.
డీఎంకే మంత్రి పీకే శేఖర్ బాబు ప్రత్యేకంగా నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్‌ను కలవడం ఒక వార్త… దీంతో కొన్ని ఊహాగానాలు… కమలహాసన్‌కు డీఎంకే రాజ్యసభ సభ్యత్వం కట్టబోతోంది, అది మాట్లాడటానికి స్టాలిన్ తన మంత్రిని పంపించాడు అని…
కానీ తమిళ మీడియాలో ఇంతకుమించి ఊహాగానాలు కూడా కనిపిస్తున్నాయి… బహుశా అది డీఎంకేలో మక్కల్ నీది మయ్యం పార్టీని విలీనం చేయాలనే ప్రతిపాదన కూడా కావచ్చునట… హఠాత్తుగా ఇదెందుకు తెరపికి వస్తోంది… అదీ ఇంట్రస్టింగు… కాస్త వివరంగా చెప్పాలంటే…?
Ads
నో డౌట్, కమలహాసన్ గొప్ప నటుడు… భారతదేశం గర్వించదగిన నటుడు… ప్రతిభ, ప్రయోగాలు, సాహసాలు, శ్రమ తన సొంతం… వ్యక్తిగా తన పెళ్లిళ్లు, అఫయిర్స్ ఎట్సెట్రా పక్కనపెడితే… ఓ రాజకీయ పార్టీ అధినేతగా డిజాస్టర్… తను కూడా గెలవలేక, ఒక్కడినీ గెలిపించుకోలేక, తమిళ రాజకీయాలను వీసమెత్తు ప్రభావితం చేయలేక చతికిలపడ్డాడు…
సేమ్ డీఎంకేలాగే తనదీ నాస్తికత్వమే… స్ట్రెయిట్‌గా చెప్పాలంటే హిందూ వ్యతిరేకత… నిజం చెప్పాలంటే తమిళ రాజకీయాల్ని సినీ పర్సనాలిటీలు ప్రభావితం చేయడం అనేది జయలలితోనే అంతమైపోయింది… గత ఎన్నికల్లో కమలహాసన్ ఇండికూటమికి మద్దతు పలికాడు… మరిప్పుడు అకస్మాత్తుగా నీకు ఎంపీ సీటు ఇస్తాం, నీ మద్దతు కొనసాగించు అని చెప్పాల్సిన అవసరం ఏముంది..?
ఉంది… హీరో విజయ్ దూకుడుగా ముందుకొస్తున్నాడు… తమిళగ వేట్రి కజగం… తనకూ రజినీకాంత్, కమలహాసన్ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది… ఎలాగూ జయలలిత మరణంతో అన్నాడీఎంకే పని అయిపోయింది… అందులో జనాకర్షణ ఉన్న లీడర్ లేడు… ఎవరికీ అంత సీన్ లేదు… సో, యాంటీ డీఎంకే వాక్యూమ్ ఉంది అక్కడ…
అందులోకి బీజేపీ దూరలేకపోతోంది… దాని బలహీనత దానిది… అది నార్తరన్ హిందీ హిందూ పార్టీ… తమిళులు అంత సులభంగా అంగీకరించరు… ఎలాగూ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాడు… వేరే ఆల్టర్నేటివ్స్ లేవు… సో, ఆ ఖాళీలోకి తను దూసుకుపోతే తన పొలిటికల్ యాంబిషన్స్ నెరవేరతాయనేది విజయ్ ఆశ… ఇదీ స్టాలిన్‌కు కాస్త కలవరం కలిగించే అంశం…
ఎలాగూ లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలను తన శిబిరంలోనే కట్టేసుకున్నాడు… తను ఎన్ని సీట్లు ఇస్తే అంతకే సంతృప్తి వాళ్లకు… అందుకని విజయ్ దూకుడును ఆదిలోనే అడ్డుకోవాలంటే సినిమా పాపులారిటీ ఉన్న లైక్ మైండెడ్ కమలహాసన్ పార్టీని విలీనం చేసుకుని, విజయ్ మీదకు ప్రయోగించాలనేది స్టాలిన్ ఎత్తుగడగా చెబుతున్నారు… మంచి ఆలోచనే…
కానీ కమలహాసన్‌కు జనంలో ఓ లీడర్‌గా యాక్సెప్టెన్సీ లేదు… తను జనంలో ఉండడు… కేవలం ఇండి కూటమికి మద్దతుగా ఉన్నంతమాత్రాన పెద్ద ఫాయిదా లేదు స్టాలిన్‌కు… అందుకే విలీన ప్రతిపాదనలు… ఐతే కమలహాసన్ అంగీకరిస్తాడా..? చెప్పలేం..! అంగీకరించక, బరిలో ఉన్నా సరే తను గెలవగలిగేది కూడా ఏమీ లేదు..!! రాజ్యసభ సీటు వోకే, కానీ ఏ మూల్యానికి..!?
Share this Article