.
నిన్న కేసీయార్ బిడ్డ, కేటీయార్ చెల్లెలు కవిత కేటీయార్ నైజం మీద మాట్లాడిన మాటలు పరుషంగా, పదునుగా, నిష్కర్షగా, కటువుగా ఉన్నాయి… నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకన్నా ఘాటుగా ఉన్నాయి… రేవంత్ రెడ్డి కేవలం రాజకీయ విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నాడు… లేదా కేసీయార్ కుటుంబ అవినీతిని ఆధారాలతోసహా బట్టబయలు చేస్తున్నాడు…
కానీ కవిత ఆ కుటుంబ సభ్యురాలు… ఏకంగా కేటీయార్ నిజ నైజాన్ని వివరిస్తోంది… అవసరమున్నప్పుడు వాడుకుని, తరువాత నట్టేట ముంచే తత్వాన్ని ఎండగడుతోంది… నిన్నో మొన్నో కేటీయార్ రేవంత్ రెడ్డికి ఓ లేఖ రాశాడు… యాదాద్రి థర్మల్ ప్లాంటు కోసం విదేశీ బొగ్గు దిగుమతికి సంబంధించిన యవ్వారం… సీఎం కొన్ని ఆరోపణలు చేశాడు… తరువాత విచారణ కోరుతూ కేటీయార్ ఓ లేఖ రాశాడు… బహుశా భోత్రా లాజిస్టిక్స్ కంపెనీతో ఒప్పందం గురించి..!!
Ads
నిజానికి అదేమీ అనుమానాస్పద కంపెనీ ఏమీ కాదు… అందులో రేవంత్ ప్రభుత్వం పాల్పడిన రహస్య ఒప్పందాల కుట్రలూ లేవు… అది విదేశీ బొగ్గు దిగుమతుల వ్యాపారంలో ఉన్నదే… సరే, ఆ వివాదం సంగతి ఎలా ఉన్నా… ఇక్కడ కేటీయార్ నైజం, కేసీయార్ నైజం గురించిన చర్చ… నమ్మిన తెలంగాణ సమాజాన్నే అనేకానేక వేల కోట్ల స్కాములతో మోసగించిన కుటుంబం నిజతత్వం గురించి… కవిత చెప్పిన మరికొన్ని అంశాల గురించి…

విదేశీ బొగ్గు దిగుమతికీ ప్రతిమ శ్రీనివాసరావుకూ లింక్ ఏమిటో తెలియదు గానీ… కవిత ఏమంటున్నదంటే..? ‘‘నమ్మినవాళ్లను, సాయం చేసిన చేతులను మోసం చేయడమే ఇది… కష్టకాలంలో పార్టీకి ఏ ఆర్థిక మద్దతు లేనప్పుడు ఆదుకున్నది, సాయం చేసింది, అండగా ఉన్నది ప్రతిమ శ్రీనివాసరావు… అటుకులు బుక్కుతూ ఉద్యమం నడిపిన రోజుల్లో ఆయనే సాయం చేశాడు…
టీన్యూస్, నమస్తే తెలంగాణ స్జాపనకూ తనదే సాయం… అలాంటి వాళ్లే కాదు, ట్రూ వెల్విషర్లు, కులబాంధవులు, చివరకు సొంత చెల్లెనైనా నన్ను… ఎవరినీ మోసగించకుండా వదిలేయడు కేటీయార్… తాజాగా రేవంత్ రెడ్డికి రాసిన లేఖ పక్కా నిదర్శనం…’’ ఇలా సాగిపోయింది ఆమె వ్యాఖ్యానం…
https://www.facebook.com/reel/1620133786477494
కేటీయార్ నైజం గురించి కవిత చెప్పింది అక్షరాలా నిజమే… మీకు గుర్తుందా..? రెండేళ్ల క్రితం మేఘా ఇంజినీరింగ్ సంస్థను బ్లాక్ లిస్టు చేయడం లేదేం అని ఉరిమాడు కేటీయార్… ఆ వార్త చూస్తే నవ్వొచ్చింది అప్పట్లో… ఇప్పుడు కవిత చెప్పింది నిజమే కదాని పాత వార్తలు గుర్తొచ్చాయి… అప్పట్లో ఓసారి అదే మేఘా కృష్ణారెడ్డికి ఏదో సభలో సన్మానం చేసింది కూడా తమ పాలనకాలంలోనే అని గుర్తొచ్చింది… ఇదుగో ఆనాటి గొప్ప వార్త క్లిప్పింగ్…

ఎందుకు బ్లాక్ లిస్టు చేయాలయ్యా అనడిగితే… సుంకిశాల రిటెయినింగ్ వాల్ కూలింది వాళ్ల వల్లే… హమ్మా, వాళ్లను నిషేధించాలి కదా అంటున్నాడు… పైగా కొడంగల్ లిఫ్టులో 4350 కోట్ల పనులు ఇస్తారా..? ఇంత ద్రోహమా..? ఇక్కడే కాదు, దేశమంతా బ్లాక్ లిస్టులో పెట్టాలి, చూడబోతే మూసీ లక్షన్నర కోట్ల ప్రాజెక్టూ మేఘాకే ఇచ్చేట్టున్నారు… రేవంత్కు ఎన్ని..? ఢిల్లీకి ఎన్ని కోట్లు..? అనీ ఉరిమాడు… కసిరాడు…
అధికారంలో ఉన్నప్పుడేమో అందరికీ మేఘా కృష్ణారెడ్డి ఆత్మీయుడు… అడిగినదానికన్నా ఎక్కువ ఇస్తాడు కాబట్టి… అప్పుడు సన్మానం చేయాలి, ఇప్పుడు బ్లాక్ లిస్టు చేయాలని డిమాండ్ చేయాలి… కేసీయార్, జగన్, చంద్రబాబు… చివరకు కేంద్రంతో కూడా మేఘాకు మంచి సంబంధాలున్నాయి… అలా మెయింటెయిన్ చేస్తాడు తను… కాకపోతే తను అనుకున్న పని తన కంపెనీ ఒడిలో పడాలి, అంతే…
అందుకే ఒకప్పుడు ఓ సాదాసీదా సబ్ కంట్రాక్టర్ ఇప్పుడు ఆదానీ, అంబానీ, వేదాంతలకు దీటుగా ఎదిగి, ఫోర్బ్స్లో కూడా చేరారు… పిచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి…! అసలు వాళ్లు అడుగుపెట్టి విస్తరించని రంగం లేదు ఇప్పుడు… విదేశాలకూ విస్తరిస్తారు… గత దశాబ్దంలో భారత వ్యాపార కంపెనీల్లో అదొక అసాధారణమైన హ్యూజ్ సక్సెస్ స్టోరీ… అక్రమమో సక్రమమో… పెద్ద పెద్ద కంపెనీలన్నీ అంతే కదా…

ఇప్పుడు కేటీయార్కు మేఘా అరాచకం హఠాత్తుగా గుర్తొచ్చింది… ప్రతిమ శ్రీనివాసరావుపైనా కోపమొచ్చింది… ఒకప్పుడు మేఘా, కేసీయార్ ఎంత సన్నిహితులో తెలంగాణ సమాజం మరిచిపోయిందా ఏం..? అప్పట్లో చంద్రబాబు, కేసీయార్ కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బులిచ్చారనీ, మేఘా డబ్బు బాగా తరలించారనీ మోడీ రుసరుసలాడినట్టు వార్తలు కూడా వచ్చాయి… అలాంటిది కేటీయార్ మేఘా మీద నోరుపారేసుకోవడం చూస్తే నవ్వొచ్చింది అందుకే…
అసలు సుంకిశాల కథే పెద్ద చరిత్ర… ఇక్కడ రాస్తే మరీ పెద్దదైపోతుంది… ఒక మేఘా, ఒక ప్రతిమ… అధికారంలో ఉంటే, అటుకులు బుక్కినప్పుడు అండగా ఉంటే కులబాంధవులు, ఆత్మీయులు… తరువాత కాళేశ్వరం ప్రాజెక్టు పనులు కూడా… ఇప్పుడవి హఠాత్తుగా ఈస్ట్ ఇండియా కంపెనీలు…!!
Share this Article