పెద్దగా తేడాలున్నాయా అంటే..? ఎప్పటిలాగే టీవీ9 దూసుకుపోతోంది రేటింగుల్లో… ఒకానొక దశలో ఎన్టీవీ ఫస్ట్ ప్లేసులోకి వెళ్లి, టీవీ9ను రెండో స్థానంలోకి తొక్కేసినా సరే… సాక్షి టీవీ ముఖ్యుల మీద విపరీతమైన ఆరోపణలు వాట్సప్ గ్రూపుల్లో సెన్సేషన్ రేపుతున్నా సరే… టీవీ9 వైసీపీ చానెల్ అనే ముద్ర వేయబడినా సరే… ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంది ఇప్పుడు రేటింగుల్లో…
హైదరాబాదు కేటగిరీలో అయితే దానికి అస్సలు తిరుగులేదు… ఎన్టీవీ మీద కూడా వైసీపీ ముద్ర వేయబడింది కదా… ఈరోజుకూ అదే సెకండ్ ప్లేసు… అంటే ఏపీలో అనేక చోట్ల ఎమ్మెస్వోల మెడల మీద కత్తులు పెట్టి ఈ రెండు ప్లస్ సాక్షి ప్రసారాలను ఆపేస్తున్నారని కదా వార్తలు, ఫిర్యాదులు గట్రా… ఏమాత్రం ఇంపాక్ట్ లేదు… ఆ రెండూ తమ హవా కొనసాగిస్తున్నాయి… అంటే ఏపీలో ఎమ్మెస్వోలు టీడీపీ కూటమి బెదిరింపులకు పెద్దగా లొంగలేదనే అర్థమా..?
Ads
కానీ ఒకటిమాత్రం నిజం… గత వారంతో పోలిస్తే టీడీపీ చానెళ్లుగా ముద్రపడిన ఏబీఎన్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, టీవీ5 అతి స్వల్ప పెరుగుదలను నమోదు చేసుకున్నాయి… విచిత్రంగా కొన్ని వారాలుగా టీవీ5ను కూడా దాటేసి మూడో స్థానంలో కనిపించిన సాక్షి టీవీ ఆరో ప్లేసుకు పడిపోయింది… టీడీపీ కూటమి చానెళ్లు దాన్ని దాటేశాయి…
అదేం చిత్రమో గానీ… హైదరాబాదు కేటగిరీలో సాక్షి మరీ పదో ప్లేసుకు పడిపోయింది… ఘోరం ఏమిటంటే పాపం, మరీ మహా న్యూస్ కూడా దాన్ని దాటిపోయింది ఈ మార్కెట్‌లో..!! టెన్ టీవీ ఓవరాల్ రేటింగులో పర్లేదు అనిపించుకున్నా, హైదరాబాద్ మార్కెట్‌లో మరీ సాక్షికన్నా డౌన్ అయిపోయింది… సరే, హైదరాబాద్ మార్కెట్‌లో తెలంగాణ వార్తల కోణంలో వీ6 సెకండ్, టీ న్యూస్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి, సహజమే…
ఆసక్తికరం ఏమిటంటే… హైదరాబాద్ మార్కెట్‌లో ఈటీవీ తెలంగాణ చానెల్ కూడా చూస్తున్నారన్నట్టుగా రేటింగ్స్… ప్చ్, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది… ఆ ప్రభుత్వ వార్తలు టీడీపీ బాపతు చానెళ్లలో ఎక్కువగా వస్తుంటాయి… పైగా ఎంఎస్వోల మీద ఆంక్షలు, కత్తులు, బ్యాన్‌లు, ప్రసారాల నిలిపివేతల వార్తలు… ఐనా సరే, టీడీపీ కూటమి చానెళ్లు ఎన్టీవీ, టీవీ9 చానెళ్లను బీట్ చేయలేకపోతున్నాయి… అదే ఈ వారం బార్క్ రేటింగుల విశేషం…
Share this Article