.
ఇప్పుడు ఏ ప్రధాన రాజకీయ పార్టీ అడుగుల్ని చూసినా సరే, ఎవరో ఓ వ్యూహకర్త లేదా స్ట్రాటజీ టీమ్ ఆలోచనలు, వ్యూహాలు, ఎత్తుగడలు చర్చనీయాంశం అవుతున్నాయి… పార్టీల దాకా దేనికి..? చిన్నాచితకా జెడ్పీటీసీలకు కూడా ప్రత్యేకంగా సోషల్ మీడియా వింగ్స్ ఉంటున్నాయి…
ఈ టీమ్స్ అనుసరించే ప్రచారం, ప్రణాళికలు నిజంగా పనిచేస్తాయా అనేది పెద్ద డిబేట్… ప్రశాంత్ కిషోర్ కోట్లకుకోట్లు సంపాదించాడు ఈ దందాలో… తన టీమ్‌లో పనిచేసిన వారు ప్రత్యేకంగా సొంత దుకాణాలు పెట్టుకున్నారు… ఇప్పుడు ఇదంతా దేనికీ అంటే..?
Ads
జగన్ మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు ఓ కొత్త వ్యూహకర్త పనిచేస్తున్నాడనే ప్రచారం..! నిజానికి జగన్ తెర వెనుక ఉన్నవారిని కూడా తెరపైకి తీసుకొచ్చి పరిచయం చేస్తాడు… కానీ ఈ కొత్త వ్యూహకర్త గురించి ఎందుకోగానీ ఇంకా వెల్లడించడం లేదు… ఆ వ్యూహకర్త పేరు కపిల్ సాహూ…
ఈయన గతంలో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ మెంబరే… తరువాత బయటికి వచ్చి సొంతంగా ఓ టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు… చిన్నాచితకా పార్టీలకు పనిచేశాడు కానీ టీవీకే విజయ్ పార్టీకి పనిచేసిన అనుభవం, ఆ పార్టీ విజయం మాత్రం తనను అమాంతం పాపులర్ చేసేసింది…
పార్టీలు, నాయకుల విజయాల వెనుక అనేక కారణాలుంటాయి, కానీ ఫస్ట్ క్రెడిట్ కొట్టేసేది మాత్రం ఇదుగో ఇలాంటి వ్యూహకర్తలే… జగన్‌కు మొదట్లో ప్రశాంత్ కిషోర్ (ఐ-ప్యాక్) పనిచేసింది… తరువాత తను తప్పుకున్నాడు… (కేసీయార్, చంద్రబాబు అంటూ ఇటూఅటూ సందేహాస్పద ధోరణిలో తచ్చాడాడు ప్రశాంత్ కిషోర్)…
తరువాత జగన్ టీమ్‌లో రుషిరాజ్ సింగ్ చేరాడు… ఈయన కూడా గతంలో ఐప్యాక్ మెంబరే, బహుశా వ్యవస్థాపక సభ్యుడు కావచ్చు… కానీ జగన్‌ను దారుణంగా మిస్‌లీడ్ చేశాడనే ప్రచారం జరిగింది… జగన్ మరీ ఘోరంగా 11 స్థానాలకు పడిపోయాడు… ఇక రుషిరాజ్ సింగ్ నీకో నమస్కారం బాబూ అనేసి ఆళ్ల మోహన్ సాయి దత్‌ను తన టీమ్‌లోకి తీసుకున్నాడు జగన్…
పెద్ద ఫాయిదా ఏమీ లేదనుకున్నాడో ఏమో గానీ జగన్ టీవీకే సక్సెస్ చూసి కపిల్ సాహూ కోసం ట్రై చేశాడు… విజయ్ పార్టీ విజయంలో- రాజకీయ కార్యాచరణలో కొంతమేరకు జగన్ సోదరుడు వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది… విజయ్, అనిల్ మంచి దోస్తులు… సో, అనిల్ ద్వారా కపిల్ సాహూను తన టీమ్‌లోకి రప్పించుకున్నాడు జగన్…
ఆల్రెడీ ఈ టీమ్ చెన్నై, బెంగుళూరు కేంద్రాలుగా వర్క్ స్టార్ట్ చేసింది… త్వరలోనే విజయవాడలో ఆఫీస్ స్టార్ట్ చేస్తారట కూడా… జగన్ కూడా 11 సీట్ల ఫలితానికి దిమ్మెరబోయి, రాజకీయాలపైనే వైరాగ్యం తలెత్తి, కొన్నాళ్లు స్తబ్దంగా ఉండిపోయి, ఈమధ్యే బాగా యాక్టివ్ అయిపోయాడు… మళ్లీ జనం పోటెత్తుతున్నారు…
సరే, తనలో ధీమా పెరిగింది… ఏపీ జనానికి వేరే దిక్కులేదు, ప్రభుత్వ వ్యతిరేకతతో తనే మళ్లీ గద్దె ఎక్కుతాననే నమ్మకం చిక్కింది… నిజంగానే ఏపీలో ఆల్టర్నేట్ ఎవరూ లేరు కదా… ఇక్కడ జగన్ కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి…
- పార్టీ పునర్నిర్మాణం శాస్త్రీయంగా జరగాలి. 2. నిజమైన వర్కర్ల గుర్తింపు, ప్రోత్సాహం దొరకాలి. 3. పాత పాలన తప్పుల సమీక్ష, పార్టీ విధానాల దిద్దుబాటు. 4. నేరస్థుల పరామర్శల కోసం జనంలోకి వెళ్తే పార్టీకి ప్రతికూలమనే సోయి. 5. పూర్తిగా వ్యూహకర్తలు విజయాల్ని అందించలేరనే నిజం. 6. బాబు కూటమిని అండర్ ఎస్టిమేట్ చేయకపోవడం … ఇలా…
జనం తన మీటింగులకు, పర్యటనలకు పోటెత్తుతున్నారనే అంశం రాబోయే విజయసంకేతం ఏమీ కాదు… జగన్ ఎప్పుడు జనంలోకి వెళ్లినా జనం విరగబడతారు… ఆ జోష్ పోలింగ్ బూతుల్లోకి చేరితేనే విజయం… కపిల్ సాహూ అరచేతిలో ఏమీ మంత్రదండం లేదు… పూర్తిగా నమ్మితే మరో రుషిరాజ్ సింగ్ అవుతాడేమో కూడా..!!
Share this Article