రాజ్యాంగాన్ని మొదట రూపొందించినపుడు ‘ పీఠిక ‘(Preamble) లో సెక్యులర్ అనే పదం లేదు! సెక్యులర్ మరియు సోషలిస్టు అనే పదాన్ని 1976 లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి మరీ సెక్యులర్ మరియు సోషలిస్ట్ అనే పదాలని చేర్చింది ఇందిరాగాంధీ!
రాజ్యాంగాన్ని 42 వ సవరణ ద్వారా ఇందిర చేర్చిన దానిని మొదటి నుండి మన రాజ్యాంగంలో ఉన్నట్లుగా భ్రమింప చేయడంలో రాజకీయ నాయకులు మరియు మీడియా కూడా కలిసి విజయం సాధించాయి.
అవనీ డయస్ ( Avani Dias) ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ను భారత్ నుండి బహిష్కరించారు అమిత్ షా! అవనీ డయాస్ తన డాక్యుమెంటరీలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం రూపొందించినప్పటి నుండీ ఉన్నాయని చెప్పింది! సెక్యులర్, సోషలిస్ట్ దేశం అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సెక్యులర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ తన డాక్యుమెంటరీ వీడియోలో పేర్కొంది!
Ads
దీని మీద అమిత్ షా వెంటనే స్పందించి భారత్ లో అవనీ డియాస్ తన జర్నలిస్టు కార్యకలాపాలను నిషేధిస్తూ, భారత్ లోకి రావడానికి వీసా ఇవ్వడానికి వీల్లేదని ఉత్తర్వులు ఇచ్చారు!
ABC NEWS అనేది అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్! ABC NEWS కి ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నది అవనీ డయాస్! రెండు నెలల క్రితం ఫ్రాన్స్ కి చెందిన జర్నలిస్ట్ ను కూడా భారత్ వ్యతిరేక వార్తలు రిపోర్ట్ చేస్తున్నాడని ఫ్రాన్స్ కి తిప్పి పంపడం జరిగింది! అయితే ఇక్కడితో అయిపోలేదు విషయం!
భారత హోమ్ మంత్రిత్వ శాఖ ABC NEWS కి నోటీస్ జారీ చేసింది వివరణ ఇవ్వమని! ABC NEWS వివరణ ఇచ్చింది. భారత రాజ్యాంగంలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు మొదటి నుండి లేవనీ, 1976 లో ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా చొప్పించారనీ, అవనీ డయాస్ తన డాక్యుమెంటరీ లో తప్పుడు సమాచారం ఇచ్చింది అని అంగీకరిస్తూ అవనీ డయాస్ ను ABC NEWS నుండి తొలగిస్తున్నాము అని ప్రకటించింది!
So, మోడీ ప్రభుత్వం 3.0 లో కూడా మునపటి వలే కఠినంగా వ్యవహరిస్తున్నది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది! అవనీ డయాస్ లాంటి జర్నలిస్టులు ప్రతీ దేశంలో ఉన్నారు వివిధ మీడియాలలో, కానీ ఉద్యోగం పోతుంది అనే భయం ఉండదు వీళ్ళకి, ఎందుకంటే జార్జ్ సోరోస్ pay roll లో ఉంటారు కాబట్టి జీతం అనేది బోనస్ లాంటిది!…. [ By పొట్లూరి పార్థసారథి ]
Share this Article