.
కేజ్రీవాల్ ఎప్పటికప్పుడు తాను అత్యంత తెలివిమంతుడిని అనుకుంటూ ఉంటాడు… చేసే స్కాంలు చేస్తూనే… అనైతిక వర్తన ఆపకుండానే… ఉల్టా ఎదుటివాళ్లను ఆడిపోసుకుంటూ ఉంటాడు… ఇప్పుడైతే ఏకంగా న్యాయమూర్తుల్ని కూడా డిఫెన్సులో పడేసే, డిమోరల్ చేసే ఎత్తుగడలకు వెళ్తున్నాడు… ‘‘నువ్వు ఆర్ఎస్ఎస్, నువ్వు నా కేసులో నిష్పక్షపాతంగా తీర్పు చెప్పగలవా’’ అని మొన్న ఓ లేడీ జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఎదుట తనే సొంత వాదనలు వినిపించాడు తెలుసు కదా…
ఆమె ఏం రిప్లయ్ ఇస్తారు, ఏ స్టాండ్ తీసుకుంటారు అని సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో… భేషుగ్గా స్పందించారు… “కేజ్రీవాల్ భ్రమల్లో ఉన్నారు.. న్యాయం రాజకీయ ఒత్తిళ్లకు లొంగదు”… ఇదీ జస్టిస్ స్వర్ణకాంత శర్మ సమాధానం… ఎస్, విచారణ నుంచి తప్పుకుంటే కేజ్రీవాల్ అభియోగాల్ని అంగీకరించినట్టు అవుతుంది… లిటిగెట్లకు న్యాయమూర్తుల్ని ఎంచుకునే అవకాశం లేదు, న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను చాటడానికి నేను ఈ కేసు విచారణ కొనసాగిస్తాను’’
Ads
ఇలా… తన మద్యం కేసును విచారిస్తున్న బెంచ్ నుండి న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలంటూ (Recusal) కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తీవ్రంగా తోసిపుచ్చింది… కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఆమె తన ఉత్తర్వుల్లో కీలక పదాలను ఉపయోగించారు…
-
భ్రమలు (Illusions)…: “కేజ్రీవాల్ కేవలం భ్రమల్లో ఉండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు… కేవలం ఒక న్యాయ సదస్సులో పాల్గొన్నంత మాత్రాన న్యాయమూర్తికి పక్షపాతం ఉంటుందనుకోవడం పొరపాటు… రిక్యూజల్ (కేసు నుండి తప్పుకోవడం) కోరడానికి ఆయన దగ్గర ఎలాంటి బలమైన ఆధారాలు లేవు” అని ఆమె స్పష్టం చేశారు…
- అధివక్త పరిషత్ కార్యక్రమాలపై… కేజ్రీవాల్ వ్యక్తం చేసిన ఆందోళనల గురించి ప్రస్తావిస్తూ , అవి రాజకీయ స్వభావం కలవి కావని న్యాయమూర్తి స్పష్టం చేశారు… అవి కొత్త క్రిమినల్ చట్టాలపై కార్యక్రమాలు, మహిళా దినోత్సవ కార్యక్రమాలు లేదా బార్‌లోని యువ సభ్యులతో సంభాషించేందుకు ఉద్దేశించినవి. చాలా మంది న్యాయమూర్తులు ఆ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు… అటువంటి భాగస్వామ్యాన్ని సైద్ధాంతిక పక్షపాతాన్ని సూచించడానికి ఉపయోగించరాదు…” అని ఆమె అన్నారు…
-
క్యాచ్-22 (Catch-22) పరిస్థితి…: ఈ పరిస్థితిని ఆమె ఒక విచిత్రమైన చిక్కుముడి (క్యాచ్-22)గా అభివర్ణించారు… “నేను ఈ కేసు నుండి తప్పుకుంటే, కోర్టు ఒత్తిళ్లకు లొంగిందని అంటారు… తప్పుకోకపోతే పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని నిందిస్తారు… ఇది న్యాయమూర్తులకు ఒక అగ్నిపరీక్ష లాంటిది” అని పేర్కొన్నారు…
-
విన్-విన్ పరిస్థితి…: కేజ్రీవాల్ వ్యూహాన్ని విశ్లేషిస్తూ… “నిందితుడు తన అనుకూలత కోసం కోర్టులను ఈ విధంగా ప్రభావితం చేయాలని చూడటం సరికాదు… ఉపశమనం లభిస్తే కోర్టు గొప్పదని, లభించకపోతే కోర్టుపై ఒత్తిడి ఉందని కథనాలు అల్లడం ఒక విన్-విన్ స్ట్రాటజీలా కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు…
రాజకీయ ఒత్తిడికి న్యాయం లొంగదు
న్యాయమూర్తులు కేవలం రాజ్యాంగానికి మాత్రమే లోబడి పనిచేస్తారని జస్టిస్ శర్మ పునరుద్ఘాటించారు… “రాజకీయ ఒత్తిళ్లు లేదా బయటి వ్యక్తుల విమర్శల ఆధారంగా న్యాయమూర్తులను మార్చాలని చూడటం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీయడమే… ఒక న్యాయమూర్తి ఏదైనా సెమినార్‌కు హాజరైతే అది వివక్షకు ఆధారం కాబోదు… ఇలాంటి ప్రయత్నాలు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకాన్ని సృష్టిస్తాయి” అని ఆమె హెచ్చరించారు…
ఈ తీర్పుతో మద్యం పాలసీ కేసులో సిబిఐ దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణను కొనసాగించనున్నారు… ఇది కేజ్రీవాల్‌కు నైతికంగా మరియు చట్టపరంగా పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు…
Share this Article