ఏమిటి ఈ దారుణమైన స్టేట్‌మెంట్ అనిపిస్తోందా..? ప్రపంచంలో కొన్ని లక్షల కుటుంబాల్ని ఛిన్నాభిన్నం చేసిన చైనా వాడి నీచ వైరస్‌ను ఆహ్వానించడం ఏమిటి అని ఆశ్చర్యమేస్తోందా..? కానీ నిజంగానే ఓసారి ఆహ్వానించాలి… అది వచ్చి అలుముకుంటే ఆనందించాలి… హమ్మయ్య, దేవుడిచ్చిన బూస్టర్ డోస్, అసలైన వేక్సిన్ అని ఆనందపడాలి… అవును, ఒమిక్రాన్ వేరియంట్ వస్తానంటే అస్సలు వద్దనకూడదు… అడ్డుకోకూడదు…
ఛల్ హట్, ఇంకా ఇంకా దిక్కుమాలిన బూస్టర్ డోసులు, దానికి డప్పుపాడే వుహాన్ బిడ్డల వంటి మీడియా వ్యభిచారుల రాతలు… మళ్లీ మళ్లీ ఎన్నేళ్లు వేస్తారురా డోసులు..? మనిషిలోని రోగనిరోధకశక్తి కాస్తా అడుగంటి, ఇక ప్రతి చిన్న వైరస్‌కూ బేర్‌మని కళ్లు తేలవేసే దుస్థితి తీసుకొస్తారా..? నిజానికి మెడికల్ మాఫియా ఇప్పుడు భూగోళాన్ని పట్టిపీడిస్తున్న అసలైన కరోనా వైరస్… డ్రగ్ పాలసీ, పాండెమిక్ ప్రొటోకాల్ విషయాల్లో అవినీతితో కుళ్లికంపుకొడుతున్న ప్రతి ప్రభుత్వ శాఖా అంతే…
ఆ బుడతకీచు చైనా వాడి జీవాయుధం ఫస్ట్ టార్గెట్ ఇండియా… బహుశా మనకోసమే రెడీ చేస్తుండే ఉంటాడు… ఆ వుహాన్ ల్యాబ్ నుంచి పొరపాటున లీకైనట్టుంది… WHO అనే మరో చెత్త సంస్థ ఉందిగా… అదీ మన ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ అథారిటీ వంటిదే… చైనా వాడు చెప్పినట్టు ఆడుతుంది… (వైరస్ ప్రపంచదేశాల్ని చుట్టుకోకముందే కొన్ని సైట్లు ఈ వైరస్ లీక్ ప్రమాద హెచ్చరికల్ని మోగించాయి… ‘ముచ్చట’ అప్పట్లో వాటిని పబ్లిష్ చేసింది…) తర్వాత ప్రపంచ దేశాలన్నీ విలవిలలాడాయి… మన కేంద్ర ప్రభుత్వ అసమర్థత, కురచ బుర్రల కారణంగా, అంతర్జాతీయ విమానాల్ని సకాలంలో నిషేధించక మనమూ త్వరగానే దాని బారినపడ్డాం… తరువాత డెల్టా వేరియంట్… ఇక హాస్పిటళ్లు, ఫార్మా కంపెనీలు జనాన్ని అక్షరాలా ఊచకోత కోశాయి… లక్షల కోట్లు నిలువు దోపిడీ చేశాయి… మన దరిద్రపు ప్రభుత్వ విధానాల కారణంగానే చికిత్స ప్రొటోకాల్‌కు ఓ దశ లేక, ఓ దిశ లేక ప్రజానీకం దిక్కులేని దుస్థితిలోకి నెట్టేయబడింది…
Ads
తరువాత వేక్సిన్ దందా… ఆ లక్షల కోట్ల వికృత దందాకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వపు వికారపు ఆలోచనలు… ఇప్పటికీ సిగ్గులేని సమర్థనలు, గొప్పలు చెప్పుకోవడం, ఏతులు… కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణి అక్షరాలా ప్రజల్ని నిలువునా ముంచింది… ఇలాంటి ప్రభుత్వాలు మళ్లెప్పుడూ రావద్దురా బాబూ అని జనం లోలోపల శాపనార్థాలు పెట్టుకునే దురవస్థ… ఈ స్థితిలో రకరకాల మ్యుటేషన్లకు గురై, సహజంగానే తన శక్తిని కోల్పోయి ఒమిక్రాన్ రూపంలో వచ్చిపడింది కరోనా కొత్త వేరియంట్…
వ్యాప్తి బలంగా ఉంటుంది… కానీ అది గొంతు దిగడం లేదు… గతంలోలాగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం లేదు… అంతా ఓ వైరల్ ఫీవర్ తరహా… ఓ జలుబుతో కూడిన జ్వరంలాగా..!! దీంతో థర్డ్ వేవ్ వచ్చేసి, మళ్లీ జనాన్ని ఊచకోత కోయాలని వేచి ఉన్న డ్రగ్ మాఫియా, హాస్పిటల్ మాఫియా, మీడియా మాఫియాలకు నిరాశ… (వీటిలో మీడియాది అజ్ఞానం, డ్రగ్ మాఫియాది అతిజ్ఞానం, హాస్పిటల్ మాఫియాది బందిపోటు జ్ఞానం)… చాలామందికి ఒమిక్రాన్ సోకుతోంది… సోకినట్టు కూడా చాలామందికి తెలియదు, లక్షణాలే కనిపించకుండా నాలుగు రోజులకు అదే వెళ్లిపోతోంది… కొందరు మెడికల్ షాపులకు వెళ్లి నాలుగు యాంటీ బయాటిక్స్, నాలుగు డోలో-650 తెచ్చుకుని వేసేసుకుంటున్నారు, బయటపడిపోతున్నారు… కొందరు టెస్టుల జోలికే పోవడం లేదు… అందుకే ఒమిక్రాన్ అంటే ఈ డ్రగ్, మెడికల్ మాఫియాలకు కుతకుత కోపం మండుతోంది… ఇప్పటికీ మీడియా అజ్ఞానుల సాయంతో భయాన్ని పెంచాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు… కానీ జనానికి మళ్లీ మళ్లీ ఊచకోత కోయించుకునే ఓపిక లేదు, శక్తి లేదు, డబ్బూ లేదు…
ధైర్యం, తెగువ, తెగింపు ఉన్నవాళ్లు అసలు ఆ మాత్రల జోలికి కూడా పోవడం లేదు… ఇవేమీ జీనోమ్ టెస్టులు కాదు గనుక వస్తున్న కేసుల్లో ఎన్ని ఒమిక్రాన్ అనేది ఎవడికీ తెలియదు… కానీ symptoms బట్టి, టెస్టులు చేసే ప్రతి ఒక్కరికీ తెలుసు… ఇప్పుడు పాజిటివ్ వస్తున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రానే అని… డెల్టా జాడలేదు అని… అదొకసారి వస్తే ఇక దేవుడిచ్చిన బూస్టర్ డోసే… వేక్సినే… ప్రమాదకారి కాదు, ప్రాణాలు తీయదు, అదేసమయంలో రాబోయే వేరియంట్లకు అడ్డుకట్టలా మారగలదు… టీసెల్స్, యాంటీ బాడీస్ పెరుగుతయ్… మనలోని సహజ వైరస్ నిరోధకశక్తికి పదును పెట్టగలదు… అంటే, జస్ట్, ఓ వైరల్ ఫీవర్ లక్షణాలతో కరోనాతో ఇకపై ఎప్పుడూ పోరాడగల శక్తిని మనకు ఇస్తోంది ఒమిక్రాన్… అందుకే ఆహ్వానిద్దాం…
దేశంలో ఈ వేరియంట్ కారణంగా ఒక్కటంటే ఒక్క మరణమూ లేదు… చివరకు ఆల్‌రెడీ వృద్ధులు, ఊపిరితిత్తుల వ్యాధులున్నవాళ్లు కూడా ఆక్సిజెన్లు, ఐసీయూలు లేకుండా కోలుకుంటున్నారు… అంటేనే అర్థమైంది కదా, ఒమిక్రాన్ ఎంత హితకారి వేరియంటో… అది మన క్షేమం కోరే వేరియంట్, ఇలా వస్తుంది, అలా పోతుంది… కమాన్, డెల్టాను మించిన మరో వేరియంట్ వస్తుందా..? రమ్మనండి, మన దేహం రెడీ అయిపోతుంది, పోరాడుతుంది… మరి ఇప్పుడు చెప్పండి, ఒమిక్రాన్ మంచిదా చెడ్డదాా..?
ఐనా కోవర్జిన్‌గా ఉండటమే కరెక్టు కాదు, ఓసారి రావాలి… మనుషులకు ప్రాణం మీద తీపి గుర్తురావాలి, చుట్టూ ఉన్న నోటిమాట హితుల్లో అసలు హితులు ఎవరో తేలాలి… సొసైటీ స్పందన ఏమిటో అర్థం కావాలి, ఇప్పటికీ కరోనా బాధితుల పట్ల ఓ వివక్ష కనిపిస్తోంది… సో, నిజంగా అక్కరకు వచ్చేవాడెవడో తెలియాలి… ఆఫ్టరాల్ ఓ జలుబు, జ్వరం తీసుకొచ్చి, అన్నీ నేర్పించే ఒమిక్రాన్ మనిషికి నిజమైన దోస్త్… కాదంటారా..?! ఇది వితండవాదం కాదు, ఒక్కసారి కోవర్జినిటీ కోల్పోయినవాళ్లకు తెలిసే నిజవాదం..!! నిఖార్సయిన నిజం చెప్పాలా..? ఇప్పుడు కరోనా వైరస్ అనేది డెంగీ, టైఫాయిడ్, స్వైన్ ఫ్లూలకన్నా తక్కువ ప్రమాదకారి, తక్కువ నష్టదాయకి…!!
ఫలానా సుబ్బారావుకు జలుబు అట అని ఎవరైనా వార్త రాస్తే మీకు ఎలా అనిపిస్తుంది…? సిగ్గులేని మన మీడియా ఇంకా వాడికి కరోనా, వీడికి కరోనా అని దిమాక్ లేని రాతల్ని రాస్తోంది ఇంకా… థూ మీ బ చె …
.
(సమాజంలో పేరుకునే నష్టదాయక భయాల్ని భిన్నమార్గంలో తొలగించే ఓ పాత్రికేయ ప్రక్రియ, ఓ ప్రయత్నమే ఈ కథనం… అర్థం చేసుకోలేనివాళ్లు కాస్త దూరం ఉండండి ప్లీజ్…)
Share this Article