అనుకుంటూ ఉన్నదే… మొన్నామధ్య మనమూ ముచ్చటలో చెప్పుకున్నాం కూడా… జీతెలుగులో వచ్చే జగద్ధాత్రి సీరియల్ కాస్త బాగుంది, రేటింగ్స్‌లో టాప్ ప్లేసులోకి వెళ్తుంది అని… అలాగే ప్రేమ ఎంత మధురం వంటి ఔట్ డేటెడ్ బోరింగ్ సీరియల్ ఎక్కడికో తోసేయబడుతుందనీ, చివరకు విఠలాచార్య సీరియల్ త్రినయని కూడా దెబ్బతింటుందని…!!
అదే జరిగింది… జగద్ధాత్రి సీరియల్ రేటింగ్స్‌లో టాప్‌లోకి వెళ్లిపోయింది ఈసారి… అఫ్‌కోర్స్, జీతెలుగు సీరియల్స్‌లో టాప్… మరోవైపు స్టార్ మా సీరియల్స్ అలాగే దుమ్మురేపుతూనే ఉన్నాయి… ఐతే జగద్ధాత్రిని కాస్త ఎందుకు బెటర్ అని చెప్పొచ్చు అంటే… ఓ అండర్ కవర్ పోలీస్ కాప్ తరహా పాత్ర కథానాయికది…
పోరాడుతుంది, ధైర్యంగా నిలబడుతుంది… ఫైట్లు చేస్తుంది… దుర్విధి అని రాజీపడి, కన్నీళ్లు పెట్టుకునే పాత్ర కాదు… మరీ రొటీన్, రొడ్డకొట్టుడు అత్తాకోడళ్ల తరహా కథ కాదు ఇది… దీప్తి మన్నె అనుకుంటా, ఈ రోల్ చేస్తున్న నటి పేరు… బాగా చేస్తోంది… (ప్రత్యకంగా చెప్పడం దేనికి..? కన్నడ కస్తూరే)… ఆమే ప్లస్ పాయింట్ సీరియల్‌కు… ఇదీ బెంగాలీ భాషలో ఇదే జీగ్రూపు నిర్మించిన ఓ సీరియల్‌కు రీమేక్ అనుకుంటా… మొదట్లో సాయంత్రం ఏడున్నరకు వచ్చేది, దాన్ని ఇప్పుడు రాత్రి 9 గంటల టైమ్‌కు మార్చారు…
Ads
ఇన్నాళ్లూ ఆ స్లాట్‌లో వచ్చే ప్రేమ ఎంత మధురం అనే జీడిపాకాన్ని మరింత లేటు స్లాటులోకి తోసేశారు… ఇక ఏదో నడిచినన్ని రోజులు నడిపించి, మూసేస్తారు… నిజానికి ఇన్నాళ్లూ త్రినయని సీరియల్ టాప్‌లో ఉండేది… ఇందులో కూడా హీరోయిన్ అశిక పడుకోన్ ప్రధాన బలం… కానీ మరీ మంత్రాలు, చింతకాయలు, మన్నూమశానం ఎక్కువయ్యేసరికి చివరకు మహిళా ప్రేక్షకులు కూడా చూడటం మానేస్తున్నారు… వెరసి టాప్ 30 నుంచి ఎగిరిపోయింది… మెల్లిమెల్లిగా ఈ కథ కూడా ఇక సమాప్తమే… ఇదీ బెంగాలీ సీరియల్ రీమేక్…
జగద్ధాత్రి ఓ పాఠం చెబుతోంది… పాతబడిన ఆ పాత చెత్తా ధోరణులను వదిలించుకుని, కాస్త వెబ్ సీరీస్ తరహా కంటెంటుకు ప్రాధాన్యం ఇస్తే జనం చూస్తారని, పాపులర్ చేస్తారని..! అంటే జగద్ధాత్రి సూపర్ ఉందని కాదు… భిన్నంగా ఉంది, జనం చూస్తున్నారు అని..! నిజానికి స్టార్ మా రీచ్ చాలా ఎక్కువ… అందుకని జీతెలుగు సీరియల్స్‌కన్నా ఎక్కువ రేటింగ్స్ పొందుతున్నాయి సహజంగానే… పైగా స్టార్ మా టీం రేటింగ్స్ విషయంలో ఏదైనా చేయగలదు…
జీతెలుగు కంటెంట్ టీం, క్రియేటివ్ టీం ఇంకాస్త క్రియేటివ్‌గా వెళ్లగలిగితే స్టార్ మా సీరియళ్లకు ఖచ్చితంగా మంచి పోటీ ఇవ్వగలరు… సరైన లీడ్ దొరకడం లేదేమో… అన్నట్టు, ఈటీవీలో వచ్చే శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఈసారి ఈటీవీ లిస్టులో టాపులో నిలిచింది… విశేషమే… సరే, మిగతావన్నీ నానాటికీ తీసికట్టు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా…
Share this Article