Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!

October 10, 2026 by M S R

.

Dont trouble the trouble అంటారు కదా… Elon musk troubled the trouble… మరి రిజల్ట్..? ఓసారి వివరంగా చెప్పుకుందాం… ముఖేష్ అంబానీ… సాధారణంగా తొందరపడడు… కూల్‌గా తను చేయాలనుకున్నది చేస్తాడు… న్యాయమైనా, అన్యాయమైనా… తను అడుగుపెట్టిన రంగంలో గుత్తాధిపత్యం కావాలని కోరతాడు… వ్యాపారరంగంలో అది సహజమే…

ఇండియాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే తను ప్రభుత్వాన్ని, విధానాలను శాసిస్తాడు… తనకు అనుకూలంగా…! టెలికాం రంగంలోనూ తనకు మోనోపలి కావాలి… కానీ ఎలన్‌మస్క్ అనే ఓ వింత బిజినెస్ కేరక్టర్ తనకు పోటీగా వస్తుందని అనుకోలేదు తను… మస్క్ అంటే సంప్రదాయ వ్యాపారి కాదు… దూకుడు తన స్ట్రాటజీ… అందులో ఏ రేంజుకైనా వెళ్లిపోతాడు…

Ads

తన ఉపగ్రహ ఆధారిత స్టార్‌లింక్ సేవలకు ఇండియాలో ఎంతకూ అనుమతులు రాకపోవడంతో… అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు… 165 దేశాల్లో అడుగుపెట్టాను, ఆఫ్టరాల్ ఇండియా ఎంత అనుకున్నాడు..? కానీ ఇక్కడ అంబానీ ఉన్నాడని లైట్ తీసుకున్నాడు… ఇప్పుడు అర్థమైంది… ఆ ఫ్రస్ట్రేషనో లేక ఇదోరకం ఒత్తిడి వ్యూహమో తెలియదు గానీ… ప్రభుత్వాన్ని, అంబానీని కలిపి గోకడం మొదలుపెట్టాడు…

Oligarchs అంటూ అంబానీని పరోక్షంగా ట్వీటిన మస్క్ తరువాత అంబానీని నేరుగానే టార్గెట్ చేశాడు… బీజేపీ- అంబానీ సంబంధాలు అంటాడు… మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంబానీ అని వ్యంగ్యం దట్టిస్తాడు… దేశాన్ని పాలించేది అంబానీయే, రియల్ బాస్ ఆఫ్ ఇండియా అంటున్నాడు… ఇదొక విపరీత ధోరణి… ఇక్కడే అంబానీకి కాలింది… అసలే తను Trouble… మరి ఆ trouble ను trouble చేస్తే..?

అసలైన అంబానీ బయటికొచ్చాడు… తను ఎక్కడా ఒక్క మాట తూలలేదు… జియో సుమారు 1,600 ఉపగ్రహాలు, దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్ స్టేషన్లతో కూడిన ఉపగ్రహ నెట్‌వర్క్‌ను ప్రతిపాదించాడు… ఆ వార్తలు బయటికి వదిలింది అంబానీ క్యాంప్… అంతరిక్షంలో జరిగే టెలికాం సేవల యుద్ధంలో మస్క్‌ను ఢీకొట్టడానికి భారీ స్థాయిలోనే రెడీ అయిపోతున్నాడు…

అంబానీని అలా గోకితే ఉపగ్రహాలే దిగి వస్తాయి! మరోవైపు ప్రభుత్వ అనుకూల సోషల్ మీడియా కూడా మస్క్ మీద అక్షరదాడికి దిగింది… ‘‘చైనా ఈవీ బీవైడీ కార్లు అమెరికాను ఏలకుండా 100 శాతం పన్నులు వేయించావు ట్రంపుతో… నీకేమో ఇండియా ఇక్కడ సాగిలబడాలా? వ్యాపారంలో ఈ ధూర్తనీతి దేనికి?’’ అని స్టార్ట్ చేసింది…

కానీ… ఓ ప్రశ్న… ఎలన్ మస్క్‌కు నిజంగా ఏమైంది? ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకడు. అంతరిక్షంలోకి రాకెట్లు పంపగలడు. వేలాది ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చగలడు. ఎలక్ట్రిక్ కార్ల నుంచి కృత్రిమ మేధ వరకు అనేక రంగాల్లో తనదైన ముద్ర వేయగలడు. అలాంటి వ్యక్తి ఒక దేశంలో తన వ్యాపారానికి అనుమతులు రావడం ఆలస్యమవుతోందని ఓపిక పట్టలేకపోతున్నాడా? లేక తనకు పోటీగా ఉన్న వ్యాపారవేత్తను, ఆ వ్యాపారవేత్తకు అనుకూలంగా ఉందని తాను భావిస్తున్న వ్యవస్థను బహిరంగంగా గిల్లితే పనైపోతుందని అనుకుంటున్నాడా?

మస్క్ ప్రపంచంలోనే గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఒకడు కావచ్చు. కానీ ఆయన వ్యాపార ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలని భావించాల్సిన అవసరం లేదు. స్టార్‌లింక్ వస్తే మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి రావచ్చు. విద్యార్థులకు ఉపయోగపడవచ్చు. చిన్న వ్యాపారాలకు అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం కలగవచ్చు. విపత్తుల సమయంలో ఉపగ్రహ ఇంటర్నెట్ కీలకంగా మారవచ్చు. ఇవన్నీ మంచి ప్రయోజనాలే. కానీ, ఈ ప్రయోజనాలను ప్రస్తావించినంత మాత్రాన స్టార్‌లింక్‌కు నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలా? భారత ప్రభుత్వం తన భద్రతా ప్రమాణాలను పక్కనపెట్టాలా?

ఇది అమెరికా మార్కెట్ కాదు. భారతదేశం. ఇక్కడ సేవలు అందించాలనుకునే ఏ సంస్థ అయినా దేశ చట్టాలకు, భద్రతా నిబంధనలకు లోబడాల్సిందే. ఆ సంస్థ యజమాని మస్క్ అయినా, మరెవరైనా ఇదే వర్తించాలి… కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదాని ప్రకారం, స్టార్‌లింక్‌తో పాటు మరో రెండు ఉపగ్రహ కమ్యూనికేషన్ సంస్థలు కూడా భద్రతా పరిశీలన, స్పెక్ట్రమ్ కేటాయింపు వంటి ప్రక్రియలకు సంబంధించిన దశలోనే ఉన్నాయి…

అమెరికాలో తన వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు నెరపే ప్రపంచ కుబేరుడు, భారత్‌లో మాత్రం ఒక్కసారిగా స్వేచ్ఛా మార్కెట్‌కు మహా రక్షకుడిగా అవతరించడం వెనుక ఉన్న ప్రయోజనాల పట్ల కేంద్రం అలర్ట్‌గా, జాగ్రత్తగానే ఉండాలి… తప్పదు, అసలే అమెరికన్ కంపెనీ!

అంబానీని ప్రత్యర్థి తక్కువ అంచనా వేస్తే, అతడికి అసలు పోటీ అంటే ఏమిటో మార్కెట్‌లో చూపిస్తాడు… మనకు నచ్చినా నచ్చకపోయినా తన బిజినెస్ విస్తరణ పద్ధతి అదే… ప్రభుత్వాల్ని శాసిస్తాడు… మరి మస్క్ కూడా అంతే కదా… తనను ఏ ఇండియన్ కంపెనీ కూడా మిస్టర్ ప్రెసిడెంట్ మస్క్ అనలేదుగా… రియల్ బాస్ ఆఫ్ అమెరికా అని వెటకారం చేయలేదు కదా… సో, డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్ మిస్టర్ మస్క్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గుడ్ రిజల్ట్ ! గుడ్ ఫీడ్ బ్యాక్ ! – రేవంత్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌పై ఓ సర్వే !!
  • సరే, అంతరిక్షంలోనే తలపడదాం – మస్క్ మాటలకు అంబానీ చేతల జవాబు !!
  • కామెడీ కళ్యాణ్ ! రెనిగేడ్ కళ్యాణ్ ! నక్సలైట్లూ కామెడీ సరుకైపోయారా ?!
  • పాపం రాహుల్ ! మాటల్లో, వ్యవహార శైలిలో ఏదో భారీగానే తేడా కొడుతోంది !
  • ఈ అందాల జాస్మిన్ యువరాణి! మూలాలు వెతుక్కుంటూ ముంబైకి !!
  • న్యూయార్క్ సిటీ నిద్రపోదు.. టైమ్ స్క్వేర్ అస్సలు అలసిపోదు! 
  • బ్రాడ్‌వే షో – ఓ రంగస్థల అబ్బురం..! సురభి నాటకాలకు వంద మెట్లు పైన !!
  • స్టాక్ మార్కెట్… మహా పతనం వైపా? తాత్కాలిక సర్దుబాటా?
  • అవే పాత్రలు- భాషలు వేరు – నానా పటేకర్ ముందు ప్రకాశ్ రాజ్ దిగదుడుపే !!
  • ఇదొక ‘PRESS’ దందా ! ఐడీ కార్డులిస్తారట – స్టిక్కర్లు కూడా ఇస్తారట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions