Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇరకాటంలో ఇజ్రాయిల్… వేగంగా మారుతున్న ప్రపంచ రాజకీయాలు…

June 22, 2024 by M S R

ఇజ్రాయెల్ ప్రమాదంలో పడబోతున్నది! ఎప్పుడు అన్నదే ప్రశ్న! కానీ ఈసారి మాత్రం చాలా పెద్దదానికే ప్లాన్ చేసింది ఇరాన్!

హెజ్బోల్ల – లెబనాన్!
లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్ల టెర్రర్ గ్రూప్ అమెరికాతో ఒప్పందానికి నిరాకరించింది!
గాజాలోని రఫా పట్టణం మీద ఇజ్రాయెల్ దాడి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మొదట హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కోసం డిమాండ్ చేసి తరువాత మాట మార్చి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునేది లేదని తేల్చి చెప్పింది!

మరోవైపు హేజ్బొల్ల లెబనాన్ వైపు నుండి ఇజ్రాయెల్ మీద దాడులు ఉధృతం చేసింది! ఇజ్రాయెల్ కి చెందిన ఐరన్ డోమ్ లాంచర్లని ధ్వంసం చేస్తున్నది హెజ్బొల్ల! హేజ్బొల్ల ఇప్పటి వరకూ తాము నాలుగు ఐరన్ డోమ్ లాంచర్లని ధ్వంసం చేసినట్లు ప్రకటించగా IDF మాత్రం ఒకే ఒక్క లాంచర్ దెబ్బతిన్నట్లుగా ప్రకటించింది!

Ads

తటస్థంగా ఉంటూ గాజా యుద్ధ వార్తలని వెల్లడిస్తున్న మిడిల్ ఈస్ట్ కి చెందిన రెండు వెబ్ న్యూస్ చానల్స్ మాత్రం నాలుగు లాంచర్స్ తో పాటు ఒక ఫైర్ కంట్రోల్ రాడార్ కూడా దెబ్బ తిన్నట్లుగా పేర్కొన్నాయి. ఐరన్ డోమ్ అనేది కేవలం జనావాసాల మీద రాకెట్లు పడకుండా నిరోధించే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ! కానీ ఇకముందు ఐరన్ డోమ్ అనేది 50% శాతం మాత్రమే రక్షణ ఇవ్వగలదు! ఐరన్ డోమ్ బలహీనతలని కనిపెట్టగలిగింది రష్యా! So! ఇజ్రాయెల్ కి భారీ ప్రమాదం పొంచి ఉంది!

*********************
ప్రస్తుతం హెజ్బొల్ల గ్రూపు చాలా ప్రమాదకరంగా మారింది! గత రెండేళ్ల కింద హెజ్బొల్ల వేరు! ప్రస్తుత హేజ్బొల్ల వేరు! రష్యా, ఇరాన్, చైనాలు వెనుక ఉండి హెజ్బొల్లను బలమైన మిలిటెంట్ గ్రూపుగా మార్చేశాయి! హేజ్బొల్ల ఇప్పటికే ప్రకటించిన ప్రకారం 15,000 మంది ఆత్మాహుతి దళాలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది! అఫ్కోర్స్! 15,000 మంది ఆత్మాహుతి దళాల ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ చేసింది!

AK – 47 లతో పాటు 10,000 సేమీ గైడెడ్ రాకెట్స్, గ్రనేడ్ లాంఛర్స్, IED (Improvised explosive device), హాండ్ హెల్డ్ శాటిలైట్ నావిగేషన్ యూనిట్స్, MANPAD, లతో పటిష్టమైన ఒక లక్ష మంది ఫైటర్స్ ను ఇజ్రాయెల్ మీద దాడికి సిద్దం చేసినట్లు హేజ్బొల్ల పేర్కొంది!

**************
ఇరాన్, రష్యా, చైనాల ప్లాన్ ఏమిటంటే యుక్రెయిన్ విషయంలో అమెరికా, యూరోపు దేశాలు కలుగచేసుకున్నంత సేపూ హెజ్బొల్ల, హమాస్ లతో ఇజ్రాయెల్ మీద దాడి చేయిస్తూనే ఉండాలి! కానీ ఈసారి చాలా పెద్ద దాడికి సిద్దం అవుతున్నాయి! దీనిని ఆపేదెలా?

**************************
హమాస్ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది! అలా అని పూర్తిగా అంతరించినట్లు కాదు! కానీ లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న హెజ్బొల్ల బలంగా తయారయ్యింది. హేజ్బొల్ల బలం తగ్గించాలి లేదా పూర్తిగా నాశనం చేయాలి. అలా చేయాలి అంటే లెబనాన్ దేశంలోకి IDF ప్రవేశించి దాడులు చేయాల్సి ఉంటుంది!

***********************
వేదిక: బీరూట్, లెబనాన్ రాజధాని!
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కి మధ్య ప్రాచ్యం సలహాదారుడు అయిన Hochstein further నిన్న లెబనాన్ ప్రధాని నజిబ్ మికాటి, లెబనాన్ పార్లమెంట్ స్పీకర్ నబిన్ బెర్రి, ఇతర లెబనాన్ ఉన్నత అధికారులతో హై లెవల్ మీటింగ్ లో పాల్గొన్నాడు! హై లెవల్ మీటింగ్ లో Hochstein further లెబనాన్ ప్రధాని తో చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి….

మేము (అమెరికా) ఇజ్రాయెల్ కి మద్దతు కొనసాగించాలి అని నిర్ణయం తీసుకున్నాము. హమాస్ మరియూ హెజ్బొల్లలతో చర్చలు జరిపి ఒక అంగీకారానికి రావాలని ప్రయత్నించాం కానీ రెండు గ్రూపులు చర్చలు జరపడానికి నిరాకరించాయి. మాతో పాటు మా మిత్ర దేశాలు, ఇజ్రాయెల్ కి మద్దతు ఇచ్చి హెజ్బొల్ల మీద దాడి చేయడానికి గాను లెబనాన్ దక్షిణ ప్రాంతంలోకి IDF తో పాటు నాటో దళాలు ప్రవేశిస్తాయి అని తెలియచేస్తున్నాను. ఇది మా అధ్యక్షుడు జో బిడేన్ మాటగా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది!

లెబనాన్ ఆర్మీ మా విషయంలో జోక్యం చేసుకోకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది! మేము హెజ్బోల్లను లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న లితాని నది అవతలి వైపుకి నెట్టివేస్తాం , దీని వల్ల హెజ్బోల్ల ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి చేయలేని స్థితిలోకి వెళుతుంది! ముందుగా మీకు ఈ విషయం తెలియచేస్తున్నాము!

********************
So! Hochstein further చాల సున్నితంగా లెబనాన్ కి హెచ్చరిక జారీ చేశాడు! దాడి నాలుగు వారాలలోపు జరగవచ్చు అని టూకీగా చెప్పాడు. కానీ అంతకంటే ముందే ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడికి దిగవచ్చు! ఇజ్రాయెల్, అమెరికా, నాటో దేశాల లక్ష్యం హెజ్బొల్లను దక్షిణ లెబనాన్ లోని లిటాని నది అవతలి వైపుకి నెట్టడమే అయినా, లెబనాన్ కేంద్రంగా సిరియా మీద కూడా దాడులు చేసే అవకాశం ఉంటుంది! మళ్ళీ సిరియా అగ్నిగుండం అవుతుంది అన్నమాట!

సిరియాను రక్షించుకోవడానికి రష్యా తన ఆయుధ సంపత్తిలో కొంత భాగం మధ్యధరా సముద్రం మీద పెట్టాల్సి వస్తుంది! అదే సమయంలో తన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సిరియాలో మొహరించాల్సి వస్తుంది! రష్యాకి ఇది అగ్ని పరీక్ష అన్నమాట! రష్యా, ఇరాన్, చైనాలు కలిసి డ్రామా కోసం ఇజ్రాయెల్ లో ఒక థియేటర్ ఓపెన్ చేశాయి. ఇప్పుడు అమెరికా, నాటోలు కలిసి మూసేసిన సిరియా థియేటర్ ను మళ్లీ ఓపెన్ చేయబోతున్నాయి!

ఇంకో థియేటర్ తైవాన్ లో ఓపెన్ అయి ఉంది కానీ ఇంకా నాటకం మొదలవ్వలేదు కానీ రిహార్సల్స్ జరుగుతున్నాయి! మరో కొత్త థియేటర్ హిందూ మహా సముద్రంలో ఓపెన్ చేసి భారత్ ను భాగస్వామిని చేయాలని అమెరికా ఆశ పడుతున్నది కానీ అది చైనా వైఖరి మీద ఆధారపడి ఉంది!

*********************
తమ డ్రామాల కోసం లెబనాన్, పాకిస్థాన్ లని వాడుకోబోతున్నాయి అగ్ర రాజ్యాలు. రెండు దేశాలూ ఆర్థికంగా బాగా దెబ్బతిన్న స్థితిలొ ఉన్నవే!

అంచేత 2024 ప్రపంచంలో అన్ని చోట్లా అశాంతి ఉంటుంది! ఈ డ్రామాలో తాము భాగస్వాములం కాకూడదని కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి కొన్ని యూరప్ దేశాలు మరికొన్ని మాజీ సోవియట్ యూనియన్ రిపబ్లిక్ దేశాలు. ఇంకా ఉంది చెప్పాల్సింది…. (By పోట్లూరి పార్థసారథి)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions