Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆడ మగ బ్యాలెన్సింగు కోసం… బీబీ హౌజులోకి మరో ఆడ మనిషి…

October 2, 2023 by M S R

తిక్కలోడు బిగ్‌బాస్… గత సీజన్‌లాగే ఈ సీజన్ క్రియేటివ్ టీం బుర్రలు పనిచేస్తున్నట్టు లేవు… అందుకే షో చప్పగా సాగుతోంది… ఉల్టా పుల్టా అని ఏవేవో కథలు పడ్డా అసలు మ్యాటర్ ఇప్పుడూ వీకే… అందుకే రేటింగ్స్ మళ్లీ ఢమాల్… ఎక్కడ తప్పు జరుగుతున్నదో వెనక్కి తిరిగి చూసుకునే సోయి కూడా లేకుండా పోయింది బిగ్‌బాస్‌కు…

గ్లేరింగ్‌గా కనిపించేది ఏమిటంటే..? ఆడ కంటెస్టెంట్లను వరుసగా బయటికి పంపించేయడం… షకీలా ఫస్ట్ ఔట్… తరువాత కిరణ్ రాథోడ్… మొన్న సింగర్ దామిని… తాజాగా రతిక రోజ్… 14 మందినే ఈసారి పోటీలోకి తీసుకోగా… అందులో ఏడు మగ, ఏడు ఆడ… ఈ ఏడు ఆడల్లో నలుగురు ఆడలు బయటికి వెళ్లిపోయాయి… దాంతో ఆడ మగ బ్యాలెన్స్ తప్పింది… ప్రస్తుతం హౌజులో ముగ్గురు ఆడ, ఏడుగురు మగ ఉన్నారు…

ఏదో అస్త్ర సంపాదించి శోభాశెట్టి హౌజ్‌మేట్ కావడంతో ఓ రెండువారాల ఇమ్యూనిటీ వచ్చినట్టుంది… సో, ఈలోపు మిగిలిన ఇద్దరినీ పంపించేస్తే (శుభశ్రీ, ప్రియాంక) ఆనక శోభాశెట్టికీ ఎసరు పెడితే… ఇక మిగిలేది మగమేళమే… ఇక మజా ఏముందిరా ఆటలో…! ఇదేదో తేడా కొడుతోందని ఆలస్యంగా బిగ్‌బాస్ బుర్రకు వెలిగినట్టుంది… అందుకే మిగతా సర్‌ప్రైజ్ ఎంట్రీలను అలా పక్కన పెట్టేసి అర్జెంటుగా సాయిపావని రాజును వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రవేశపెడుతున్నాడట…

Ads

ఆమె పెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు… యూట్యూబ్ ఆర్టిస్ట్… ఇన్‌ఫ్లుయెన్సర్ అనాలట… ఫేస్‌బుక్ యాక్టివిస్టును డిజిటల్ క్రియేటర్ అన్నట్టుగా…! అసలు బయటికి పంపించేయాల్సింది ముందుగా శివాజీని… వీసమెత్తు ఎంటర్‌టెయిన్‌మెంట్ చేతకాదు, అనవసర పెత్తనాలు తప్ప…! ఈ పెత్తందారీ పోకడ భరించలేక కంటెస్టర్లు శివాజీ బయాస్డ్ అని ముద్రవేశారు… ఇక తన అస్త్రను పగులగొట్టి, డిమోషన్ ఇచ్చి, ఖరారైన హౌజ్‌మేట్‌షిప్ వాపస్ తీసుకోవాల్సి వచ్చింది బిగ్‌బాస్‌కు…

కానీ శివాజీకి తెగ సపోర్టర్ నాగార్జున ఉన్నాడు కదా… శివాజీనే వెనకేసుకొని వస్తూ, శివాజీ తప్పేమీ లేదని దాదాపు దబాయించి అందరూ అంగీకరించేలా చేశాడు సండే షోలో… మరీ అంత ‘అతి మద్దతు’ దేనికి నాగార్జునా…? ఆ గరుడ పురాణవేత్తకు పెద్ద సీనేమీ లేదు… తనతోపాటు కోపిష్టి యావర్, తింగరి తేజలు సరేసరి… అసలు వీళ్లలో ఎవరైనా బయటికి వెళ్తే బాగుండేది… తిక్కల వాదనలున్నా సరే రతిక కాస్త నయం… ఇండివిడ్యుయాలిటీ చూపించింది…

అయితే రకరకాల వోటింగుల్లో రతిక తక్కువ వోట్లు సంపాదించింది కాబట్టి ఈ ఎలిమినేషన్ కూడా ఫేక్ కాదనీ, జనాభిప్రాయం మేరకే జరిగిందనీ మనం అంగీకరించాలి… కానీ ఆట నడిచేది, నిర్ణయాలు తీసుకునేది బిగ్‌బాస్, నాగార్జున తమ సొంత విచక్షణతో… అందుకని రతికను సేవ్ చేసి, ఇంకొన్నాళ్లు ఉంచేసి, ఏ తేజనో, ఏ శివాజీనో బయటికి పంపిస్తే బాగుండేది… ఈ ఆడ, మగ బ్యాలెన్స్ మరీ అదుపు తప్పకుండా ఉండేది… పోనీలే, రావమ్మా సాయిపావనీ… అసలే మగ కంటెస్టెంట్లు హగ్గుల కోసం మొహాలు వాచిఉన్నారు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions