Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరకు రష్మి, సుధీర్ లవ్వుకూ కత్తెర..? ఈమెతో కొత్త కథ మొదలెట్టేశారా..?!

January 20, 2022 by M S R

తెలుగు టీవీ తెర సూపర్ స్టార్ సుడిగాలి సుధీర్… తను ఏ సీరియళ్లలోనూ నటించడు… ప్రతి షోకు యాంకరింగు చేస్తానంటూ ముందుకురాడు… కానీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది తనకు… తను ఆ ఆదరణకు అర్హుడే… డౌన్‌టుఎర్త్… స్కిట్ కోసమే అయినా సరే, తన మీదే సెటైర్లు పేల్చినా సరే, లైట్ తీసుకుంటాడు… కానీ మల్లెమాల కంపెనీ తాలూకు వర్గకలహాల్లో పడి నలుగుతున్నాడు, ఒక్కో షోలో అడ్డంగా కత్తిరించుకుంటూ వెళ్తున్నారు… అది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం… పండుగ ప్రత్యేక షోలు కట్… ఢీ డాన్స్ షో కట్…

శ్రీదేవి డ్రామాకంపెనీ, ఎక్సట్రా జబర్దస్త్ మాత్రం మిగిలాయి… ఒకటి కమెడియన్, మరొకటి యాంకర్… ఇక వీటికీ ఎప్పుడు కత్తెరపడుతుందో తెలియదు… సుధీర్ ప్రస్థానం తరువాత ఎటువైపో కూడా తెలియదు… కానీ సుధీర్ పేరును రష్మి అనే పేరుతో జత లేకుండా ఊహించలేం కదా… ఎనిమిదేళ్లుగా ఇద్దరి నడుమ లవ్ ట్రాక్‌ను లైవ్‌గా నడిపిస్తున్నారు… వాళ్ల కెమిస్ట్రీ నిజంగానే బాగుంటుంది… వాళ్ల కామెడీ, వాళ్ల డాన్సులు, వాళ్ల సరసాలు అన్నీ… అయితే ఇప్పుడు దాన్ని కూడా కత్తిరించే పనిలో పడ్డట్టున్నది మల్లెమాల కంపెనీ… నిజమేనా..? చివరకు రష్మి, సుధీర్‌ల బంధాన్ని కూడా చీల్చి, సుధీర్‌కు ఓ కొత్త జోడిని జతచేసి, ఇంకో కొత్త లవ్ ట్రాక్‌కు తెరలేపుతున్నారా..?

టీవీల్లో ప్రేక్షకుల్ని పిచ్చోళ్లను చేయడానికి రకరకాల లవ్ ట్రాకులు నడిపిస్తుంటారు… జడ్జిలకు, యాంకర్లకు… యాంకర్లకు, డాన్సర్లకు… జడ్జిలకు, కమెడియన్లకు… యాంకర్లకు, కమెడియన్లకు… ట్రాకులు క్రియేట్ చేస్తుంటారు… దాదాపు ప్రతి రియాలిటీ షోలోనూ కనిపించే కథే ఇది… ప్రతి భాషలోనూ అంతే… అయితే అది ప్రేక్షకులను రంజింపచేయాలి… ఆకట్టుకోవాలి… అలాగైతే ఆ బంధం కృత్రిమమని తెలిసినా ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు… సుధీర్, రష్మి ప్రేమ కథ అదే… వాళ్లది జనం మెచ్చిన లవ్ ట్రాక్… కలిసి ఉంటున్నారా..? కలిసిపోతారా..? ఇవన్నీ ప్రేక్షకుడికి అక్కర్లేదు… రష్మి, సుధీర్ కలిసి కనిపిస్తే అదొక ఆనందం ప్రేక్షకుడికి…

Ads

తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తే… మల్లెమాల వాళ్లు ఇంకేదో కొత్త కథకు తెరతీస్తున్నట్టుగా అనిపించింది… రష్మిని, సుధీర్‌ను, పూర్ణను, దీపిక పిల్లిని ఢీ షో నుంచి తరిమేశారు కదా… అక్కడికి నందిత శ్వేత అనే ఓ సినిమా నటిని పట్టుకొచ్చారు కదా… ఏం చేసినా ఆ షో ఏమాత్రం రక్తికట్టడం లేదు… నానాటికీ తీసికట్టు రేటింగ్స్… ఇప్పుడు ఆ నందితను శ్రీదేవి డ్రామా కంపెనీకి పట్టుకొచ్చారు, ఒక్క షో అతిథిగానే కావచ్చుగాక… కాకపోతే హొయలు పోతూ… వగలు కురిపించింది… ‘‘సుధీర్‌ను చూస్తుంటే ఎక్కడికి పోతావు చిన్నవాడా అనిపిస్తుంది..’’ అంటూ ఫ్లయింగ్ కిస్సులు కురిపించింది… ఇద్దరి చుట్టూ బోలెడు లవ్ సింబల్స్‌ పెట్టేసి ప్రోమో ఎడిటర్లు పండుగ చేసుకున్నారు… అంటే ఏమిటి..? ఢీ డాన్స్ షోకు మళ్లీ వస్తావులేవోయ్ అని సంకేతాలు ఇస్తోందా..? (ఆ పేరుతో ఆమె ఒక సినిమా చేసిందిలే)… లేక రష్మికి ఈ కత్తెర కూడా పెట్టేసి, నందితతో రొమాన్స్ స్టార్ట్ చేయిస్తారా..? ఏం కథలు పడుతున్నారురా భయ్…!! అప్పుడే ఈ కొత్త లవ్వు మీద మీమ్స్ స్టార్ట్ అయిపోయాయి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions