Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

డౌన్ టు ఎర్త్… బ్రహ్మచారి… పుదుచ్చేరి అంటే ఎన్.రంగస్వామే…

May 9, 2026 by M S R

.

మనం గోవా మాజీ ముఖ్యమంత్రి దివంగత పరీకర్ నిరాడంబరత గురించి చాలా చదువుకున్నాం కదా… సీఎం అయి ఉండీ ఓ సామాన్యుడిలా వీథుల్లో తిరిగేవాడు… డౌన్ టు ఎర్త్… రేర్ పీస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్… మనం ఓసారి ఎన్ఆర్ రంగస్వామి గురించి చదివినా తనే గుర్తుకొస్తాడు… ఈయన కూడా సేమ్ పీస్… పేరుకు పుదుచ్చేరి చిన్న రాష్ట్రమే కావచ్చుగాక… సగం సగం అధికారాల రాష్ట్రమే కావచ్చుగాక… కానీ రంగస్వామి రంగస్వామే…

వరుసగా ఐదోసారి ముఖ్యమంత్రి కావడం అంటే విశేషమే కదా… చాలామందికి ఒకసారి జెడ్పీటీసీగా గెలిస్తే మళ్లీ గెలవడమే కష్టం… ఒకసారి సర్పంచిగా గెలిస్తే మళ్లీ గెలవడం కష్టం… అలాంటిది ఈయన 2001 నుంచి నాలుగుసార్లు ముఖ్యమంత్రి… ఈనెల 13న ఐదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు… పుదుచ్చేరి రాజకీయాల్లో తనేం చెబితే అదే ఫైనల్… అంత పవర్ ఫుల్ కేరక్టర్…

Ads

puduchery

INDIA – MARCH 25: N Rangasamy, Chief Minister of Pondicherry at a Tea Stall where he meets common people and receives the petitions from them while riding on his bike in Pondicherry, India (Photo by Hk Rajashekar/The The India Today Group via Getty Images)

1950 లో పుట్టిన ఈ 75 ఏళ్ల పెద్ద మనిషి లైఫంతా జనానికే అంకితం… పెళ్లి కూడా చేసుకోలేదు… అలా ఓ పాత మోటార్ సైకిల్ వేసుకుని సిటీలో తిరగేస్తూ ఉంటాడు అప్పుడప్పుడూ… పరీకర్‌లాగే నిరాడంబరుడు… ఆయన ఆధ్యాత్మికంగా కూడా చాలా చురుకుగా ఉంటాడు, ముఖ్యంగా తన గురువు ‘అప్పా పైత్యం స్వామి’ పట్ల అమితమైన భక్తిని ప్రదర్శిస్తాడు…

ఇప్పుడు ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి అవుతున్నాడు… కానీ తన రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్‌లో ప్రారంభమైందే… 1990లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు, తరువాత వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే… ముగ్గురు సీఎంల దగ్గర మంత్రిగా చేసి, 2001లో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాడు… సొంత పార్టీలో కుట్రలు ప్రబలి, ఫిర్యాదులు చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ సీఎం పదవి నుంచి దిగిపో అని ఆదేశించింది… ఆ కోపంతో  సొంతంగా తన పేరుతోనే 2011లో ఓ పార్టీ పెట్టేసుకున్నాడు… ఎన్ఆర్ కాంగ్రెస్, అంటే ఎన్ రంగస్వామి కాంగ్రెస్ అన్నమాట…

ఎన్ఆర్సీ

ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ (AINRC)… ఇందులో ఎన్ఆర్ అంటే నమదు రాజీయం … అంటే మన రాజ్యం అని… 2011లో తన పార్టీ తరఫునే ముఖ్యమంత్రి… తరువాత 2021లో మరోసారి ఎన్డీయే తరఫున… ఇప్పుడు ఐదోసారి మళ్లీ ఎన్డీయే తరఫున…

తన సామాజికవర్గం వన్నియార్… పుదుచ్చేరిలో బాగా ప్రభావశీల సామాజికవర్గం… తమిళనాడులోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో కూడా… వీరు ప్రధానంగా వ్యవసాయం, భూమిపై ఆధారపడిన సామాజిక వర్గం… తమిళనాడు, పుదుచ్చేరిలో వీరు అత్యంత బలమైన ఓటు బ్యాంకు… క్షత్రియ మూలాలున్న వారుగా (అగ్నికుల క్షత్రియులు) కూడా పిలుస్తారు…. ఇదీ రంగస్వామి అంటే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • డౌన్ టు ఎర్త్… బ్రహ్మచారి… పుదుచ్చేరి అంటే ఎన్.రంగస్వామే…
  • సతీ లీలావతి..! తెలుగు టీవీ సీరియళ్లు ఇష్టపడేవారి కోసం..!!
  • బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు… ఓ అమ్మాయిపై ఘాతుకం…
  • అతిశయం, ఆభిజాత్యం… వాణిశ్రీకి సరిగ్గా నప్పే ప్రౌఢ పాత్ర…
  • నంబర్లాట- నవ్వులాట..! అనామక పార్టీలూ ‘ఆడుకుంటున్నయ్’…!!
  • ఇదేం సినిమా రవిబాబూ..? థియేటరంతా నెత్తుటి కమురు వాసన…!
  • పరివార్‌వాద్… వారస రాజకీయాలు… ఏ పార్టీ మినహాయింపు కాదు…
  • సువేందు..! మరో సంఘేతర బీజేపీ సీఎం..! నాన్- భద్రలోక్ కూడా..!!
  • తమిళ రాజకీయ తెరపైకి హఠాత్తుగా రజినీకాంత్… ఉమ్మడి సర్కారు…
  • బెంగాల్‌ కమల వికాసం… చదివి తీరాల్సిన ఓ పొలిటికల్ పోస్ట్‌మార్టం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions