Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మదగజరాజా..! అంతా అరవ అతి..! విశాల్, భరించడం కష్టమేనోయీ..!!

January 31, 2025 by M S R

.

మొన్న ఏమన్నాడు విశాల్..? దయచేసి ఎవరూ కొత్తగా ఇండస్ట్రీలోకి రాకండి, డబ్బు నష్టపోకండి, వీలైతే రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాలు చేసుకొండి అని కదా…

నిజం… తమిళ, మలయాళ సినిమా ఇండస్ట్రీలు దారుణంగా దెబ్బతిన్నయ్ గత ఏడాది… పెద్ద పెద్ద హీరోల వందల కోట్ల భారీ సినిమాలు ఇండస్ట్రీని కుదేలు చేశాయి… కథలుకాకరకాయ దేనికి..? హీరో కనిపిస్తే చాలు, డబ్బులేడబ్బులు అనే తిక్క కూతలు కూసిన నిర్మాతలకు ఇదొక గుణపాఠం… ఈ నేపథ్యంలో విశాల్ చెప్పిన మాటలు కరెక్టు…

Ads

కానీ తన మనసులో ఉన్నది వేరే కావచ్చు బహుశా… ఎప్పుడో 2012లో మొదలు పెట్టి, కళేబరంలా మారిన మదగజరాజా సినిమాకు పుష్కరకాలం తరువాత కాస్త మాంసం అతికించి, రంగులు పూసి, కొత్త దుస్తులు తొడిగి ప్రవేశపెట్టాల్సి వచ్చిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అలా అన్నాడేమో…

ఏమో… తన ఆరోగ్యం దెబ్బ తిన్నది… ప్రిరిలీజు మీడియా మీట్లలో కూడా చేతులు వణుకుతూ, మాటలే కష్టమైపోయాయి… ఇంత పెద్ద హీరోను అయి ఉండీ, కోలీవుడ్ నటుల అసోసియేషన్ లీడ్ చేసి, చారిటీ కార్యక్రమాలు చేసీ చివరకు ఇలా మిగిలిపోయాను అనే డిప్రెషన్ కూడా కావచ్చేమో…

అవును, మదగజరాజా సినిమా పుష్కరకాలం క్రితందే… హఠాత్తుగా దాన్ని చెవులు పట్టుకుని ఈకాలంలోకి లాక్కురాలేరు కదా ఎవరైనా… అదే జరిగింది… పైగా సినిమాలో అడుగడుగునా లాజిక్ రాహిత్యం… అరవ మార్కు అతి… ప్రేక్షకులు ఎడ్డోళ్లు అనే భావనతో సినిమాను చుట్టేశారు…

నిజానికి ఎప్పుడో షూట్ అయిపోయిన ఫీడ్ అంతా స్క్రాప్… కానీ చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఏదో మేకప్పులు వేసి రిలీజ్ చేశారు… తమిళులకు అది పర్లేదు, వసూళ్లు బాగానే వచ్చాయి మొన్న పొంగల్ రిలీజుకు… దాన్నే ఆలస్యంగా ఇక్కడ రిలీజ్ చేశారు… మరీ గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకూ మహారాజ్ నడుమ దీన్ని రిలీజ్ చేస్తే నలిగిపోతామని భయపడ్డారేమో…

కానీ ఆ అతి కామెడీ మనవాళ్లకు పెద్దగా కనెక్ట్ కాదు… అత్తాఅల్లుళ్ల సంభాషణల్లో మరీ అతి… తెలుగు నటులు ఉన్నా సరే, వేరే గొంతులతో డబ్బింగ్… హీరోయిన్ల పాత్రలకు అస్సలు ప్రాధాన్యం లేదు… అంజలి, వరలక్ష్మి జస్ట్ ఫర్ గ్లామర్ టచ్… ఏదో తాతలకాలం నాటి కథ… పాటల గురించి చెప్పుకోవడం శుద్ధ దండుగ…

అతి అయినా సరే భరించగలం అనుకునే ప్రేక్షకులకు సంతానం, మనోబాల కామెడీ కాస్త రిలీఫ్ ఈ సినిమాలో… నిజానికి ఇప్పుడు మార్కెట్‌లో సంక్రాంతికి వస్తున్నాం అనే పెద్ద సినిమా మరేదీ చెప్పుకోదగ్గ సినిమా లేదు… ఈ స్థితి ఈ సినిమాకు పాజిటివ్ కావాలి కానీ, ప్చ్… కష్టమే… విశాల్, నువ్వు చెప్పినట్టు ఇలాంటి సినిమాల్ని జనంలోకి వదలడంకన్నా ఇండస్ట్రీ ముఖ్యులు వేరే వ్యాపారాల్ని చూసుకోవడమే బెటర్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఒక అంబానీ ఎదుగుదల..! కుబేర చూస్తుంటే ఏమీ గుర్తుకురాలేదా..?
  • పుడితే ఒక్కటి, చస్తే రెండు… అసలు ఆ మాటలో అర్థమేమిటో తెలుసా..?!
  • హీరో భారీ ఫోటోలతో హీరోయిన్ రొమాన్స్… విజయశాంతి ఆరబోత…
  • నగరం వదిలేశాడు… సొంతూరు చేరాడు… ఆ పల్లెకు మళ్లీ జీవకళ తెచ్చాడు…
  • మరీ సిల్క్ స్మిత మీద ప్రతీకారం, అదీ పునర్జన్మతో… నచ్చలేదు..!!
  • బనకచర్ల సినిమా కథలో మరో పెద్ద ట్విస్టు…! బస్తర్ టు బనకచర్ల..!!
  • జూన్ 20… నిజంగానే ఈ దినానికి ఇండియన్ క్రికెట్‌లో పవిత్రత ఉందా..?!
  • భార్యా చైతన్యవతీ శత్రు..! నిజమేనా..? స్త్రీలు అంత ప్రమాదకారులా..?!
  • ఓ మేనత్త కథ… ఓ కుటుంబ కథ… సొంత బిడ్డలూ కానని దుఖపు కథ…
  • వాడెప్పుడూ పాకిస్తానీ స్నేహితుడే… మనమెందుకు సాగిలబడుతున్నాం…!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions