Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇప్పటి బుల్లిరాజే కాదు… అప్పట్లో జయప్రద కూడా ‘కొరికేసేది’…

January 23, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. కొరికేస్తా కొరికేస్తా అనే బుల్లిరాజు డైలాగ్ ఇప్పుడు పాపులర్ అయింది . కొరుకుతా అనే డైలాగ్ ఈ సినిమాలో 1981 లోనే జయప్రద చేత పలికించారు . ఊళ్ళో పెంకిఘటంగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఊరు మోతుబరి కూతురు జయప్రద ఊత పదం అది .

కృష్ణ- రాఘవేంద్రరావు కాంబినేషన్లో 1981 సంక్రాంతి సీజన్లో విడుదలయిన సూపర్ హిట్ మూవీ ఈ ఊరుకి మొనగాడు . రొటీన్ కక్షసాధింపు కధ అయినా పూర్తి గ్రామీణ వాతావరణంలో బావామరదళ్ళ సవాళ్లు , సరదా ముచ్చట్లతో చక్కటి ఫీల్ గుడ్ మూవీగా మలిచారు రచయిత సత్యానంద్ , దర్శకుడు రాఘవేంద్రరావు .

Ads

1977 లో వచ్చిన దివిసీమ ఉప్పెనను , ఆనాటి ఫొటోలను సినిమాలో బాగా ఉపయోగించుకున్నారు . అలాగే చంద్రమోహన్ , అతని మరదలు రాజ్యలక్ష్మి ప్రేమాయణం , వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు హీరోతో పాటు వెళ్ళి అక్కడ కలరా వచ్చి చనిపోవటం , తల్లి నిర్మలమ్మ అందుకు ఖిన్నురాలు కాకుండా , గర్వపడుతున్నానని చెప్పటం చాలా బాగా రక్తి కట్టించారు .

కృష్ణ- జయప్రద జోడీ కూడా బాగా వర్కవుట్ అయింది . ఇద్దరినీ రాఘవేంద్రరావు బాగా అందంగా చూపారు . ఇద్దరూ హుషారుగా , అల్లరల్లరిగా సందడి చేస్తారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . రాఘవేంద్రరావు పాటల చిత్రీకరణ తెలిసిందే కదా !

ఇదిగో తెల్లచీరె ఇవిగో మల్లెపూలు సూపర్ హిట్ సాంగ్ . వేటూరా మజాకా ! ఆరుద్ర వ్రాసిన కదలి రండి మనుషులైతే అంటూ సాగే ఉప్పెన విరాళాల సేకరణ , సహాయ కార్యక్రమాల పాట కూడా సినిమాకు హైలైటే .
మిగిలిన అన్ని పాటలు కూడా శ్రావ్యంగా ఉండటమే కాకుండా బయటా హిట్టయ్యాయి .

మొగ్గ పిందేసిందే పాటలో రాఘవేంద్రరావు మార్క్ కుండలు , ముద్దుగుమ్మల బృంద నృత్యం సాక్షాత్కరిస్తాయి . చాలా అందంగా ఉంటుంది ఈ పాట చిత్రీకరణ . జయప్రదతో పాటు సమానంగా కృష్ణ నృత్యించడానికి బాగా కష్టపడతాడు .

ఈ సినిమా అంతా రామచంద్రాపురం దగ్గరి ఊళ్ళ అనే గ్రామంలో షూట్ చేయబడింది . లొకేషన్ల అందం కూడా సినిమా విజయానికి దోహదపడ్డాయి . కృష్ణ , జయప్రద , గీత , ప్రసాద్ బాబు , చంద్రమోహన్ , రాజ్యలక్ష్మి , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , కాంతారావు , పుష్పలత , ఝాన్సీ , మాడా , నిర్మలమ్మ , ఆనందమోహన్ , చలపతిరావు , గ్రామస్తులు నటించారు .

ఈ సినిమాలో అల్లు రామలింగయ్య డైలాగుల్లో ఆంధ్రప్రదేశ్ లోని చాలా ఊళ్ళ పేర్లను దూర్చారు . మా గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం , పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లితో సహా .

పద్మాలయా బేనర్లో హిందీలో జితేంద్ర , శ్రీదేవిలతో హిమ్మత్ వాలా పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే తీస్తే అక్కడా బాగా హిట్టయింది . శ్రీదేవి హిందీ ఫీల్డులో నిలదొక్కుకోవటానికి ఇది ఊతమిచ్చింది .

ఏడు సెంటర్లలో వంద రోజులు , షిఫ్టులతో కొన్ని సెంటర్లలో సిల్వర్ జూబిలీ , విజయవాడ , హైదరాబాద్ , వైజాగులలో రెండు వందల రోజులు ఆడింది . శ్రీదేవి తల్లి మా గుంటూరు జిల్లా రైట్సుని 3.2 లక్షలకు కొనుక్కుని మంచి లాభాలనే గడించిందట .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని కృష్ణ , జయప్రదల అభిమానులు తప్పక చూడతగ్గ అందమైన సినిమా . A watchable , entertaining , neat , musical , feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రభాస్ కొత్త ఇంట్లో కోటి రూపాయల కల్పవృక్షమట… నిజమెంత..?!
  • ఎంత ఎదిగితేనేం..? క్లోజ్ ఫ్రెండ్స్‌కు కూడా దూరమైందా రష్మిక..!?
  • సర్జరీ అందం కాదు, సహజం అట… సీత పాత్ర ఎంపికకు ఇదేం అర్హతట..!?
  • మయూరి… అప్పట్లో రామోజీరావు మంచి టేస్టున్న సినిమాలు తీశాడు…
  • ఫాఫం శ్రీలీల..! ఈ వైరల్ వయ్యారి రానురాను.. ఓ ఐటమ్ గరల్‌..!!
  • అది ఆధ్యాత్మిక ఏకాంతం కాదు… ఆమెకు కావల్సింది మానసిక చికిత్స..!!
  • చెట్లు రోదిస్తాయి… బాధను చెబుతాయి… కొన్ని జీవాలకు అర్థమవుతుంది…
  • నెవ్వర్… నో వే… ఇన్‌చార్జి సీఎం బాధ్యతలు ఎవరికీ ఇవ్వడు..! నమ్మడు..!!
  • మోడీ, పాడి రైతు పొట్టగొట్టకు… ఆ ట్రంపుడు అలా బెదిరిస్తాడు, బెదరకు..!!
  • సో వాట్..? శింబూ హీరో కావచ్చు, క్రికెట్ సూపర్ స్టార్‌కు తెలియాలా ఏం..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions