పెద్దగా చర్చనీయాంశం కాకుండా పోయింది… ఇందులో 785 కోట్లు హిందీ ఎడిషన్, నార్తరన్ బెల్ట్ వసూళ్లు…
Ads
హిందీ బెల్టులో చాలా రికార్డులను బ్రేక్ చేసింది నిజమే… రస్టిక్, గుట్కా హీరో బాగా కనెక్టయినట్టున్నాడు వాళ్లకు… కానీ..? మిగతా చోట్ల..? అదీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకింత చర్చనీయాంశం అవుతోంది ఇప్పుడిప్పుడే… ఎందుకంటే..? ఆల్మోస్ట్ కమర్షియల్ థియేటర్ రన్ కంప్లీట్ అయినట్టే… వారంలో సంక్రాంతి సినిమాలు, అవీ గేమ్ చేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం అనే పెద్ద హీరోల పెద్ద సినిమాలే… థియేటర్లు భారీగా వాటికే బుక్కయ్యాయి…
మల్లు అర్జున్‌గా పిలిచే బన్నీ అభిమాన కేరళలో కేవలం 14 కోట్లు… ఓవరాల్ సినిమా వసూళ్లతో పోల్చితే ఫ్లాప్… సేమ్, కర్నాటకలో కూడా,.. జస్ట్, 7.7 కోట్లు… కన్నడిగులు లైట్ తీసుకున్నారు… తమిళనాడు కాస్త నయం… 57.83 కోట్లు… తమిళ హీరోల సినిమాల్ని మనం చూస్తాం తప్ప, వాళ్లు మన హీరోల్ని లైట్ తీసుకుంటారు, ఐనా సరే, ఈ పుష్ప2 వసూళ్లు కాస్త నయమే…
మరి తెలుగు రాష్ట్రాల్లో… బన్నీ సొంత రాష్ట్రంగా భావించబడే ఏపీలో ఎక్కడా బయ్యర్లకు బ్రేక్ ఈవెన్ రాలేదని ఓ వార్త చక్కర్లు కొడుతోంది… సీడెడ్, యూఎస్ఏ కూడా అంతేనట… ఎటొచ్చీ హైదరాబాద్ మార్కెట్ ఉన్న నైజాంలో మాత్రమే సేఫ్ ప్రాజెక్టు అంటున్నారు…
సో, బయ్యర్లు అడ్డగోలు రేట్లకు కొని మునిగిపోయారన్నమాట… నిర్మాతలు క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ హైప్, పోటీల్లో పడి పుష్ప ఫస్ట్ పార్ట్ విజయంతో పోల్చుకుని అడ్డగోలు రేట్లు పెట్టి కొన్నారు… తలల మీద ఎర్ర తువ్వాళలు వేసుకున్నారు…
హీరోకు 300 కోట్లు అట, దర్శకుడికి 100 కోట్ల అట… ఎడాపెడా అధిక రేట్లకు బయ్యర్లకు ముడిపెట్టిన నిర్మాతకు కోట్లేకోట్లు… ఎటొచ్చీ మునిగేది బయ్యర్లు… అవును, రిస్క్ వాడిదే… వ్యాపారం ప్లస్ లాటరీ… హీరోలు, దర్శక నిర్మాతలు, హీరోయిన్లు, కొందరు వృత్తి నిపుణులు సేఫ్… ఎగ్జిబిటర్లకూ పోయేదేమీ లేదు…
కేరళ, కర్నాటక వదిలేయండి, కొన్ని ప్రాంతాల్లో ఫ్లాప్ అనే విశ్లేషణలు మాత్రం తప్పు… బయ్యర్లు నష్టపోతే అది ఫ్లాప్ ఎలా అవుతుంది..? వాళ్లు కొన్న రేట్లను బట్టి నష్టం అనాలే తప్ప ఫ్లాప్ అనకూడదు… ఆ నష్టం కూడా బయ్యర్ల స్వయంకృతం… అంతే..! తెలుగు వసూళ్లు 332 కోట్లు అంటే చిన్న విషయం కాదుగా..!!
Share this Article