అది హౌజ్… పేరుకు బిగ్‌బాస్ హౌజ్… అదొక బిగ్ డ్రామా ప్లాట్‌ఫామ్… ఓ డిఫరెంటు రంగస్థలం… ఆడాలి, పాడాలి, టాస్కులు చేయాలి, నామినేషన్లలో గొడవలు పెట్టుకోవాలి ఎట్సెట్రా ఎన్నో ఉంటాయి… కానీ అన్నింటికీ మించి నటించాలి… అప్పుడే ఛీత్కరించాలి, అప్పుడే కౌగిలించుకోవాలి… సందర్భాన్ని బట్టి గ్రూపులు మారాలి, బిగ్‌బాసోడు చెబితే లవ్ ఎఫయిర్లు నడపాలి, నడిపినట్టు నటించాలి… అఫ్ కోర్స్ ఈసారి ఈ లవ్వు ట్రాకుల పైత్యం లేదు, అదొక రిలీఫ్…
హౌజులోకి వచ్చాక ప్రతి వారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని తెలుసు… బిగ్‌బాస్ టీం డిసైడ్ చేస్తుంది, నాగార్జున పాటిస్తాడు, ఎవరో ఒకరిని బయటికి తరిమేస్తారు… అది గేమ్… ప్రేక్షకులకు వినోదం కోసం ఉద్దేశించిన ఓ రియాలిటీ షో… కాకపోతే ఖరీదెక్కువ షో… వంద లేదా నూటాపది రోజులపాటు ఉండేది ఎవరో ఐదుగురు మాత్రమే, మిగతా వాళ్లంతా అంతకుముందు వెళ్లాల్సిన వాళ్లే కదా…
మరి దానికి ఏడుపులు దేనికి..? శోకాలు, పెడబొబ్బలు దేనికి..? ఈవారం బయటికి వెళ్లేవాడు సీక్రెట్ రూంలోకి వెళ్లొచ్చు, బయటికి వెళ్లిపోయి మళ్లీ ఎంట్రీ ఇవ్వొచ్చు, లేదా హౌజ్‌కు గుడ్ బై చెప్పొచ్చు… మరి ఎవడికో ఏదో అయిపోయినట్టు ఎందుకు ఏడవాలి..? ఎందుకంటే… అది నటన, నటించాలి కాబట్టి… సీజన్ గుర్తులేదు కానీ… రెజా అలీ ఎలిమినేట్ అవుతాడు, ఇక చూడాలి శ్రీముఖి, శివజ్యోతి శోకాలు… ఒకరిని మించి మరొకరి నటన… తీరా చూస్తే అలీ మళ్లీ హౌజులోకి రీఎంట్రీ… అంతా ఓ డ్రామా…
Ads
తాజా ఉదాహరణ… శోభాశెట్టి అండ్ ఆటసందీప్… ఒకే గ్రూపు సభ్యులు… ఇద్దరూ రూంలోకి వెళ్లాక, శోభకు తెలుసు కదా… తమలో ఎవరో ఒకరు బయటికి వెళ్లకతప్పదని… వరుసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు వెళ్లిపోయారు కాబట్టి ఎనిమిదోసారీ లేడీయే బయటికి వెళ్తుందేమోననీ, చివరకు మిగిలిన ఇద్దరిలో తనే లేడీ కంటెస్టెంట్ కాబట్టి తనే బయటికి వెళ్తానని అనుకున్నానని చెప్పుకొచ్చింది… సందీప్ ఎలిమినేషన్ అని వినగానే ఏదో షాక్ తిన్నట్టు నటించింది… ఏడిచింది… ఆమె తత్వానికి ఇది పూర్తి భిన్నమైన నటప్రదర్శన… తను సేవ్ అయితే వెళ్లబోయేది సందీపే కదా… అది తనకు తెలుసు కదా… మరి ఏదో హఠాత్తుగా సందీప్ వెళ్లిపోతున్నాడని తెలిసినట్టు ఆ ఓవరాక్షన్ దేనికి..? కాళ్లు పట్టుకుని బోరుమనడం దేనికి..?
ఇళ్ల నుంచి లెటర్స్ వస్తే గుక్కపెట్టి ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ చదవడం మరో నటన… ఇళ్లల్లో అందరికీ తెలుసు కదా… హౌజులోకి వస్తే ఫ్యామిలీని మిస్ అవుతామని… అన్నీ తెలిసే కదా హౌజుకు వచ్చింది… ఏదో ఏళ్ల తరబడీ దూరమైనట్టు ఆ ప్రహసనాలు దేనికి..? కట్టయిన దోస్తీ మళ్లీ సెట్టయినా… గెలిచినా, అభినందించాలన్నా హగ్గులు కంపల్సరీ అట… అదో దిక్కుమాలినతనం… రాబోయే రోజుల్లో హగ్గులతోపాటు కిస్సులు కూడా కామన్ అవుతాయేమో…
ఎవరెన్ని వారాలు ఉండాలో బిగ్‌బాస్ టీం డిసైడ్ చేస్తుంది… అంతేతప్ప ప్రేక్షకుల వోట్లు కాదు, అది నిజం… అందుకే ఎవరికెన్ని వోట్లు పడ్డాయో చెప్పరు… ఏ కంటెస్టెంట్ ఎన్ని వారాలుండాలో ముందే ఒప్పందాలు, వాటిని బట్టే రెమ్యునరేషన్లు ఉంటాయి… ఇవన్నీ తెలిసీ నామినేషన్లు, ఎలిమినేషన్ల డ్రామాలు, కంటెస్టెంట్ల వీర నటనలు సాగుతుంటాయి… అదే కదా మరి స్కెచ్ అంటే, స్క్రిప్ట్ అంటే…
శివాజీ మీద నాగార్జునకు లవ్వు… ముందుగానే ఎక్కువ వారాలు ఉండేలా ఒప్పందం… ఇంకేముంది.,.? చేయి సహకరించకపోయినా, సతాయించినా బయటికి తీసుకుపోయి చికిత్స చేసి తీసుకొస్తారు, హౌజులోనే ఫిజియోథెరపీ చేయిస్తారు, ఆడాల్సిన పనిలేకుండా అన్ని గేమ్స్‌కు, పోటీలకు తననే సంచాలకుడిని చేస్తారు… మళ్లీ ఇదొక వికారం… శివాజీ గ్రూపును సపోర్ట్ చేస్తూ బయట కొన్ని పెద్ద సైట్లు కూడా పనికట్టుకుని మరీ శివాజీకి పడని కంటెస్టెంట్ల మీద విషప్రచారం జరుగుతూ ఉంటుంది…
శోభాశెట్టి మీద విపరీతమైన నెగెటివిటీని వ్యాప్తి చేయడం ఇందులో భాగమే… ఒప్పందాలున్నాయ్ కాబట్టే యావర్ ఎన్ని అరుపులకు దిగినా, భోలే ఏమీ ఆడకపోయినా అలా కొనసాగుతూ ఉంటారు… సో, ఇదొక రియాలిటీ షో… అదొక స్క్రిప్ట్… దాన్ని బట్టి ఆడేపాడే నటించే కేరక్టర్లు హౌజులో తమ పాత్రల్ని పోషిస్తుంటారు… అదీ అసలు కథ… అన్నీ తెలిసి విశ్లేషణలు దేనికి అంటారా..? సినిమాల రివ్యూల్లాగే… అంతే…
Share this Article