Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

RTC సమ్మె..! KCR అమానుషానికీ నేటి మానవీయతకూ ఎంత తేడా..?!

April 25, 2026 by M S R

.

రేవంత్ రెడ్డికీ కేసీయార్‌కూ తేడా ఏమిటీ అని అడిగాడు ఓ జర్నలిస్టు మిత్రుడు… ఇద్దరూ రాజకీయ నాయకులే… ఒకరివి దొరపోకడలు, గడీతనం… నియంత… మరొకరిది హ్యూమన్ యాంగిల్… వివరంగా చెప్పు అన్నాడు… సరే, కొన్ని వివరాలు చెప్పుకుందాం… ఆర్టీసీ సమ్మెనే ఓ ఉదాహరణగా చెప్పుకుందాం… బీఆర్ఎస్‌కూ కాంగ్రెస్‌కూ నడుమ తేడా ఇదే… (రాత్రి సమ్మె విరమణ జరిగిపోయింది- 2, 3 రోజుల్లో ఇష్యూ క్లోజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం…)

.

Ads

2019లో జరిగిన ఆర్టీసీ సమ్మె తెలంగాణ రాజకీయ, సామాజిక చరిత్రలో ఒక అత్యంత క్లిష్టమైన ఘట్టం… అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమ్మె పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించాడు… బహుశా ప్రజాజీవితంలో ఉన్న ఏ ముఖ్యమంత్రీ అలా వ్యవహరించలేదేమో గతంలో…

సమ్మె మొదలైన రెండో రోజే, గడువులోగా విధుల్లో చేరని సుమారు 48 వేల మంది కార్మికులను “సెల్ఫ్ డిస్మిస్” (తమకు తామే డిస్మిస్ అయ్యారు) అంటూ ప్రకటించడం పెను సంచలనం సృష్టించింది… కార్మికులతో చర్చల ప్రసక్తే లేదని, యూనియన్లను అసలు గుర్తించేదే లేదని ఆయన భీష్మించుకోవడం ప్రభుత్వ ఉక్కుపాదాన్ని సూచించింది… ఆ సమయంలో ఆయన వాడిన భాష, తీసుకున్న నిర్ణయాలు కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదనను, అభద్రతా భావాన్ని నింపాయి… మొత్తం ప్రైవేటీకరించేస్తాను, మీ దిక్కున్నచోట చెప్పుకొండి అన్నాడు… తెలంగాణ స్వరాష్ట్ర సాధన, స్వీయపాలన అంశాలను కేసీయార్ అపహాస్యం చేసిన సందర్భం.,.

సమ్మె కొనసాగిన 52 రోజుల కాలంలో కార్మికుల ఆత్మహత్యలు, గుండెపోటు మరణాలు రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపాయి… పండుగ పూట వేలాది కుటుంబాలు జీతాలు లేక, ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో తెలియక చీకట్లో గడిపాయి… కోర్టులు జోక్యం చేసుకున్నా, ప్రతిపక్షాలు ఆందోళనలు చేసినా కేసీఆర్ తన మొండి వైఖరిని వీడలేదు….

చివరకు కార్మికులు బేషరతుగా విధుల్లో చేరుతామని ప్రకటించినా, వారిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం కొంతకాలం నిరాకరించడం ఆయన ఎంత కఠినంగా వ్యవహరించాడో… ఎంత అమానవీయంగా వ్యవహరించాడో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ… ఈ సమ్మె కేసీఆర్ పాలనలో కార్మిక సంఘాల పట్ల ఆయనకున్న కఠిన వైఖరికి ఒక నిలువుటద్దంగా నిలిచిపోయింది…

సీన్ కట్ చేస్తే… అదే నియంత పార్టీ ఆర్టీసీ కార్మికుల పట్ల ఓ కృత్రిమ ప్రేమ కురిపించింది నిన్నా మొన్నా… ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యను రాజకీయం చేసి, పేలాలు ఏరుకునే క్షుద్ర రాజకీయం ప్రదర్శించింది… కార్మికులను ఎగదోసే ప్రయత్నాలు చేసింది… (ఇక్కడ కేసీయార్ బిడ్డ, కొత్త పార్టీ పెట్టబోతున్న కవిత ధోరణి కూడా తీవ్ర ఆక్షేపణీయం)… కేసీయార్ గతంలో వ్యవహరించిన అమానుష వైఖరిని తెలంగాణ జనం మరిచిపోలేదు… మరిచిపోరు…

మరి ఇప్పుడు..? కేసీయార్ కాలం నుంచి పోగుపడుతున్న బకాయిలు ఇతరత్రా అంశాల్ని ప్రభుత్వం (మంత్రులు, ఉన్నతాధికారులు) ఆర్టీసీ జేఏసీకి వివరించింది… సానుకూలంగా, సానుభూతిగా ఉంటామని హామీ ఇచ్చింది… కొన్ని కీలక డిమాండ్లను అప్పటికప్పుడు నెరవేర్చింది… పీఆర్షీ, ఉద్యోగసంఘాల ఎన్నికలు, ప్రభుత్వంలో విలీనం ఎట్సెట్రా… ఫలితం… సమ్మె మూడో రోజే విరమణ… అర్థమైంది కదా…

మొత్తం ఆర్టీసీనే బొందపెట్టాలని చూసింది ఒకరు… మీకు నేను భరోసా అంటూ మానవీయ ధోరణితో సమస్య పరిష్కరించింది మరొకరు… ఇదే తేడా… (ఆర్టీసీ ఆస్తుల్ని అప్పనంగా కొట్టేసిన బీఆర్ఎస్ నేతల నిర్వాకాల్ని తవ్వి తీసేలా ఏసీబీ గనుక ఓ కేసు పెడితే అది ఓ పెద్ద స్కాంను వెలికితీస్తుంది… పింక్ అక్రమార్కులందరూ ఇప్పుడు నీతులు చెబుతున్నారు… పాపం, అందరినీ క్షమించేసే ‘హిమాలయ సన్యాస- వైరాగ్య యోగం’ ధోరణిలో ఉన్న రేవంత్ రెడ్డి వీళ్లను ఏమీ చేయలేడు, చేయడు, అది వేరే కథ…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • RTC సమ్మె..! KCR అమానుషానికీ నేటి మానవీయతకూ ఎంత తేడా..?!
  • ఇప్పుడు ఈ బూతుల ‘షో అంత అవసరమా మిస్టర్ నాగబాబూ..?!
  • …. ఐనా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు… అతనే ‘కింగ్ కోహ్లీ’…
  • వోటుకునోటు కేసు… మరో మహారాష్ట్ర కేసుతో లంకె… న్యాయ సంక్లిష్టత…
  • నోటికొచ్చింది పేలితే ఇకపై కుదరదు… పవన్ ఖేరా కేసే ఉదాహరణ…
  • ఏపీ పాలిటిక్స్..! చివరకు ‘హానీ ట్రాప్’ చీకట్లు… బ్లాక్ మెయిల్ దందాలు…!!
  • 24 లక్షల ప్రాణాలు కాపాడాడు… అక్షరాలా ఈయన ఓ అద్భుతం…
  • ముఖ్యమంత్రి కావడం సులభం సుమీ… నమ్మకపోతే ‘సూర్య IPS’ చూడుడు…
  • Ola, Uber, Rapido… ‘చక్కదిద్దడం’ ఈ సర్కారుకు చేతకాదా..?
  • సత్తెన్నా… గిసంటోళ్ల కోసమా నువ్వు జీవితాన్ని ధారబోసింది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions