Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దేవుడా…! పార్లమెంటులో ప్రశ్నలు అడగడం కూడా ఓ దందాయేనా..?

October 20, 2023 by M S R

మొహువ మొయిత్ర-Mohuva Moitra! TMC MP! అడ్డంగా బుక్ అయ్యింది! పార్లమెంట్ లో తరుచూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది! కానీ డబ్బులు తీసుకుని మరీ ప్రశ్నలు వేస్తుంది!

జై అనంత్ దేహాద్రి – Jai Anant Dehadri! ఇతను సుప్రీం కోర్టు అడ్వొకేట్! మొహువ మొయిత్రకి క్లోజ్ ఫ్రెండ్! దర్శన్ హీరానందాని- Darshan Heeranandani! ఇతను బిజినెస్ టైకూన్ మరియు హీరానందాని గ్రూప్ కి చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్- CEO!

సదరు సుప్రీంకోర్టు అడ్వకేటు అయిన జయ్ అనంత్ CBI కి ఒక అఫిడవిట్ పంపించాడు! దానిలో TMC MP అయిన మొహువ మొయిత్ర హీరా నందాని దగ్గర డబ్బులు తీసుకొని పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగింది. నా దగ్గర బలమయిన ఆధారాలు ఉన్నాయి అని. ఒక సుప్రీం కోర్టు అడ్వొకేట్ ఆఫడవిట్ సీబీఐకి ఇచ్చి మరీ ఒక పార్లమెంట్ సభ్యురాలి మీద తీవ్ర అభియోగాలు మోపి, అవి నిరూపించే సాక్ష్యాలు ఇవ్వలేకపోతే సదరు అడ్వకేట్ బార్ అసోసియేషన్ నుండి తాత్కాలికంగానో లేదా శాశ్వతంగానో బహిష్కరించబడతాడు. కాబట్టి జయ్ అనంత్ దగ్గర నిరూపించతగ్గ ఆధారాలు ఉండే ఉంటాయి!

Ads

ఇంతకీ మొహువ మొయిత్ర , బిజినెస్ టైకూన్ దర్శన్ హీరా నందాని కలిసి ఎవరిని టార్గెట్ చేశారు? ఆదాని గ్రూప్ చైర్మన్ ఆదానీని!

సీబీఐకి సుప్రీంకోర్టు అడ్వకేట్ జయ్ అనంత్ ఇచ్చిన అఫిడవిట్ లో ఏమున్నది? కొన్ని వివరాలు బయటకి వచ్చాయి…..

1.మొహువ మొయిత్ర ఒక పార్లమెంటు సభ్యురాలిగా ఉంటూ తనకున్న అధికారాన్ని ఫణంగా పెట్టి పార్లమెంట్ ప్రొసీడింగ్స్‌ను మరియు కొన్ని పాలసీ విషయాలని హీరా నందానికి ఇచ్చి, డబ్బు తీసుకుంది. నిజానికి ఇవన్నీ రహస్యంగా ఉంచాల్సిన అంశాలు.

2.మహువకి లక్జరీగా బ్రతకడంలో విపరీతమయిన పిచ్చి ఉంది. అలా బ్రతకడానికి ఏదయినా చేస్తుంది. అవన్నీ హీరా నందాని ఇస్తాడు.

3.ఖరీదయిన i phones.

4.ఖరీదయిన వజ్రాలు మరియు ఎమరాల్డ్ ఆభరణాలు.

5.Scarves from Hermes and Louis Vuitton

6. 35 pair shoes of Salvatore Ferragamo.

7.ఖరీదయిన ఫ్రెంచ్ ఇటాలియన్ వైన్ బాటిళ్లు 12.

8.లక్జరీ కాస్మెటిక్స్ దుబాయ్ నుండి తెప్పించినవి.

9.GUCCI లక్జరీ బాగ్స్.

10.Berluti crocodile leather bag.

11.ఖర్చుల కోసం ప్రతి రోజూ భారతీయ కరెన్సీతో పాటు బ్రిటీష్ పౌండ్స్ ఇస్తాడు, ఇవి కాష్ రూపములోనే ఇస్తాడు.

12.హీరా నందాని తన ముందే 20,000 బ్రిటీష్ పౌండ్స్ మొహువకి ఇచ్చాడని తన అఫిడవిట్ లో పేర్కొన్నాడు జయ్ అనంత్!

13.పార్లమెంట్ సభ్యులు అందరికి లోక్ సభకి సంబంధించి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

14.వాటిలో ఆన్ లైన్ పోర్టల్ ఒకటి. ఈ ఆన్లైన్ పోర్టల్ లోకి యాక్సెస్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పోర్టల్‌కి కేవలం పార్లమెంట్ సభ్యులకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది.

