నిజానికి నాయకుల వ్యక్తిగత అనారోగ్యం, జబ్బులు, వాటి చికిత్సలకు సంబంధించిన విమర్శలు నీచస్థాయి… ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడి ఆరోగ్యం కోసం ఆ రాష్ట్ర ఖజానా నుంచి నాలుగు రూపాయలు ఖర్చు చేస్తే దాన్ని ఖండించి, తమ రాజకీయ విధానాలతో కలగలిపి, ఏవేవో మాట్లాడేసి, రచ్చ చేయడం థర్డ్ రేట్ ధోరణి… కానీ సోషల్ మీడియాకు ఆ సంస్కారాలు ఏమీ పట్టవు… తిట్టిపోయడమే… కడుక్కోవడం నీ వంతు… అంతే… అయితే అసలు విషయం ఏమిటంటే..?
కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, ఆయన భార్య కమల, పర్సనల్ అసిస్టెంట్ వీఎం సునీష్ అమెరికాకు వెళ్లిపోయారు… రోచెస్టర్‌లోని మయో క్లినిక్కులో చికిత్స పొందుతాడు… ఈ నెలాఖరు వరకూ అక్కడే… విషయాన్ని గవర్నర్‌కు కూడా తెలిపారు… పక్కా ప్రొసీజర్ ప్రకారమే… ఎక్కడా పద్ధతి తప్పి పరుగులు తీయలేదు… అయితే ఈసారే కొత్త కాదు కూడా… 2018 సెప్టెంబరులో కూడా ఆయన అదే హాస్పిటల్‌కు వెళ్లాడు… నిజానికి తన జబ్బు ఏమిటో, దేనికోసం చికిత్స తీసుకుంటున్నాడో… అది కాన్ఫిడెన్షియల్… చెప్పొచ్చు కదా, ఇందులో దాపరికం ఏముంది అంటారా..? హమ్మా… నాయకుల అనారోగ్యాలు సీపీఎంలో అత్యంత రహస్య పత్రాలు…
సరే, చికిత్స పొందుతాడు, సో వాట్..? ఆయనేమీ తప్పుపని చేయడం లేదు కదా అంటారా..? అలా బీజేపీ, కాంగ్రెస్, సోషల్ మీడియా ఊరుకోవు కదా… బరాక్ ఒబామా వస్తే తిడతావు, నిరసన అంటావు… తెల్లారిలేస్తే అమెరికాను తిట్టిపోస్తావు, ప్రపంచానికి శత్రువు అంటావు… ఇక్కడ బతుకుతూ చైనాకు భజన చేస్తావు… చైనా మన మీద పడి ధ్వంసం చేసినా సరే, అది మన మంచితే అనే భ్రమల్ని వ్యాప్తి చేస్తావు… బతుకంతా విదేశీ దాస్యం, ఆ బుడతకీచుల పాదసేవ… కానీ నీకు పర్సనల్‌గా అనారోగ్యం అనేసరికి అమెరికా కావాలి…
Ads
పోనీ, మీ పార్టీలోనే అందరికీ ఇంతటి హైరేంజ్ చికిత్స దొరుకుతుందా..? పోనీ, సీపీఎం జాతీయ పొలిట్ బ్యూరో నేతలు, సెక్రెటేరియట్ నేతలకైనా దొరుకుతుందా..? తను సీఎం కాబట్టి వెళ్లగలుగుతున్నాడు… మరి తెల్లారిలేస్తే పార్టీ చెప్పే నైతిక సూత్రాలకు అర్థమేమున్నట్టు..? మాట్లాడితే క్యూబా, చైనా, ఉత్తర కొరియా నీకు ఆదర్శదేశాలు… మన కేంద్రం కూడా ఆ దేశాల ముందు దాసోహం అనాలి అన్నట్టుగా మాట్లాడతావ్… తీరా నీకు జబ్బు చేస్తే అమెరికా కావాలి… ఆ ఉత్తర కొరియాలో ప్రపంచంలోకెల్లా ఎంతటి దిక్కుమాలిన పాలనో, వాడెంత మూర్ఖాగ్రేసరుడో అందరికీ తెలుసు… సో, మీ మాటలు వేరు, మీ చేతలు వేరు………… ఇలా సోషల్ మీడియా ప్లస్ బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ‘ఇచ్చి పడేస్తున్నారు’… పనిలోపనిగా కొందరు రెచ్చిపోయి, ‘‘అయ్యప్ప జోలికి వెళ్లినవాడెవడూ బాగుపడలేదురా’’ అని శాపనార్థాలకూ దిగుతున్నారు… కామ్రేడ్, ఇవన్నీ పట్టించుకోకు, త్వరగా కోలుకో, వచ్చెయ్, అందరికీ జవాబులు చెబుదాం… మనకేమీ కొత్త కాదుగా…!! కానీ ఓ మంచి పనిచేసినవ్ కామ్రేడ్, పొరపాటున కూడా చెన్నై కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లలేదు… బతికిపోయావ్…!!
Share this Article