Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవును, నేను నేషనలిస్టునే… సో వాట్..? అదేమైనా భ్రష్టాచారమా..?

March 22, 2026 by M S R

.

Priyadarshini Krishna    …. నిన్న ఒక ఆత్మీయులు మరొక ఒక వ్యక్తిని పరిచయం చేశారు , నా పేరు వినగానే అవతలి వ్యక్తి  ‘ఓహ్ … ఆమె నేషనలిస్ట్ కదా’ అని నన్ను లేబుల్ చేశారు … Yes…. నేను నేషనలిస్ట్ ని, బరాబర్ నేషనలిస్ట్ ని …. సో వాట్ …

అది బూతు కాదు, నేరం కాదు … అపచారం కాదు, గ్రహచారం అసలే కాదు… నీలాంటి mindset ఉన్న వారి వల్లనే 70 ఏళ్ళైనా భారత్ ఇంకా ఇంకా తోటివారితోనే యుద్ధం చేస్తూ అభివృద్ధి అవ్వకుడా కుంటుతోంది … ఇది నా ఫీలింగ్…

Ads

కానీ ఈ పోస్ట్ ఆ కామెంట్ ని ఖండించడానికి రాసినది కాదు …. బదల్తా హువా భారత్ ను Gen Zee లకు చూపించాలనే కంకణం కట్టుకున్న ప్రయత్నం గురించి … 70 ఏళ్ల భారత సినిమా రాసే విధానాన్ని తీసే విధానాన్ని మాత్రమే కాదు, చూసే విధానాన్ని కూడా మార్చేసింది ….
Yes…. నేను మాట్లాడుతున్నది దురంధర్ – సినిమా గురించి …


హిందీ సినిమా మొదలయిన దగ్గర నుండి సినిమా చరిత్ర చూసుకుంటే … కొన్నిపేర్లు – దాదాసాహెబ్ ఫాల్కే ని, ఆయన నిర్మించిన రాజా హరిశ్చంద్ర మినహా… తర్వాతి తరంలో వచ్చిన పృథ్వీరాజ్ కపూర్, బిమాల్‌ రాయ్, కమల్ అమ్రోహి , మహబూబ్ ఖాన్, గురుదత్, సత్యజిత్ రే, రాజకపూర్…. ఇంకా ఎందరెందరో భారత్ సినిమాని ప్రపంచం చూసేవిధంగా తీశారా అంటే- తీశారు అనే చెప్పాలి … కానీ వారు ఏం చూపించారు అని అడిగితే – వారు ఏం చూపించాలి అని అనుకున్నారో అవే చూపించారు ….

అంటే ఏంటి అని అడుగుతారా —- వినండి – హిందూ ముస్లింల మధ్య ప్రేమ కథలు, ముస్లిం రాజు హిందూ స్త్రీల మధ్య ప్రేమకథలు, ఆకలి కేకలు ఆకలి చావులు , ఎంగిలి కోసం అగచాట్లు …. ప్రపంచం అంతా భారత్‌ను పేద దేశంగా చూడాలని చాలా కష్టించారు … ఫలించారు ….

ఎందుకు అలా జరిగింది – వారంతా ముస్లిం భావజాలపు మేధావులు … అంతే కాదు, డెబ్బై ఏళ్లగా హిందీ సినిమాకి పనిచేసిన రచయితల పేర్లు చూడండి – సలీం జావేద్, ఖ్వాజా అబ్బాస్, గుల్షన్ నందా, అబ్రార్ అల్వీ …. వింటున్నారా పేర్లు …?!?!
రాసేది తీసేది వాళ్లే అయినప్పుడు ఆ సినిమాలు ఏ విషయం ప్రోపగండా చేసాయి మరి …?!?!


విషయం అక్కడితో ఆగలేదు… సినిమాలో హీరోలు కూడా ఖాన్లు అవతరించారు – ఇంకేముంది …
అదే సరుకు అదే ప్రోపగండా …. ఇక్కడివరకు చదివాక కూడా సినిమా చరిత్ర అర్థం అవలేదు అంటే మీరు ఈ పోస్ట్ చదవడం ఇక్కడితో ఆపేయండి ….

భారత రాజకీయాలను ఎలా కుళ్లబొడిచారో … భారత అభివృద్ధిని, economy ని ఎలా కుళ్లబొడిచారో … సరిగ్గా అదే విధంగా భారత సినిమాను (సంస్కృతిని) అంత కంటే లోతుగా కుళ్లబొడిచారు ….
చివరికి ఏ దశకు తీసుకెళ్ళారంటే… సినిమాలను ఎవరు తీయాలి, ఎవరు నటించాలి, ఎవరు అందులో పాటలు పాడాలి కూడా అండర్ వరల్డ్ డాన్లు మాత్రమే శాసించేలా దిగజార్చారు …. don ల, దావూద్ ల జీవిత చరిత్రలు రాసి వాళ్ళను హీరోలను చేసి సొమ్ము చేసుకున్నారు ….


yashraj dharma ప్రొడక్షన్స్ తీసిన అన్ని సినిమాల్లో భారత ఆత్మను చంపేసి అర్ధనగ్న నృత్యాలతో నింపేసి పబ్బం గడుపుకున్నారు…
చిన్న చిన్న సినిమాలు పక్కన పెట్టండి, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు, నిర్మాతలు, దర్శకులు, హీరోలు, హీరోయిన్లు అందరూ మూకుమ్మడిగా vested interests చేతుల్లో కీలుబొమ్మలైపోయారు ….
ముంబై TAJ షూటౌట్ జరిగితే ఒకానొక తింగరి డైరెక్టర్ taj కి తాను తీయబోయే సినిమాకి సరంజామా వెతుక్కోడానికి సీఎం వెనకనే వెళ్లాడు అంటే అర్థం చేసుకోండి … సినిమాల పైన అండర్ వరల్డ్/ టెర్రర్ ల నీడ ఎంత వుందో ….

భారత్ గొంతుక వినిపించే అవకాశం వచ్చినప్పుడు … భారత్ ఆత్మని ప్రస్ఫుటం చేసే సమయం వచ్చినప్పుడు కూడా మనం మన వాదాన్ని ప్రపంచానికి వినిపించడం ‘Propaganda’ అంటే …. మరి కానిది ఏంటో సోకాల్డ్ ఆ లెఫ్ట్ కమ్మీ సెక్యులర్ వాదులనే అడగాలి ….

మీకు మాత్రమే ideology ఉంటుంది
మీకు మాత్రమే Freedom of speech ఉంటుంది …. అంతేనా?

పంజాబీలో ఓక సామెత ఉంది –
సడ్డా కుత్తా కుత్తా , తుహాడా కుత్తా టామీ!?? ….
నీ కుక్క ఏమో Tommy, మాది మాత్రం వీథి కుక్కనా …?!?!
తెలుగులో ఇంతకంటే మోటు సామెత వుంది – మీ అందరికీ తెలుసు : నువ్వు చేస్తే – – – !!

నోట్…: దురంధర్ పైన ఇంకోసారి రాస్తాను… పి స్: ముఖచిత్రం, అనగా పోస్టర్ ఆడియన్స్ అటెన్షన్ కోసం మాత్రమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో, నో… నేను దురంధర్ సినిమా చూడను… ప్లీజ్, నన్నొదిలేయండి…
  • అవును, నేను నేషనలిస్టునే… సో వాట్..? అదేమైనా భ్రష్టాచారమా..?
  • ‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్‌ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!
  • కొందరు బ్రాండ్లను నమ్ముకోరు – వాళ్లే స్వయంగా బ్రాండ్లు అవుతారు…
  • పొలిటిషయన్ తెలివి ముందు జర్నలిస్టుల తెలివి… జస్ట్ ఓ జుజుబీ…
  • సినిమా- రాజకీయం… పడుగూపేక..!! అరవ పాలిటిక్స్ అదోరకం… ఎలాగంటే..?
  • గ్యాస్, పెట్రో, డీజిల్ మాత్రమే కాదు… ఎరువులకూ కొరత ప్రమాదం…
  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…
  • ఒకే వ్యక్తి తల్లి ప్లస్ తండ్రి..! ఈ ప్రచారం ఏమిటి..? అసలు నిజాలు ఏమిటి..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions