ఈ సుచీ లీక్స్ కొంచెం తిక్క యవ్వారంలాగే ఉంది… సింగర్ సుచిత్ర తమిళ సినిమా ఇండస్ట్రీలోని అక్రమ సంబంధాలు, లోపాయికారీ వ్యవహారాల మీద గతంలో విపరీతంగా సోషల్ పోస్టులు పెట్టి గెలికేది కదా… ఈమధ్య మళ్లీ యాక్టివ్ అయిపోయింది కదా… ఇలాంటివాళ్లలో కస్తూరి, చిన్మయి, సుచిత్ర పేర్లు బాగా వినిపిస్తుంటాయి…
కాకపోతే చిన్మయి కొంత బెటర్, సోషల్ ఇష్యూస్ మీద కాస్త మెచ్యూర్డ్‌గా స్పందిస్తుంది… కస్తూరి సగం వెర్రి… సుచిత్రకు పూర్తిగా సెన్సేషనల్ కంట్రవర్సీ కోరుకునే ఏదో మేనియా ఉన్నట్టుంది… అఫ్‌కోర్స్, ఆమె చెప్పేవాటిల్లో కొన్ని నిజాలు అయి ఉండవచ్చు కూడా…
తాజాగా విజయ్, త్రిషల మీద కామెంట్లు పెట్టింది… విజయ్, ఆయన భార్య సంగీత తిరిగి కలవాల్సి ఉంది, చిన్న చిన్న గొడవలతో వాళ్ల కుటుంబం చితికిపోయింది, ఈలోపు త్రిష విజయ్ జీవితంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. వాళ్లిద్దరినీ ఎంజీఆర్, జయలలిత బంధంతో పోలుస్తున్నారు అంటూ జయలలిత మీద కూడా కామెంట్లు చేసింది సుచిత్ర…
Ads
‘‘ఎంజీఆర్‌కు జయలలిత పరాన్నజీవి… ఆయన నుంచే రాజకీయాల్లో పట్టుసాధించి, తరువాత విస్మరించింది… ఈ కారణం వల్లే కరుణానిధికీ జయలలిత అంటే ఇష్టముండేది కాదు… కాకపోతే జయలలిత రాజకీయాల్లో నిలదొక్కుకున్నాక జనానికి మంచే చేసింది… అయితే త్రిషకు ఆ చాన్స్ లేదు, ఎందుకంటే విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కాలేడు, రాజకీయాలపై విజయ్‌కు సలహాలు ఎవరిస్తున్నారో గానీ అన్నీ తప్పుడు సలహాలు’’ అని చెప్పుకొచ్చింది…
అదసలే తమిళనాడు… వ్యక్తి పూజ చాలా ఎక్కువ… తాము ఆరాధించేవారిని ఎవరేమన్నా తట్టుకోలేరు, సీరియస్‌గా రియాక్టవుతారు… ఇంకేముంది..? త్రిషను ఏకంగా జయలలితతో పోల్చి పరాన్నజీవి, అసలు విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కాడు వంటి వ్యాఖ్యలు సోషల్ దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి… ఐనా సుచిత్ర కోరుకునేది కూడా ఈ వివాదాలే కదా…
నిజానికి త్రిషకు అప్పట్లో ఏదో పెళ్లి సంబంధం చెడిపోయినట్టు గుర్తు… ఇప్పుడు మళ్లీ భీకరమైన ఫామ్‌లోకి వచ్చింది… నిజంగానే ఆమె ఎంజీఆర్‌కు జయలలితలాగా విజయ్‌తో సాన్నిహిత్యం కోరుకుంటే అది ఆమె వ్యక్తిగతం, ఇండస్ట్రీలో అవి పెద్ద ఇష్యూస్ కూడా కావు… రాజకీయాల్లో సక్సెస్ అవుతాడా లేదానేది వేరే విషయం గానీ విజయ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతాడు, తనకు చాలా యాంబిషన్స్ ఉన్నాయి…
జయలలితలాగే త్రిష కూడా అందగత్తె… వయస్సు మీద పడుతున్నా సరే ఆమె స్టామినా మారడం లేదు… ఇన్నేళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఉండటం ఒకరకంగా ఆమె సూపర్ అచీవ్‌మెంట్ (ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం)… ఇక రూటు కాస్త మార్చి రాజకీయాల్లో లక్ ట్రై చేసుకోవాలని నిజంగానే అనుకుంటే దాన్నీ తప్పుపట్టలేం… ఆమె లక్ష్యాలు ఆమె ఇష్టం, ఆమె అదృష్టం…
సో, విజయ్ వెంట త్రిష కూడా ఏమైనా పొలిటికల్ యాంబిషన్స్ నెరవేర్చుకోవాలని గనుక అనుకుంటే అందులో తప్పుపట్టడానికి ఏమీలేదు… దీనికి పరాన్నజీవి వంటి వ్యాఖ్యలూ అవసరం లేదు… కానీ సుచిత్రకు అలాంటివేమీ పట్టవు… ఓ పోస్టు జనంలోకి వదిలామా, అందరూ దాన్ని చర్చించుకుంటున్నారా, వీలైనంత వివాదం క్రియేటైందా లేదానేదే ముఖ్యం ఆమెకు… ఇక్కడా అంతే..!
Share this Article