Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యమే ఆ పాత్రలో కాస్త అతి చేశాడు…

January 24, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ……… ఈ పక్కింటి అమ్మాయికి చాలా సుదీర్ఘమైన కధే ఉంది . అరుణ్ చౌదరి అనే బెంగాలీ రచయిత వ్రాసిన కధ పషేర్ బారి ఆధారంగా 1952 లో అదే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . సూపర్ హిట్టయింది .

సావిత్రి ఛటర్జీ ఒక్కసారిగా సూపర్ స్టార్ అయింది . ఆ సినిమా ఆధారంగా మన తెలుగులో 1953 లో పక్కింటి అమ్మాయి అనే టైటిలుతో రేలంగి , అంజలీదేవి , ఎ యం రాజాలతో ఒక సినిమా వచ్చింది . బాగా ఆడింది .

Ads

1960లో తమిళంలో అంజలీదేవే రీమేక్ చేసింది . తానే హీరోయినుగా నటించింది . టి ఆర్ రామచంద్రన్ , తంగవేలు ప్రభృతులు నటించారు . 1968 లో హిందీలో పడోసన్ టైటిలుతో సునీల్ దత్ , సైరాబాను , మెహమూదులతో మరో సినిమా వచ్చింది . ఇదీ హిట్టయింది .

సైరాబాను చాలా చాలా అందంగా నటిస్తుందీ సినిమాలో . 2004 లో కన్నడంలో పక్కడమనె హుడుగి అనే టైటిలుతో రంజిత , రాఘవేంద్రలతో ఇంకో సినిమా వచ్చింది . అక్కడా బాగానే ఆడింది .

jayasudha

ఈ తెలుగు పక్కింటి అమ్మాయి 1981 నవంబర్ ఏడవ తారీఖున రిలీజయి బాగానే ఆడింది . హీరో హీరోయిన్లుగా చంద్రమోహన్ , జయసుధ నటించారు . జయసుధకు సంగీతం మాస్టారుగా సంగీత దర్శకుడు చక్రవర్తి నటించారు . ఈ పాత్రను హిందీలో మెహమూద్ నటించారు .

హీరో తొట్టి గేంగులో ప్లేబేక్ పాడే మిత్రుడిగా బాలసుబ్రమణ్యం నటించారు . హిందీలో ఈ పాత్రను ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ వేసాడు . 1953లో వచ్చిన మన తెలుగు సినిమాలో ఈ పాత్రను ప్రముఖ గాయకుడు ఎ యం రాజా ధరించటం విశేషం .

సినిమా అంతా అల్లరల్లరిగా నడుస్తుంది . జయసుధకు మరో మంచి పాత్ర ఇది . హుషారుగా , చిలిపిగా బాగా నటించింది . చంద్రమోహన్ ఎడమ చేత్తో చేసేసాడు . ఈ రెండు పాత్రల తర్వాత ప్రధాన పాత్రలు చక్రవర్తి , బాలసుబ్రమణ్యాలవే . చక్రవర్తి జయసుధ వైపు , బాలసుబ్రమణ్యం చంద్రమోహన్ వైపు మోహరిస్తారు .

బాలసుబ్రమణ్యమే కాస్త ఓవర్ చేసాడేమో అని అనిపిస్తుంది . అక్కడక్కడా పద్మనాభాన్ని ఇమిటేట్ చేసాడు . పూర్తి నిడివిగా ఇదే ఆయన మొదటి సినిమా . దీనికి ముందు మహమ్మద్ బీన్ తుగ్లక్ సినిమాలో ఒక పాటలో కనిపించారు . ఇతర పాత్రల్లో ప్రభాకరరెడ్డి , హేమసుందర్ , ఝాన్సీ , తదితరులు నటించారు .

jayasudha
ఈ సినిమా బాగా ఆడటానికి ఉపకరించింది చక్రవర్తి సంగీత దర్శకత్వమే . పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి పాట ఐకానిక్ సాంగ్ . బాగా హిట్టయింది . ఆ తర్వాత చిలకా పలకవే ఆ కిటికీ తెరవవే , ఇది సంగీత సంగ్రామము పాటలు బాగా హిట్టయ్యాయి .

ఇందూ నా కళ్ళకు విందు అందూ నా చేతికి అందు పాట బాగుండటమే కాదు , చక్రవర్తి నృత్యిస్తాడు కూడా . రాగం రాగం ఇదేమి రాగం కూనిరాగం పాట జయసుధ మీద బాత్ రూం పాటగా చాలా బాగా చిత్రీకరించబడింది .

వేటూరి , ఆరుద్ర , గోపిలు పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చక్రవర్తి , సుశీలమ్మలు పాడారు . చాలా సరదాగా సాగే ఈ సినిమా యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . An entertaining , musical , feel good movie . జయసుధ అభిమానులను బాగా అలరిస్తుంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_కబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమృతాంటీ… మరీ అనసూయాంటీ ఆవహించిందా ఏమిటి..?!
  • డాక్టర్ సాబ్… 20 ఏళ్ల క్రితం నా ప్రాణాలు కాపాడారు గుర్తుందా..?
  • నవలా రాక్షసుడు + సినిమా రాక్షసుడు + నట రాక్షసుడు…!!
  • ఐఫోన్-17 సీరీస్… ఈ కొత్త మోడళ్ల అదిరిపోయే కీలక ఫీచర్స్ ఇవే…
  • ‘‘నీ పేరే పెట్టుకున్నాం, మా డ్రగ్ రాకెట్‌ను ఆశీర్వదించు మాతా…’’
  • లిటిల్ హార్ట్స్ సక్సెస్ సినిమా ఇండస్ట్రీకి చెబుతున్న పాఠమేమిటంటే..!
  • ఏమో, రమ్యకృష్ణే కావాలని ఆ బాహుబలి నిర్మాతే కోరుకున్నాడేమో…!
  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions