మొన్న ఏదో జబర్దస్త్ స్కిట్‌లో సుడిగాలి సుధీర్ అంటాడు… ‘‘ఢీ మానేశాను కదా, ఇంకేం మానేయాలిరా’’ అని… ఢీ నుంచి ఎందుకు వెళ్లగొట్టారు తనను, మల్లెమాలలో డైరెక్టర్ల గ్రూపులు ఏమిటి..? మల్లెమాల శ్యాంరెడ్డికి సుధీర్ మీద అంత ఆగ్రహం ఎందుకు కలిగింది అనే వివరాల్లోకి మళ్లీ మళ్లీ వద్దులే గానీ… సుధీర్ మీద మల్లెమాల కోపం కంటిన్యూ అవుతూనే ఉంది… తెలుగు టీవీ ప్రోగ్రాముల్ని రెగ్యులర్‌గా చూసే ప్రేక్షకుల్లో సుధీర్ అభిమానులు చాలా ఎక్కువ… ఈటీవీని, మల్లెమాలను తిడుతూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు కామెంట్లలో… కానీ ఈటీవీలో తిష్ఠవేసిన సుధీర్ వ్యతిరేక బ్యాచ్ ‘‘వుయ్ డోన్ట్ కేర్’’ అంటోంది… అంటే పొగ మరింత పెరుగుతోంది అన్నమాట… ఉంటే ఉండు, పోతేపో అని మొహం మీదే చెప్పేస్తున్నారు అన్నమాట…
సాధారణంగా పండుగల పూట ప్రసారం చేసే ప్రత్యేక షోలకు సంబంధించి ఈటీవీకి ఓ స్పెషాలిటీ ఉంది… తమ ఆస్థాన కమెడియన్లతో ప్రతి పండుగకూ ఏదో ఓ స్పెషల్ షో చేస్తుంది… ఆ షోలకు రీచ్ ఎక్కువ, ప్రేక్షకాదరణ ఎక్కువ, పండుగ పూట జనం కుటుంబంతో సహా టీవీ ఆన్ చేసి చూస్తుంటారు కాబట్టి టీఆర్పీలు కూడా ఎక్కువే, యాడ్స్ ఎక్కువే, రెవిన్యూ ఎక్కువే… వాటిల్లో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్టులకు కూడా కాస్త బాగానే ముట్టజెబుతూ ఉంటారు… (పండుగ ప్రత్యేక షోలకు సంబంధించి మాటీవీ, జీటీవీ షోలు ఎంత ప్రయత్నించినా సరే, అవి పెద్దగా క్లిక్ కావు, ఎందుకో మరి…)
Ads
వచ్చే సంక్రాంతి రోజున ప్రసారం చేయబోయే ‘అమ్మమ్మ గారి ఊరు’ ప్రోమో రిలీజ్ చేశారు… బాబూమోహన్, అన్నపూర్ణ, రోజా, ఆమని, కృతిశెట్టి కనిపిస్తున్నారు… ఈటీవీలో కనిపించే ప్రతి కమెడియన్ కనిపిస్తున్నారు… ప్రదీప్, హైపర్ ఆది సరేసరి… చివరకు సుధీర్ జాన్‌జిగ్రీగా పిలవబడే రష్మి కూడా ఉంది… (అప్పుడే కొందరు కామెంట్స్ స్టార్ట్ చేశారు, వదినా నువ్వు కూడా అన్నను వదిలేశావా, ఢీ షోలాగే దీన్ని కూడా నువ్వు రిఫ్యూజ్ చేయలేకపోయావా అంటూ…!!) సుధీర్ టీం సభ్యులైన ఆటో రాంప్రసాద్ కూడా ఉన్నాడు… వర్ష, రవి, ఇమ్ము, రోహిణి, లాస్య… పండుగ షో అనగానే రోజా ఏదో డాన్సు చేస్తుంది కదా… ఈసారి కూడా ఆమనితో కలిసి డాన్స్… హేం చేస్తం..? ఫాఫం, మల్లెమాల కూడా వద్దనలేడు… కానీ సుధీర్ మాత్రం ఈ షోలో లేడు… అంటే చివరకు పండుగల స్పెషల్ షోల నుంచి కూడా సుధీర్‌ను తప్పించేస్తున్నారన్నమాట…
తను జబర్దస్త్‌లో కంటిన్యూ అవుతున్నాడు… శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పటికైతే కనిపిస్తున్నాడు… చూడబోతే పొమ్మనే పొగ దట్టంగానే పెట్టబడుతున్నట్టుగా కనిపిస్తోంది… ఈటీవీ, మల్లెమాల చేజేతులా… ఒక పాపులర్ అస్త్రాన్ని మాటీవీ వైపో లేక జీటీవీ వైపో పంపించేస్తున్నారా..? ఎందుకంటే..? సినిమాల చాన్సులు వస్తున్నా సరే, సుధీర్ ‘పాడి బర్రె’ వంటి టీవీని మాత్రం వదిలేయడు… కానీ ఈటీవీలో దట్టంగా పొగ కమ్మేస్తే ఇక చేసేదేముంది..? మరో టీవీ వైపు చూడటమే కదా… అదే జరగబోతోందా..? ఏమో మరి…!!
Share this Article