అందరూ కామారెడ్డిలో గెలిచిన బీజేపీ అభ్యర్థి వెంకట రమణారెడ్డిని జెయింట్ కిల్లర్ అంటున్నారు… కరెక్ట్… తను ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులను ఓడించాడు… వాళ్ల డబ్బు, బలం, బలగం, సాధన సంపత్తిని తట్టుకుని నిలిచి, దాదాపు 5 వేల మెజారిటీతో బయటపడ్డాడు… కేసీయార్ సెకండ్ ప్లేస్… రేవంత్ మరీ థర్డ్ ప్లేస్… దేశం మొత్తం దృష్టీ దీనిపైనే ఉంది… ఇప్పుడు ఈ రమణారెడ్డి పేరు మారుమోగుతోంది…
నిజానికి తనను బెంగాల్‌లో మమతా బెనర్జీని ఓడించిన మాజీ టీఎంసీ లీడర్, మాజీ మమత ఫాలోయర్, బీజేపీ కేండిడేట్, ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారితో పోలిస్తున్నారు ఈ రమణారెడ్డిని… కానీ అది కరెక్టు కాదు… సువేందు కథ వేరు… ఆయన మమతతో ఉండీ ఉండీ, తరువాత విడిపోయి, బీజేపీలో చేరి, నిలబడి ఆమెను ఓడించాడు… కానీ రమణారెడ్డి అలా కాదు… మొదటి నుంచీ బీజేపీయే…
ఒకవైపు బీజేపీ పెద్ద తలకాయలు, బీజేపీకి ఏమాత్రం ఛాన్స్ దొరికినా సరే మేమే ముఖ్యమంత్రులం అని క్లెయిమ్ చేసుకునే వాళ్లు ఓడిపోగా… రమణారెడ్డి మాత్రం సైలెంట్‌గా జెండా ఎగరేశాడు… తను ఎంత డౌన్ టు ఎర్తో తెలియడానికి ఓ ఉదాహరణ చెబుతాను… వోటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లాడు, లైన్‌లో నిలబడ్డాడు… ఇలా…
Ads
ఓ ముసలాయన కూడా వచ్చాడు వోటేయడానికి… వాళ్లకూ వీళ్లకూ చెబుతున్నాడు… కేసీయార్‌కు మాత్రం వోటేయకండి, పువ్వు గుర్తుకు వేయండి అని చెబుతున్నాడు… ఆయనకు ఈ వెంకట రమణారెడ్డి మొహం తెలియదు, తన దగ్గరకు వెళ్లి ఇదే చెప్పాడు… ‘‘ఏం, ఎందుకు వేయకూడదు కేసీయార్‌కు..?’’ అనడిగాడు రమణారెడ్డి…
‘‘అయ్యో, మీకు అర్థం కావడం లేదా..? భూములు గుంజుకుంటాడట… మా మనమడు చెప్పిండు… ఊరంతా అనుకుంటున్నరు… వద్దు, వద్దు, ఆ పువ్వు గుర్తు రమణారెడ్డే ఆ భూములు పోకుండా కొట్లాడుతున్నడు… మరి గెలిపించాలి’’ అన్నాడు… ఈలోపు ఎవరో వచ్చి, ఆ రమణారెడ్డి ఎవరో కాదు, నీ ఎదుట నిలబడ్డాయనే అని నవ్వుతూ పరిచయం చేశాడు… ముసలాయన షాక్… రమణారెడ్డి రాక్…
నిజంగానే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ మీద కొట్లాడింది తనే… ఊరూరికీ ఏదో వర్క్ సాయం చేసి, దాదాపు పదీపదిహేను కోట్ల దాకా అప్పటికే ఖర్చు చేసి ఉన్నాడు… తన సొంత మేనిఫెస్టో రిలీజ్ చేశాడు… కేసీయార్, రేవంత్ వచ్చిపోతారు, నేనిక్కడే ఉంటా, మంచికీ చెడుకూ మనం మనం ఒకటి అని ప్రచారం చేసుకున్నాడు… తనకున్న మంచి పేరు ముందు ఆ ఇద్దరు సీఎం అభ్యర్థులు కొట్టుకుపోయారు… ప్రజల్లో ఉంటే, ప్రజలతో ఉంటే, ప్రజల కోసం ఉంటే ఇదుగో ఇలాంటి ఘనవిజయం సొంతమవుతుంది… జనం ఓన్ చేసుకుంటారు… రమణారెడ్డే నిదర్శనం…
ఆమధ్య ‘ముచ్చట’ ఈయన గురించి రెండు మూడు కథనాలు ప్రచురించింది… ఆసక్తి ఉన్నవారు చదవడం కోసం… ఆ లింకులు ఇవిగో…
లోకల్ వర్సెస్ నాన్-లోకల్… కామారెడ్డి స్థానంపై భిన్న సమీకరణాల చర్చ…
నచ్చావు రెడ్డి సాబ్… నీలాంటోళ్లే రాజకీయాల్లో అవసరం… కీపిటప్…
Share this Article