15.ఈ ఆన్ లైన్ పోర్టల్ లో కూడా ప్రశ్నలు అడగవచ్చు మరియు సమాధానం కూడా అక్కడే వచ్చేస్తుంది.

16.మొహువ ఇప్పటి వరకు 61 ప్రశ్నలు అడిగితే వాటిలో 50 ప్రశ్నలు నేరుగా పార్లమెంట్ సమావేశాలలో అడిగింది.

17. 11 ప్రశ్నలు ఆన్లైన్ పోర్టల్ లో అడిగినవి ఉన్నాయి.

18.ఆన్లైన్లో అడిగిన11 ప్రశ్నలు మొహువ అడిగినవి కావు. తన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ హీరా నందానికి ఇస్తే హీరా నందాని అడిగాడు!

19.మొత్తం 61 ప్రశ్నలు ఏవేవి మొహువ ఆడిగిందో కూడా తన అఫిడవిట్ లో వివరంగా పేర్కొన్నాడు. ఆన్లైన్ లో అడిగిన ప్రశ్నలు కూడా పేర్కొన్నాడు. అఫ్కోర్స్ ఆన్ లైన్ లో అడిగిన ప్రశ్నలు తాలూకు లాగ్ ఫైల్ లోక్సభ సెక్రటేరియట్ లో రికార్డు ఉంటుంది. మరి ఆన్లైన్ లో అడిగినప్పుడు ఆ విషయం జయ్ అనంత్ కి ఎలా తెలిసింది అనేదే దోషిని పట్టిచ్చే ఆధారం!

20.మొహువ అడిగిన 61 ప్రశ్నలు అన్నీ హీరా నందాని గ్రూపుకి ప్రయోజనం కలిగించేవే.

21.ఈ క్విడ్ ప్రో కో 2018 నుండి జరుగుతున్నది.

22. మార్చి నెల 2020 లో హీరా నందాని 75 లక్షలు ఇచ్చాడు మొహువకి.

23.మే నెల 2021 లో హీరానందాని 2 కోట్లు ఇచ్చి గౌతమ్ ఆదానీని పార్లమెంట్ లో బయట టార్గెట్ చేయమని అడిగాడు.

24.మొహువ మొయిత్ర ఫ్లాట్ ని రెనోవేట్ చేయడానికి తన ఆర్కిటెక్ట్ ని పంపించాడు హీరా  నందాని.

25.ఆర్కిటెక్ట్ డిజైన్ చేయగానే తన ఇంట్లోని ఖరీదయిన ఫర్నిచర్ ని మొహువ ఫ్లాట్ లో పెట్టించాడు హీరా నందాని.

వెస్ట్ బెంగాల్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ తాలూకు టెండర్ కి సంబంధించి గౌతమ్ ఆదానీ, హీరా నందాని పోటీ పడ్డారు కానీ ఆదానీ అ టెండర్ లో సక్సెస్ అయ్యాడు. ఆ టెండర్ ని రద్దు చేయించమని మొహువ మీద ఒత్తిడి తెచ్చాడు హీరానందాని, కానీ మమత ని ఒప్పించడం కష్టం అని మొహువ తెలిపింది. టెండర్ రద్దు చేయించలేదు కాబట్టి పార్లమెంట్ లో, బయట ప్రెస్ మీట్ లలో ఆదానీని టార్గెట్ చేయమని కోరాడు, ఆ పని చేసింది మనం చూశాము.

ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. పార్లమెంట్ సభ్యులు డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడగడం నేరం అవుతుందా కాదా? పార్లమెంట్ ఆవరణలో కనుక డబ్బు తీస్కుంటే అది నేరం కాదుట! పార్లమెంట్ బయట కనుక డబ్బు తీసుకుంటే అది నేరం అవుతుందిట.

ఈ ఇష్యూ మీద ఈ నెలలోనే 7 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసి తీర్పు ఇవ్వబోతున్నది. ఒకవేళ కనుక డబ్బు తీసుకొని ప్రశ్నలు అడగడం నేరమే, దానికి రాజ్యాంగంలో ఎలాంటి రక్షణ లేదు అని తీర్పు వస్తే మొహువ మొయిత్రతో పాటు మరికొందరి మెడలకు ఉచ్చు బిగుస్తుంది! ఏమవుతుందో ఇంకో వారం ఆగితే తెలుస్తుంది….. Article By… పార్ధసారధి పోట్లూరి 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions