Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…

April 22, 2026 by M S R

.

కాళేశ్వరం – పి.సి. ఘోష్ కమిషన్‌పై హైకోర్టు తీర్పు సారాంశం…. (Subject to Corrections)…. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు తుది తీర్పు వెల్లడించింది… అందరూ కాళేశ్వరంపై కేసీయార్‌కు క్లీన్ చిట్, కడిగిన ముత్యంలా బయటపడ్డాడు అని చెబుతున్నారు కదా… అసలు హైకోర్టు ఏం చెప్పింది..? ఓసారి చూద్దాం… ముందే చెప్పినట్టు… సబ్జెక్ట్ టు కరెక్షన్స్…


ముఖ్య అంశాలు…:  కమిషన్ ఏర్పాటు సబబే….: పి.సి. ఘోష్ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసింది…. ఇందులో ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘన లేదని పేర్కొంది……

Ads

  • ప్రతికూల అంశాలు చెల్లవు: పిటిషనర్లకు (కేసీఆర్ మరియు ఇతర ముగ్గురికి) వ్యతిరేకంగా కమిషన్ తన నివేదికలో పేర్కొన్న ప్రతికూల అంశాలు (Prejudicial findings) ఏవీ చెల్లవని కోర్టు తీర్పునిచ్చింది…

  • సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన…: కమిషన్ విచారణ ప్రక్రియలో సెక్షన్ 8B (Commissions of Inquiry Act, 1952) నిబంధనలను పాటించలేదని కోర్టు అభిప్రాయపడింది…. అంటే, ఎవరికైనా వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే ముందు వారికి సరైన నోటీసు ఇచ్చి, వారి వాదన వినే అవకాశం కల్పించకపోవడం చట్ట విరుద్ధమని తెలిపింది…

  • చర్యలు తీసుకోవడానికి వీలులేదు…: ఈ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావు, స్మితా సబర్వాల్, ఎస్.కె. జోషిలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది….

medigadda


“ప్రతికూల అంశాలు (Prejudicial Findings)” అంటే ఏమిటి? కోర్టు ఉపయోగించిన ఈ పదానికి అర్థం పిటిషనర్ల గౌరవానికి లేదా ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలు అని… ఉదాహరణకు…:

  • వారు అవినీతికి పాల్పడ్డారని నివేదికలో పేర్కొనడం…

  • ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టానికి వారే బాధ్యులని చెప్పడం…

  • వారి వ్యక్తిత్వాన్ని లేదా పనితీరును తప్పుబడుతూ చేసిన వ్యాఖ్యలు….

క్లుప్తంగా చెప్పాలంటే…: ఈ తీర్పు కేసీఆర్, ఇతర పిటిషనర్లకు పెద్ద ఊరట... కమిషన్ కొనసాగినప్పటికీ, వారిని తప్పుబడుతూ నివేదికలో రాసిన అంశాలను చట్టపరంగా పరిగణనలోకి తీసుకోకూడదని హైకోర్టు స్పష్టం చేసింది…. అంటే, వారిపై బురద జల్లే లేదా వారిని నిందితులుగా చూపే ఏ వ్యాఖ్య కూడా ఇప్పుడు చెల్లుబాటు కాదు….

హైకోర్టు దృష్టిలో కమిషన్ చేసిన పొరపాట్లు… 1. సాక్షిగా విచారించడం vs నిందితుడిగా చూడటం… కమిషన్ కేసీఆర్, ఇతరులను కేవలం “సాక్షులు”గా పిలిచి సమాచారం సేకరించింది… కానీ, నివేదిక ఇచ్చేటప్పుడు మాత్రం వారిని “బాధ్యులు”గా లేదా “తప్పు చేసిన వారు”గా చిత్రీకరించింది… చట్టం ప్రకారం (Section 8B), ఒక వ్యక్తి గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉన్నప్పుడు, అతనికి ముందే ఆ విషయం చెప్పి డిఫెన్స్ చేసుకునే అవకాశం ఇవ్వాలి… ఇక్కడ అది జరగలేదని కోర్టు భావించింది…

2. సెక్షన్ 8B మరియు 8C ఉల్లంఘన…. సెక్షన్ 8B…: ఎవరి మీదైనా ప్రతికూల వ్యాఖ్యలు చేయాలనుకున్నప్పుడు వారికి ప్రత్యేకంగా నోటీసు ఇవ్వాలి…. సెక్షన్ 8C…: తమపై ఆరోపణలు వచ్చినప్పుడు, ఇతర సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ (తిరిగి ప్రశ్నించే) అవకాశం పిటిషనర్లకు ఇవ్వాలి…. ఈ కేసులో కమిషన్ దాదాపు 119 మంది సాక్షులను విచారించింది… కానీ, ఆ సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం కేసీఆర్ టీమ్‌కు ఇవ్వలేదు… ఇది “సహజ న్యాయ సూత్రాల” (Principles of Natural Justice) ఉల్లంఘన కిందకు వస్తుంది…

3. సాక్ష్యాలు వెల్లడించకపోవడం …. నివేదికలో తమకు వ్యతిరేకంగా వాడిన పత్రాలను లేదా ఆధారాలను పిటిషనర్లకు ముందుగా చూపించలేదు…. తమపై ఉన్న ఆరోపణలు ఏమిటో పూర్తిస్థాయిలో తెలియకుండా వారు ఇచ్చే వివరణ (Version) పరిపూర్ణమైనది కాదని కోర్టు అభిప్రాయపడింది…

అందుకే కమిషన్ ఏర్పాటును సమర్థించిన హైకోర్టు, వ్యక్తులపై ఉన్న ఆరోపణలను మాత్రం “Inoperative” (అమలులో లేనివి) అని ప్రకటించింది… దీనివల్ల కమిషన్ నివేదికలోని వ్యవస్థాగత లోపాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు కానీ, ఈ నలుగురిపై మాత్రం ఆ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలుండదు… ఏతావాతా ఇది నిందితులు నిర్దోషులని చెప్పడం కాదు… కమిషన్ విహిత నిబంధనల్ని పాటించలేదు అని చెప్పడం… 




kaleswaram

what next… ఇక్కడ రెండు అంశాలు… ఘోష్ కమిషన్ టరమ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఎలా ఉన్నా… ప్రాజెక్టు అవినీతిపై అధికారులు, ఇంజనీర్లపై ఏసీబీ కేసు నడుస్తోంది… కాకపోతే తనకు అలవాటైన అంతులేని స్తబ్దత, నిర్లిప్తతతో అదేమీ ఈ కేసును కంక్లూజన్‌కు తీసుకురాగలదని ఎవరూ అనుకోవడం లేదు…

సీబీఐ… అది కదలదు, ఎందుకంటే బీజేపీకి, బీఆర్‌ఎస్‌కు రహస్య దోస్తీ… అదెలాగూ పంజరంలో చిలుక కదా… సోకాల్డ్ నానా నీతులూ పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ దగ్గర సమాధానం లేదు, సమర్థన లేదు… దర్యాప్తు కోరిన ఆరు నెలలకు సీబీఐ స్పందించింది, రాష్ట్ర పోలీసులు ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అనడిగిందట… లేదు, మీరే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని రాష్ట్రం చెప్పిందట… అర్థమవుతోంది కదా…

పాపం శమించుగాక… కాళేశ్వరం కథ కంచికి… మనం ఇంటికి…

కాళేశ్వరం

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చిట్టిబాబు లీక్స్..! తనకూ ఓ పేజీ ఉంది టాలీవుడ్ చరిత్ర పుస్తకంలో..!!
  • కాళేశ్వరం తీర్పు… క్లీన్ చిట్ కాదు… కమిషన్ రూల్స్ పాటించలేదు అని…
  • Inter Caste Marriages… ‘కులాన్ని’ దాటేస్తున్న కొత్త తరం…
  • పొద్దున్నే పుట్టింది చందమామ… మొగ్గల్లే విచ్చింది ముద్దుగుమ్మ…
  • వీడు ఓ ఎంపీ… మహిళా నేతలపై రోత వ్యాఖ్యలు… కిక్కుమనని విపక్షం…
  • ‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…
  • సిక్సర్ల అభిషేకుడిని పడేసిన లైలా..! పాత ట్రాజెడీ మరిచి కొత్త బంధం…!
  • పూసల పిల్ల మోనాలిసా కేసులో మరో ట్విస్టు… పోలీసులతో గేమ్స్…
  • ఏమైంది ఈ గ్రూపుకి..? రతన్ టాటా గనుక బతికి ఉంటే ఏమైపోయేవాడో…!
  • నిన్ను అమ్మమ్మా అనడమేంటి..? ఓ కేరక్టర్ సోయి లేని వ్యాఖ్యలు…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions